September 8, 2024

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

ఒక కొత్త కథతో మీ ముందుకు రాబోతున్నాను : గేటప్ శ్రీను

1 min read

బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ ‘రాజు యాదవ్’ తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. మే 24న రాజు యాదవ్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో హీరో గెటప్ శ్రీను విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

మీరు డిఫరెంట్ గెటప్స్ తో పాపులర్ అయ్యారు కదా.. కానీ ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే స్మైల్ ఎక్స్ ప్రెషన్ తో చేశారనిపించింది. ఈ పాత్ర చేయడం ఎలా అనిపించింది?

-చాలా కష్టంతో కూడుకున్న పాత్రిది. ఈ పాత్ర చేస్తున్నప్పుడు ఒకానొక దశలో ఆర్టిస్ట్ గా ఫెయిల్ అయిపోయానేమో అనుకునే సందర్భాలు కూడా వున్నాయి. ఒక సీన్ చేస్తునపుడు చాలా కష్టంగా సవాల్ గా అనిపించింది.  అయితే దర్శకుడు చాలా స్ఫూర్తిని ఇచ్చి ఈ పాత్ర చేయించారు.

ఈ కథ విన్నప్పుడు ఎలా అనిపించింది ?

-ముందు నా పాత్ర గురించి చెప్పారు. భలే అనిపించింది. తర్వాత కథ పూర్తిగా చదివాను. చాలా నచ్చింది.  చాలా రియలెస్టిక్ గా వుండే సినిమా ఇది. విజువల్స్, సన్నివేశాలు, డైలాగ్స్ ఇవన్నీ సహజత్వంతో నిండివుంటాయి. ప్రస్తుతం ఆడియన్స్ కంటెంట్ వున్న రియలెస్టిక్  సినిమాలని అదరిస్తున్నారు. ఈ సినిమా కూడా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది.

హీరోగా చేయాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది ?

-హీరోగా చేయాలని ప్లాన్ చేసుకోలేదు. ఇప్పటివరకూ నటనకు ఎక్కువ స్కోప్ వున్న పాత్రలని చేయడానికి ప్రయత్నించాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గానే స్థిరపడాలని అనుకున్నాను. రాజు యాదవ్ కథ విన్నాక ఫుల్ లెంత్ పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం కలుగుతుందనిపించింది. అందుకే ఈ సినిమా చేశాను. నా వరకూ ఇది నేను చేస్తున్న ఫుల్ లెంత్ క్యారెక్టర్ గానే భావిస్తాను.

దర్శకుడు కృష్ణమాచారి గురించి ?

కృష్ణమాచారి గారు నీది నాది ఒకే కథ, విరాట పర్వం, అలాగే ఒక స్పానిస్ సినిమాకి సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆయన కథ చెప్పే విధానం చాలా నచ్చింది. చాలా సహజత్వంతో సినిమాని తీశారు. ఫన్ తో పాటు ఎమోషన్ ని చాలా అద్భుతంగా చూపించారు.

సినిమా, కథ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ?

-రాజు యాదవ్ ఫన్ అండ్ ఎమోషన్ రైడ్. తల్లితండ్రులు తమ కొడుకు నుంచి ఏం కోరుకుంటున్నారు ? అలాగే కొడుకు కోణంలో తల్లితండ్రులు ఎలా వుండాలి? తల్లితండ్రుల కలని సాకారం చేయడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనకడుగు వేయకూడదనే అంశం ఈ కథకు మూలం.

హీరోయిన్ పాత్ర గురించి ?

-ఈ కథలో నేను లోకల్ లాడ్జ్ లా వుంటాను. తను ఫైవ్ స్టార్ హోటల్ లా వుంటుంది(నవ్వుతూ) కథకి తగినట్లుగానే అంకిత క‌ర‌త్‌ ని ఎంపిక చేయడం జరిగింది. తను మంచి అభినయం కనబరిచారు.

ప్రమోషన్స్ లో చిరంజీవి గారిని కలిశారు కదా ? ఆయన ఎలాంటి స్పందించారు ?

-చిరంజీవి గారి షో రీల్ చూపించాను. చాలా మంచి ప్రయత్నమని అభినందించారు. చిరంజీవి గారు చలం గారితో పోల్చడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే బ్రహ్మనందం గారు.. నటుడిగా ఎదగాలనుకువారు ఇలాంటి ప్రయత్నాలు చేయాలని చెప్పారు. ఇండస్ట్రీ నుంచి చాలా మంది సపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

రాజు యావద్ లా ఎప్పుడూ ‘స్మైల్’ తో వుండే వారిని నిజ జీవితంలో చూశారా ?

– ఇది రియల్ స్టొరీనే. కానీ క్యారెక్టరైజేషన్ ఫిక్షనల్. బౌలర్ లక్ష్మీ పతి బాలాజీ గారికి చిన్నపుడు ముఖానికి ఓ సర్జరీ జరిగితే సర్జరీలో ఎదో తేడా జరిగి స్మైల్ ఫేస్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. అక్కడ నుంచి మా దర్శకుడు స్ఫూర్తి పొంది ఈ పాత్రకు ఆ క్యారెక్టరైజేషన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడూ నవ్వుతూ వుండటం మామూలు విషయం కాదు. ఈ పాత్ర చేయడం చాలా కష్టం అనిపించింది.

పాటలు హర్షవర్షన్ రామేశ్వర్ గారు చేశారు కదా.. నేపధ్య సంగీతం సురేష్ బొబ్బిలి గారు చేయడానికి కారణం ?

-హర్షవర్షన్ రామేశ్వర్ గారు అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. పాటలన్నీ చాలా బాగా రీచ్ అయ్యాయి. అయితే యానిమల్ విడుదల తర్వాత ఆయన బాలీవుడ్ చాలా బిజీ అయ్యారు. నిజానికి ఈ సినిమాకి ముందు సురేష్ బొబ్బిలి గారినే అనుకున్నాం. హర్షవర్షన్ గారు బిజీగా వుండటంతో నేపధ్య సంగీతం సురేష్ బొబ్బిలిగారితో చేయించాం. ఇద్దరూ మంచి సమన్వయంతోనే మ్యూజిక్ చేయడం జరిగింది.

మీ వైపు నుంచి నిర్మాతలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించారు ?

-బడ్జెట్ విషయంలో మొదటి నుంచి జాగ్రత్తగా వున్నాం. కార్వాన్ లాంటివి వద్దని ముందే అనుకున్నాం. రియల్ సినిమా కాబట్టి అన్నీ రియల్ లోకేషన్స్ లోనే షూట్ చేశాం. కొన్ని సార్లు కార్ లోనే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. కాస్ట్ కటింగ్ చేసి దానిని ప్రొడక్షన్ మీద పెట్టాం. అవుట్ పుట్ విషయంలో చాలా హ్యాపీగా వున్నాం. ఫ్యామిలీస్ కి కనెక్ట్ అయ్యే కథ ఇది. తప్పకుండా సినిమా మంచి విజయాన్ని అందుకుంటుదనే నమ్మకం వుంది.

ఫ్యామిలీ మెంబర్స్ కి, స్నేహితులకి ప్రిమియర్స్ వేశారు కదా.. ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ?

-చాలా ఎంజాయ్ చేశారు. ఫన్ ఎమోషన్ అద్భుతంగా వున్నాయని అన్నారు. చాలా ఎమోషనల్ గా ఫీలయ్యారు. చివరి నలభై నిముషాలు చాలా అద్భుతంగా వుందని, ఇది తప్పకుండా చూడాల్సిన కథని చెప్పారు.

బన్నీ వాసు గారు సినిమాని విడుదల చేస్తున్నారు కదా.. ఎలా అనిపించింది ?

-చాలా ఆనందంగా వుంది. ఆయన ట్రైలర్ చూసి ‘చాలా మంచి ప్రయత్నం.. నా ఆద్వర్యంలో విడుదల చేస్తాను’ అని చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.

టీవీ, సినిమాని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ?

-టీవీ నాకు పేరు తీసుకొచ్చింది. ఆర్ధికంగా స్థిరత్వాన్ని ఇచ్చింది. అయితే టీవీకి ఎక్కువ డేట్లు కేటాయించడం వలన సినిమాల్లో చాలా మంచి పాత్రలని మిస్ వుతున్నానని తెలిసింది. ఇప్పుడు సినిమాలపైనే ద్రుష్టి పెట్టాను. మంచి పాత్రల చేయడంపైనే నా ద్రుష్టి వుంది. నా కెరీర్ పట్ల ఇంట్లో వాళ్ళు చాలా ఆనందంగా వున్నారు. నేను ఎదో సాధించానని ఆనందం ఇంట్లో వారికి వుంది. అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది.

మీరు, సుధీర్, రాంప్రసాద్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందా ?

రాం ప్రసాద్ కథ రాస్తున్నాడు. మేము కలిసి సినిమా చేయాలనే ఆలోచన అయితే వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

reklam ajansı profesyonel logo tasarım web tasarım kurumsal web tasarım web ajansı web tasarım şirketleri web tasarım firması web yazılım firmaları en iyi web tasarım şirketleri advertising agency professional logo design web design corporate web design web agency web design companies web design firm web software companies best web design companies