October 1, 2023

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

‘Dahini’ makes it to the Swedish International Film Festival

3 min read
స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో రాజేష్ టచ్‌రివర్ ‘దహిణి’

తన్నిష్ఠ ఛటర్జీ, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో జాతీయ పురస్కార గ్రహీత, ప్రముఖ దర్శకుడు రాజేష్ ట‌చ్‌రివ‌ర్‌ తెరకెక్కించిన సినిమా ‘దహిణి’. ఆషిక్ హుస్సేన్, బద్రుల్ ఇస్లాం, అంగన రాయ్, రిజు బజాజ్, జగన్నాథ్ సేథ్, శృతి జయన్ దిలీప్ దాస్‌, దత్తాత్రేయ ఇందులో ఇతర తారాగణం. ఓరియన్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, సన్‌టచ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను పద్మశ్రీ అవార్డు గ్రహీత, మానవతావాది సునీత కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా నిర్మించారు.

స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు ‘దహిణి’ ఎంపిక అయ్యింది. ఈ సినిమాకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో గౌరవం దక్కడం ఇది రెండోసారి. ఈ చిత్రానికి పసిఫిక్ బీచ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ అవార్డు లభించింది.

వాస్తవ ఘటనలు ఆధారంగా రాజేష్ ట‌చ్‌రివ‌ర్‌ సినిమాలు తీస్తుంటారు. దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించినప్పటి నుండి ఆయనది అదే పంథా. గతంలో ఎన్నో సమస్యలను సినిమాల ద్వారా ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ‘విచ్ హంటింగ్’ పేరుతో పలు రాష్ట్రాలలో జరుగుతున్న దారుణాలను వెలుగులోకి తీసుకురావాలనే ప్రయత్నంతో… వివాదాస్పద అంశాలను స్పృశిస్తూ ‘దహిణి’ తెరకెక్కించారు.

ఒరిస్సాలోని మయూర్ బంజ్ జిల్లా, పరిసర ప్రాంతాల్లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా, వాస్తవికతకు దగ్గరగా ‘దహిణి’ చిత్రాన్ని రూపొందించారు. ఈ కథను అధ్యయనం చేస్తున్న సమయంలో తెలిసిన విషయాలు చిత్రబృందంలో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ప్రేక్షకులను కూడా ఆశ్చర్యానికి గురి చేయడం ఖాయం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రకారం… మన దేశంలో 2001 నుండి 2019 వరకు దాదాపు 2937 మంది మంత్రవిద్యలు చేస్తున్నారనే అనుమానంతో దారుణంగా చంపబడ్డారు. కేవలం 2019 సంవత్సరంలోనే 102 మందిని మంత్రగత్తెలుగా భావించి వివిధ గ్రామాల ప్రజలు అత్యంత కిరాతంగా చంపారు. ఇటువంటి దురాగతాలపై ఎటువంటి కేసు లేదనే చెప్పాలి. ఒడిశా హైకోర్టు 2021లో చెప్పినదాని ప్రకారం… ప్రతి నెల నలుగురు మహిళలు మంత్రవిద్య చేస్తున్నారనే నెపంతో దారుణంగా హత్యకు గురవుతున్నారు. ప్రభుత్వ లెక్కలను పరిశీలిస్తే హత్యకు గురవుతున్నవాళ్లలో మహిళలే ఎక్కువ శాతం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక యునైటెడ్ నేషన్స్ అందించిన నివేదిక 1987 నుంచి 2003 మధ్యన సుమారు పాతికవేల మందిని మంత్రగత్తెలనే అనుమానంతో దారుణంగా చంపారని నిర్ధారణ చేసింది.

మన దేశంతో పాటు పలు దేశాలను పట్టి పీడిస్తున్న ‘విచ్ హంటింగ్’ సమస్యను వెలుగులోకి తీసుకు రావాలని…  మానవ హక్కుల ఆందోళన, లింగ ఆధారిత హింసను ప్రస్తావిస్తూ రాజేష్ టచ్ రివర్ ‘ దహిణి’ సినిమాను రూపొందించారు.

మానవ హక్కుల కార్యకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీత కృష్ణన్ మాట్లాడుతూ “ఆధునిక కాలంలో కూడా లింగ ఆధారిత హింసతో, ఇప్పటికీ అనాగరిక చర్యలను కొంత మంది పాటిస్తున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అయినప్పటికీ ఎవ్వరూ ఈ దారుణాల గురించి మాట్లాడకపోవడం దురదృష్టం. ఈ వాస్తవాలను అందరికీ తెలియజేయడానికి మేం చేసిన ప్రయత్నం ఈ సినిమా” అని అన్నారు.

ప్రొడ్యూసర్ ప్రదీప్ నారాయణన్ మాట్లాడుతూ ”నేటి భారతంలో వేలాది మంది మహిళలను మంత్రగత్తెల పేరుతో ఎలా వేటాడుతున్నారు? మా సినిమాలో ఈ అంశం గురించి చాలా ఓపెన్‌గా ఈ ఇష్యూ గురించి చర్చిస్తున్నాం. దీని తర్వాత ప్రేక్షకులు మాట్లాడతారని ఆశిస్తున్నాం. ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను” అని అన్నారు.

ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), సినిమాటోగ్రాఫర్: నౌషాద్ షెరీఫ్, ప్రొడక్షన్ డిజైనర్: సునీల్ బాబు, సౌండ్ డిజైనర్: అజిత్  అబ్రహం జార్జ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : జార్జ్ జోసెఫ్, ఎడిటర్: శశి కుమార్, డైలాగ్ రైటర్: రవి పున్నం, స్పెషల్ మేకప్ డిజైన్ ఆర్టిస్ట్: ఎన్.జి. రోషన్, మ్యూజిక్ : డా. గోపాల్ శంకర్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: రాజేష్ టచ్ రివర్.

———————————————
Rajesh Touchriver’s social thriller ‘Dahini: The Witch’ makes it to the Swedish International Film Festival

Tanishtha Chatterjee and JD Chakravarthi are playing lead roles in an upcoming film titled ‘Dahini’, which is directed by National Award winner Rajesh Touchriver. Also featuring Ashique Hussain, Badrul Islam, Angana Roy, Riju Bajaj, Jagannath Seth, Sruthy Jayan, Dilip Das, and Dattatreya, the film is produced by Orion Pictures International Pvt. Ltd. and SunTouch Productions. Human Rights activist and Padma Shree recipient Sunitha Krishnan and Pradeep Narayanan are jointly producing it.

The social thriller, which is about the scourge of witch-hunting, has got a new feather in its cap. It has made it to the Swedish International Film Festival.

This is the second important international recognition that the drama has come to enjoy. Only recently, it received the Best International Feature Film honour at the Pacific Beach International Festival.

Witch-hunting and how it leads to gender-based violence has been depicted in a moving fashion by the film. Women become victims of witch-hunting in property disputes or in cases where they are hated for not conforming to societal gender norms.

Shot in Odisha’s Mayurbhanj district (where witch-hunting is said to be rampant), the film is close to reality. At the time of researching for the film, the writing department was shocked to know various facts. The audience are sure to be surprised as well. According to the National Crime Records Bureau (NCRB), approximately 2937 women were killed in India between 2001 and 2019 on suspicion of practicing witchcraft. In the year 2019 alone, 102 people were killed. However, only six States have specific legislations which empower police to mention witchcraft as a motive for murder, while witch-hunting is observed in over 17 States. It’s evident that the real number of cases could be much higher than the reported numbers. According to government figures, an Indian woman is killed every other day after being suspected of witchcraft. As per the Odisha High Court, in 2021 alone 4 women were murdered every month in Odisha in the name of witchcraft. As per a UN Report, over 25,000 women were murdered in less than 16 years between 1987-2003 in the name of witch-craft in India. Most of these women were single women or widows.

Talking about the movie, Sunitha Krishnan says, “Even in the modern-day, gender-based violence and savagery are going on. It’s unfortunate that we are yet to acknowledge the extent of this gross human rights violation. Our film attempts to expose the existence of the centuries-old evil with the aim of encouraging collective action.”

Producer Pradeep Narayanan said, “How are thousands of women being witch-hunted in today’s India? Our film is a poignant attempt to openly talk about the shocking issue. I feel fortunate to have produced the movie.”

PRO: Surendra Naidu-Phani Kandukuri (Beyond Media); Cinematographer: Noushad Shereef; Production Designer: Sunil Babu; Sound Designer: Ajith Abraham George; Background Score: George Joseph; Editor: Sasi Kumar; Dialogue Writer: Ravi Punnam; Special Make-up Design Artist: NG Roshan; Music: Dr. Gopal Shankar; Story, screenplay, direction: Rajesh Touchriver.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *