భళా చోర భళా మూవీ రివ్యూ
1 min readస్క్రీన్ప్లే, దర్శకత్వం: ఏ. ప్రదీప్.
సాహిత్యం: సింహ కొర్రపాటి
రచయిత: రవిశంకర్ మంత
ఎ.ప్రదీప్ రచన మరియు దర్శకత్వం వహించారు
నిర్మాత: జననీ ప్రదీప్
ఎడిటింగ్: రాము అద్దంకి
సంగీతం: సింహా కొర్రపాటి
BGM : వెంకటేష్ అద్దంకి
సహాయ దర్శకులు: రమేష్, నాని, రవి
VFX: నీలం రమేష్
DOP: లక్ష్మణ్
కలరిస్ట్: సంతోష్
తారాగణం: ఖయ్యూమ్, నవీన్ నేని, చింటూ, రోయల్ శ్రీ, రామ్ జగన్, ప్రదీప్ తదితరులు ..
విడుదల : 04-03-2022
రేటింగ్ : 3/ 5
ఖయ్యూమ్, నవీన్ వేవి, రోయిల్ శ్రీ, చింటు, శాంతి దేవగుడి, రామ్ జగన్, చిత్రం శ్రీమ ప్రధాన పాత్రల్లో యాక్టివ్ స్టూడియోస్ బ్యానరై పై తెరకెక్కుతోన్న చిత్రం భళా చోర భళా, ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ మిస్టరీ చిత్రానికి ఏ ప్రదీప్ దర్శకత్వం వహిస్తుండగా.. ఏ. జనని ప్రదీప్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది.
కథ :
ఈ కథలో రాజ్ మరియు అతని స్నేహితులు కలిసి ఓ 1000 కోట్ల విలువైన నేర కార్యకలాపాలకు సంబంధించిన స్కామ్ లో చిక్కుకున్నారు. వారి దగ్గర 200 కోట్ల విలువైన రాయి ఉంది. అయితే సుక్లా, ఒక గ్యాంగ్‌స్టర్, అతని బృందం సహాయంతో వారి నుండి ఆ రాయిని దొంగిలించడానికి ప్రయత్నాలు చేస్తారు.. కానీ రాజ్ మరియు అతని స్నేహితులు ఆసక్తికరంగా సుక్లా నుండి 800 కోట్లు దొంగిలిస్తారు. అయితే చివరికి సుక్లా మరియు అతని సిబ్బంది దగ్గరనుండి 800 కోట్లు, 200 కోట్ల రాయితో కలిసి పారిపోయారు. దాంతో సుక్లా అతని గ్యాంగ్ రాజ్ మరియు అతని సహచరులను పట్టుకునే ప్రయత్నం చేస్తారు. మరి ఈ చేసింగ్ లో వాళ్ళను ట్రాక్ చేసారా? రాజ్ మరియు అతని సహచరులు డబ్బు మరియు ఆ మునుపటి రాయిని తీసుకుని తప్పించుకున్నాకా అసలు ఏమైంది ? శుక్లా వారిని పెట్టుకున్నాడా లేదా అన్నది అసలు కథ !
నటీనటుల ప్రతిభ :
సరికొత్త కథాంశంతో భళా హార భళా చిత్రం తెరకెక్కిస్తున్నాము. ఫుల్ లెంగ్త్ కామెడీతో పాటు మిస్టరీ అంశాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. మంచి ఆర్థిష్టులు కుదిరారు. ఖయ్యూమ్, నవీన్ వేని, రోయిల్ శ్రీ వారి వారి పాత్రల్లో ఆకట్టుకున్నారు. సినిమా ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉన్నప్పటికీ ఎక్కువగా కామెడీ పై ఫోకస్ పెట్టడంతో ప్రేక్షకులకు మంచి రిలీఫ్ ఇచ్చేలా ఉంది. చాల గ్యాప్ తరువాత ఖయ్యుమ్ మంచి కామెడీ పండించాడు. ఇక నవీన్, రొయిల్ శ్రీ, శాంతి దేవగుడి, రామ్ జగష్ చిత్రం శ్రీమ, వెంకటేష్, రవి కిరణ్, రవి శంకర్ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. కథ ప్రకారంగా ఒక్కో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కథను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బాగా తోడ్పడింది.
టెక్నీకల్ హైలెట్స్ :
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు కావలసింది ముక్యంగా ఫోటోగ్రఫి అలాగే ఆర్ ఆర్. ఈ రెండు విషయాల్లో దర్శకుడు చక్కని ప్రతిభను రాబట్టుకున్నాడు. ఫోటోగ్రఫి హైలెట్ గా ఉంది. ప్రతి ఫ్రేము ఆసక్తికరంగా ఉంటూ కథలో ప్రేక్షకుడు మరింతగా లీనమయ్యేలా చేసాయి. ఈ చిత్రానికి లక్ష్మణ్ అందించిన ఫోటోగ్రఫి బాగుంది అలాగే ఆర్ ఆర్ మ్యూజిక్ ఇచ్చిన సింహ కొప్పర్తి, వెంకటేష్ అద్దంకి ఇద్దరు మంచి మ్యూజిక్ ఇచ్చారు. కథను మరింత ఇంట్రెస్టింగ్ గా సాగేలా ఆర్ ఆర్ సపోర్ట్ చేసింది. ఇక ఎడిటింగ్ బాగుంది. అయితే దర్శకుడు ఎంచుకున్న కథ బాగుంది.. వెయ్యికోట్ల మని కి సంబందించిన స్కామ్ తాలూకు క్రైం ని చక్కగా ప్రజెంట్ చేసాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాతలు ఏ. జనని ప్రదీప్, 54, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు.
విశ్లేషణ :
1000 కోట్ల స్కామ్ నేపథ్యంలో జరిగే ఈ కథ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఎవరు ఊహించని ట్విస్ట్ భలే ఉంటాయి. ముక్యముగా విలన్ బ్యాచ్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ప్రథమార్ధంలో.. చివర్లో ఖయ్యుమ్ కొంత నవ్వులు పంచాడు. అయితే మిగతా ఎక్కడా ఎంటర్టైన్మెంట్ లేకున్నా అక్కడక్కడా పంచ్ డైలాగ్స్ తో నవ్వించే ప్రయత్నం చేసాడు . ఇందులో డ్రామా విపరీతంగా సాగతీసి ఉన్న కొంచెం ఆసక్తి కూడా కాస్త తగ్గిపోయేలా ఉంది. అయితే ప్రి క్లైమాక్స్ లో వచ్చే ఇన్వెస్టిగేటివ్ సీన్ల విషయంలో చాలా కష్టపడ్డట్లు కనిపిస్తుంది. మొత్తానికి భళా చోర భళా సినిమా టైటిల్ కి తగ్గట్టే ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంటుంది. అయితే ఫైనల్ గా వెయ్యికోట్లు ఎవరికి చెందాయి అన్నది లాస్ట్ వరకు తెలియకుండా రహస్యంగా మైంటైన్ చేయడం సినిమాకు బాగా కలసి వచ్చే అంశం. మొత్తానికి ఈ సినిమా థ్రిల్లర్ సినిమాలు బాగా ఇష్టపడే వాళ్లకు బాగా నచ్చే సినిమా.