సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార పెళ్లి మొత్తానికి కన్ఫర్మ్ అయినట్టే. ఎందుకంటే ఆమె పెళ్లి విషయం పై తాజాగా నయనతార రెస్పాండ్ అవ్వడంతో ఆమె పెళ్లి...
Day: January 3, 2021
బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ గజ్జర్ క్రేజ్ బాగా మారిపోయింది. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిందో అప్పటినుండి మోనాల్ కు ఊహించని క్రేజ్ దక్కింది....
నకిలీ, డా.సలీమ్, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్ వంటి చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని. ఈయన హీరోగా.....
నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అసరాని హీరోయిన్ గా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై యుగంధర్ ముని దర్శకత్వంలో గీతా మిన్సాల నిర్మించిన సరికొత్త థ్రిల్లింగ్ చిత్రం “A”....
ఇటీవల ఏ. టి. టి మరియు ఓ.టి.టి వేదికలపై విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన డర్టీ హరి జనవరి 8 న...
ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ఇందులోకథానాయికలు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి గ్లిమ్స్ని ఆదివారం విడుదల చేశారు . "జైలు లో ఆదిత్య అనే ఖైదీ చెస్ అద్భుతంగా ఆడుతున్నాడు" అనే వాయిస్ ఓవర్ తో ఈ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఆదిత్యను విశ్వనాధన్ ఆనంద్ , కాస్పరోవ్ తో ఒకరు పోలిస్తే, ‘అతను పచ్చి తీవ్రవాది, టెర్రరిస్ట్, దేశద్రోహి’ అని పోలీస్ ఆఫీసర్ దూషిస్తాడు. 'HE IS INNOCENT' అని లేడీ అడ్వకేట్ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. 40 సెకన్ల నిడివి కలిగిన ఈ గ్లింప్స్, సినిమాలోని ఆసక్తికరమైన కోణాలని ఆవిష్కరించింది. ఈ సందర్బంగా నిర్మాత వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ "నితిన్- చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ పై అభిమానులు పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గదు ఈ సినిమా. ఈచిత్రం షూటింగ్ మొత్తం పూర్తయ్యింది . ప్రస్తుతం రీ - రికార్డింగ్ జరుగుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ‘ఐతే ‘ చిత్రం తర్వాతచంద్రశేఖర్ యేలేటి - కళ్యాణి మాలిక్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ఇదే. ఔట్ పుట్ అద్భుతంగా వచ్చింది. రిలీజ్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం" అని తెలిపారు. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ- ''చదరంగం నేపథ్యంలో సాగే ఓ ఉరిశిక్షపడ్డ ఖైదీ కథ ఇది '' అని చెప్పారు. నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరితదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సంగీతం : కళ్యాణి మాలిక్, ఛాయా గ్రహణం : రాహుల్ శ్రీవాత్సవ్ , ఆర్ట్ : వివేక్ అన్నామలై , ఎడిటింగ్ : అనల్ అనిరుద్దన్ , ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి , నిర్మాత : వి.ఆనంద ప్రసాద్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి.
ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని, సెలబ్రిటీలకు డిజైనింగ్ చేయాలని ప్రతి డిజైనర్ కోరుకుంటారు. అలా అనుకునే ప్రతి డిజైనర్ ముందుగా స్టోర్ ప్రారంభించి తమ ఉత్పత్తులను సెలబ్రిటీల దాకా చేరలనుకుంటారు. కానీ ప్రముఖ డిజైనర్ చంద్రిక కంచర్ల ఫ్యాషన్ రంగంలో ముందుగా రచ్చగెలిచిన తర్వాత ఇంటగెలవటానికి రెడీ అయ్యారు. ఆమె గతంలో ఎందరో సెలబ్రిటీలకు తన క్రియేటివ్ థాట్స్‌తో ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో తనకు తానుగా బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ‘ చంద్రిక కంచర్ల’ డిజైనింగ్ స్టూడియోను హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నం 44లో అధునాతన షోరూమ్‌ను భారీవ్యయంతో ప్రారంభించారు. చంద్రిక మాట్లాడుతూ. నా దగ్గరకు వచ్చే క్లైయింట్స్ తాము ధరించిన బట్టలు ఎంతో బావున్నాయని ఒక మెసేజ్ చేస్తే చాలా ఆనందం పొందుతాను. అదే ఉత్సాహంతో మార్కెట్‌తో పోటీపడుతూ కొత్త ఫ్యాషన్ లను అందుబాటులోకి తీసుకురావటం నా బాధ్యతగా ఫీలవుతున్నాను. ఈ స్టోర్‌లో వెడ్డింగ్ కలెక్షన్స్ కు సంబంధించి ఉమెన్, మేన్స్ కి స్పెషల్‌గా డిజైన్లను అందుబాటులోకి తీసుకొచ్చాను అన్నారు. ప్రముఖ యాంకర్ సుమ మాట్లాడుతూ–‘ చంద్రిక ‘డిజైన్లకు నేను పెద్ద ఫ్యాన్ ని. ఆమె కలెక్షన్స్ ను నేను ఎన్నో ఏళ్లుగా యూజ్ చేస్తున్నాను. షీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఫ్యామిలీ టు మీ. అలాగే జీవితంలో ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన ఆమెంటే నాకెంతో అభిమానం అన్నారు. నటి,నిర్మాత ప్రవీణా కడియాల మాట్లాడుతూ– మనం ఏది కొనుక్కోవాలన్న మొదట సెలక్షన్ ఇంపార్టెంట్. అలా ప్రతి ఒక్కరికి నచ్చే సెలక్షన్ స్టఫ్‌ని ఒకేచోట అందించటం ‘చంద్రిక స్పెషల్ అన్నారు.