December 5, 2023

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

Akhil Akkineni’s Agent Shoot Starts Today

2 min read

Akhil Akkineni, Surender Reddy, Anil Sunkara’s Crazy Project Agent Shooting Begins Today

Young and promising hero Akhil Akkineni and stylish maker Surender Reddy are collaborating for the first time for a high budget stylish and action thriller Agent. The film’s first look poster presented Akhil in a never-seen-before dashing avatar.

Surender Reddy announced to commence the film’s shoot from today. Akhil will be seen in an action-packed role in Agent and it will feature a whole new side of him.

While director Surender Reddy released a back pose of Akhil in the gym yesterday, a new poster of the film is revealed today. Bulked up his physique, Akhil looks masculine here, as he lifts up his sleeveless vest. The poster also shows gun tucked in Akhil’s pants.

Vakkantham Vamsi is providing story for the film to be produced by Ramabrahmam Sunkara under AK Entertainments and Surender 2 Cinema.

The director-writer duo previously worked together for few blockbusters such as Kick, Race Gurram and they are on a mission to deliver another super hit in their combination.

This is already turning out to be a crazy project, given Akhil is a promising star, Surender Reddy is an accomplished director, Vakkantham Vamsi is a proficient writer and AK Entertainments is a successful banner.

A newbie Sakshi Vaidya is roped in to play the leading lady opposite Akhil in the film billed to be a spy thriller.

Tollywood’s busiest music director SS Thaman will be scoring music, while Ragul Herian Dharuman will crank the camera. National Award winner Naveen Nooli is the editor while Avinash Kolla is the art director.

Ajay Sunkara, Pathi Deepa Reddy are the co-producers of the film.

Cast: Akhil Akkineni, Sakshi Vaidya
Director: Surender Reddy
Producer: Ramabrahmam Sunkara
Co-Producers: Ajay Sunkara, Pathi Deepa Reddy
Executive Producer: Kishore Garikipati
Banners: AK Entertainments, Surender 2 Cinema
Story: Vakkantham Vamsi
Music Director: SS Thaman
DOP: Ragul Herian Dharuman
Editor: Naveen Nooli
Art Director: Avinash Kolla

అఖిల్ అక్కినేని, సురేంద‌ర్ రెడ్డి, అనిల్ సుంక‌ర క్రేజీ ప్రాజెక్ట్ `ఏజెంట్` షూటింగ్ ప్రారంభం.

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డిల ఫ‌స్ట్ క్రేజీ కాంబినేష‌న్‌లో హై బ‌డ్జెట్ మ‌రియు అత్యాధునిక సాంకేతిక ప్ర‌మాణాల‌తో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ఏజెంట్‌`. ఈ సినిమాలో అఖిల్ ఇంత‌వ‌ర‌కూ చూడ‌ని స‌రికొత్త అవ‌తారంలో క‌నిపించ‌నున్నారు.

ఈ మూవీ షూటింగ్ ఈ రోజు ప్రారంభ‌మైందని ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ప్ర‌కటించారు. అఖిల్ ఈ చిత్రంలో ఏజెంట్‌గా స‌రికొత్త రూపంలో క‌నిపించ‌నున్నాడు.

దర్శకుడు సురేందర్ రెడ్డి నిన్న జిమ్‌లో అఖిల్ బ్యాక్ పోజ్ విడుదల చేయగా, ఈ రోజు ఈ చిత్రం యొక్క కొత్త పోస్టర్ ను విడుద‌ల‌చేశారు మేక‌ర్స్‌. కండ‌లు తిరిగిన దేహంతో స్లీవ్‌లెస్ టీ షెర్ట్‌ని పైకి ఎత్తి ఉన్నఈ పోస్ట‌ర్ విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. అఖిల్ త‌న గ‌న్‌ని ప్యాంట్‌లో పెట్టుకోవ‌డం చూడొచ్చు.

సురేంద‌ర్ రెడ్డి, వ‌క్కంతం వంశీ కాంభినేష‌న్‌లో గతంలో `కిక్`, `రేసుగుర్రం` వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే కాగా వారిద్ద‌రి కలయికలో మరో బ్లాక్ బస్టర్ గా ఏజెంట్‌ రూపొంద‌బోతుంది.

అఖిల్‌ లాంటి ప్రామిసింగ్ స్టార్ – సురేందర్ రెడ్డి వంటి ప్రూవ్ చేసుకున్న దర్శకుడు – వక్కంతం వంశీ లాంటి విభిన్న రచయిత మరియు ఏకే ఎంటర్టైన్మెంట్స్ లాంటి సక్సెస్ ఫుల్ బ్యానర్ లో నిర్మాణం జరుపుకుంటున్నఈ చిత్రం ఒక క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది.

స్పై థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచ‌యం కాబోతుంది.

టాలీవుడ్ బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండ‌గా, రాగూల్ హెరియన్ ధారుమాన్ సినిమాటోగ్ర‌ఫి భాద్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలీ ఎడిటర్‌ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా  వ‌ర్క్ చేస్తున్నారు.

అజ‌య్ సుంక‌ర‌, ప‌త్తి దీపారెడ్డి కో- ప్రొడ్యూస‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తారాగ‌ణం : అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: సురేంద‌ర్ రెడ్డి
నిర్మాత‌: రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌
కో- ప్రొడ్యూస‌ర్స్‌: అజ‌య్ సుంక‌ర‌, ప‌త్తిదీపా రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కిషోర్ గ‌రికిపాటి
బ్యాన‌ర్స్‌:  ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, స‌రేండ‌ర్‌-2 సినిమా
క‌థ‌: వ‌క్కంతం వంశీ,
సినిమాటోగ్ర‌ఫి: రాగూల్ హెరియన్ ధారుమాన్,
సంగీతం: త‌మ‌న్ ఎస్‌.ఎస్‌,
ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి,
ఆర్ట్‌: అవినాష్ కొల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *