October 1, 2023

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

ఏ1 ఎక్స్ ప్రెస్ రివ్యూ

దర్శకత్వం : డెన్నిస్ జీవన్ కనుకొలను
నిర్మాతలు : టి. జి. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం
సంగీతం : హిప్ హాప్ తమీజా
సినిమాటోగ్రఫీ : కవిన్ రాజ్
ఎడిటింగ్ : చోటా. కె. ప్రసాద్
నటీనటులు : సుందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, రావు రమేష్, మురళీ శర్మ, ప్రియదర్శి  తదితరులు..
విడుదల : 05 – 03 – 2021
రేటింగ్ : 2. 75 / 5

యంగ్ హీరో సందీప్ కిషన్ ఓ పక్క భిన్నమైన సినిమాలు చేస్తూనే మరో వైపు కమర్షియల్ ఫార్ములా సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న 25 వ చిత్రాన్ని కాస్త ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నట్టున్నాడు… అందుకే హాకీ నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామాగా ఏ 1 ఎక్స్ ప్రెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఇండియాకు ఒకప్పుడు ప్రైడ్ గేమ్ గా ఉన్న హాకీ ఇప్పుడు ఎంతమందికి తెలుసు. అసలు హాకీ నేపథ్యంలో సందీప్ కథను ఎందుకు ఎంచుకున్నాడు ? ఇంతకీ ఈ ఏ 1 ఎక్స్ ప్రెస్ ఎవరు అన్న విషయాలు తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..

కథ :

యానాం లోని ఓ ఫేమస్ హాకీ గ్రౌండ్ లో కథ మొదలవుతుంది. హాకీ ప్లేయర్ గా మంచి ఫామ్ లో ఉన్న సంజు ( సందీప్ కిషన్ ) తన జట్టు గెలవడానికి ఎంత దూరం అయినా వెళ్లే రకం. అలాంటి సంజు మరో హాకీ ప్లేయర్ లావణ్య ( లావణ్య త్రిపాఠి ) ప్రేమలో దింపేందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ సంఘటనల మధ్య .. హాకీ గ్రౌండ్ స్థలాన్ని కొట్టేసే ప్లాన్ చేస్తాడు అక్కడి లోకల్ పాపులర్ లీడర్ ( రావు రమేష్ ) ఆ గ్రౌండ్ ని పడగొట్టే ప్రయత్నాలను ఈ హాకీ ప్లేయర్ ఎలా అడ్డుకున్నాడు. అసలు సంజు ఎవరు ? ఎందుకు ఈ గ్రౌండ్ కోసం అంతగా పోరాటం చేస్తున్నాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు ప్రతిభ :

ఈ సినిమాకు మొదటి ప్రాధాన్యత హీరో సందీప్ కిషన్. ఈ సినిమా కోసం సందీప్ చేసిన హార్డ్ వర్క్ ఏమిటన్నది ప్రీతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఒక స్పోర్ట్స్ పర్సెన్ లానే కాకుండా రోమ్ కామ్ రోల్ లో కూడా సూపర్బ్ గా కనిపించాడు. మరి అలాగే సందీప్ ఎమోషన్స్ ను కూడా చాలా బాగా పండిస్తాడు అలాంటి కొన్ని విపరీత భావోద్వేగ సన్నివేశాల్లో సందీప్ మంచి నటనను కనబరిచాడు. అంతే కాకుండా హాకీ మ్యాచ్స్ టైం లో సెటిల్డ్ ఫిజిక్ తో ఓ రియల్ స్పోర్ట్స్ పర్సన్ లా కనిపిస్తాడు. ఇక మరో నటుడి గురించి చెప్పాలంటే అది రావు రమేష్ గురించే అయి ఉంటుంది. రావు రమేష్ పాత్ర చక్కగా ఉంది. ఓ పొలిటీషియన్ గా సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరకు ఆధ్యంతం సాలిడ్ నటనను కనబరిచారు. అలాగే మరో సెటిల్డ్ నటుడు మురళీ శర్మ హాకీ కోచ్ గా మంచి పాత్రలో కనిపించారు. ఇక లావణ్య త్రిపాఠి ఒక పక్క గ్లామరస్ గానే కాకుండా స్పోర్ట్స్ ఉమెన్ గా తన పాత్ర పరిధి మేర బాగా చేసింది. హీరో హీరోయిన్స్ మధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అయింది.

టెక్నీకల్ హైలెట్స్ :

ముఖ్యంగా కెవిన్ రాజ్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ సూపర్ అని చెప్పాలి. అలాగే హిప్ హాప్ తమీజా మ్యూజిక్ కూడా ఈ చిత్రంలో మరో ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. డైలాగ్స్ బాగున్నాయి, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఓకే అనిపిస్తుంది. ఇక దర్శకుడు డెన్నిస్ జీవన్ కనుకొలను విషయానికి వస్తే..ఆల్రెడీ తాను చేసింది రీమేక్ సబ్జెక్ట్ కాబట్టి మెయిన్ లైన్ లో చెప్పడానికి ఏమీ లేదు కానీ దానిని ఎలా హ్యాండిల్ చేసాడు అన్నదే ఇక్క పాయింట్. ఈ విషయంలో మాత్రం డెన్నిస్ కు తన మొదటి ప్రయత్నంలో మంచి మార్కులు వెయ్యొచ్చు. నటీనటుల నుంచి సాలిడ్ పెర్ఫామెన్స్ లను ఈ దర్శకుడు రాబట్టుకున్నాడు. అంతే కాకుండా కొన్ని ఎమోషన్స్ ను హ్యాండిల్ చేసిన విధానం కూడా బాగుంది. కాకపోతే కొన్ని సీన్స్ లో నరేషన్ పై ఇంకా ఎక్కువ దృష్టి పెడితే పెడితే బాగుండేది. ఈ నిర్మాణ విలువలు సూపర్. ఒరిజినల్ వెర్షన్ కంటే కూడా మేకర్స్ చాలానే మార్పులు చేర్పులు చెయ్యడమే కాకుండా అన్ని విభాగాల్లో కూడా టెక్నిషియన్స్ మంచి అవుట్ పుట్ ను అందించారు.

చివరగా :

మామూలుగా ఓ స్పోర్ట్స్ డ్రామా అంటే ఆ స్పోర్ట్స్ పర్సెన్ కు సంబంధించి కొన్ని ఇన్స్పైరింగ్ ఎపిసోడ్స్ ను ఆశిస్తారు. కానీ అలాంటి అంశాలు లేకపోవడం మైనస్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇంటర్వెల్ ట్విస్ట్ వచ్చే వరకు కథ బోరింగ్ గా సాగుతుంది . ఓ ఎంగేజింగ్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఏ 1 ఎక్స్ ప్రెస్ అన్ని రకాల ఎమోషన్స్ ని ప్రజెంట్ చేసింది. కామెడీ, యాక్షన్ సహా ఇంట్రెస్టింగ్ గా అనిపించే హాకీ ఎపిసోడ్స్ మరియు నటీ నటుల ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ లు చాలా బాగుంటాయి. కాకపోతే స్టోరీ లైన్ ఊహించిందే అయినప్పటికీ దాన్ని విజువల్ గా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా క్లైమాక్స్ మ్యాచ్ అయితే ఒక పక్క మంచి టెన్స్ తో పాటుగా అద్భుతమైన విజువల్స్ కనిపిస్తాయి.వీటితో పాటుగా ఈ స్పోర్ట్స్ లో ఎలాంటి కార్పొరేట్ పాలిటిక్స్ జరుగుతున్నాయి వాటిపై అందరు తెలుసుకోవాల్సిన ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆకట్టుకుంటుంది. అలాగే కథానుసారం వచ్చే ట్విస్ట్ కానీ అక్కడక్కడా కామెడీ సీన్స్ కానీ బాగుంటాయి. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిల కాంబో నవ్వులు బాగున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *