March 29, 2023

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

Allu Arjun Daughter “Arha” Debit in Sakunthalam Movie

అల్లు వారి నాలుగో తరం అల్లు అర్హ సినీ ఎంట్రీ ‘శాకుంతలం ‘ చిత్రం లో యువరాజు భరతుడి పాత్ర


‘అల్లు’ ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు తెలుగు చిత్ర పరిశ్రమలో తమ ఉనికిని చాటుకున్నారు. అల్లు రామలింగయ్య నిర్మించిన వారసత్వాన్ని అల్లు అరవింద్ కొనసాగిస్తే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ హీరో అల్లు శిరీష్ ఆ లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు నాల్గవ తరం కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. అది ఎవరో కాదు అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ.  క్రియేటివ్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ డైరెక్ష‌న్ లో సమంత అక్కినేని లీడ్ రోల్ చేస్తూ‌ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’ చిత్రంతో అల్లు అర్హ యాక్టింగ్ డెబ్యూ చేస్తోంది. ఈ మూవీలో బేబి ఆర్హ  యువరాజు భరతుడి పాత్రలో న‌టిస్తోంది. ఈరోజు గురువారం అర్హ సెట్స్ లో జాయిన్ అయింది. అర్హ పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణ 10 రోజుల్లో పూర్తి చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో అల్లు వారి పిల్లలు అయాన్ – అర్హ లకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అర్హ తన ముద్దు ముద్ద మాటలతో అల్లరి చేష్టలతో నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. అల్లు స్నేహా రెడ్డి సోషల్ మీడియా మధ్యమాలలో ఎప్పటికప్పుడు అర్హకు సంబంధించి ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. దీంతో నాలుగేళ్ల వయసులోనే తన క్యూట్ నెస్ తో అల్లు అర్హ పాపులారిటీ సంపాదించుకుంది.

నటి నటులు:

సమంతా అక్కినేని
దేవ్ మోహన్
అతిధి బాలన్
మల్హోత్రా శివన్
మరియు బేబి అల్లు అర్హ

నిర్మాణ సంస్థలు : గుణా టీం వర్క్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్
సినిమాటోగ్రఫీ : శేఖర్ వి  జోషఫ్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
సంగీతం : మణిశర్మ,
మాటలు : గుణ శేఖర్, సాయి మాధవ్ బుర్ర
సమర్పణ : దిల్ రాజు
నిర్మాతలు : నీలిమా గుణ, హర్షితా రెడ్డి
దర్శకత్వం : గుణ శేఖర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *