October 4, 2023

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

Devarapalli Productions Production no1 Launch

1 min read

దేవరపల్లి ప్రొడక్షన్స్‌ ప్రొడక్షన్‌ నెం.1 చిత్రం ‘రాజుకు నచ్చిందే రంభ’ ప్రారంభం

వి. చిన్న శ్రీశైలం యాదవ్‌ సమర్పణలో దేవరపల్లి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెం.1గా రూపుదిద్దుకోనున్న చిత్రం ‘రాజుకు నచ్చిందే రంభ’. రావంత్‌, సలోనీ హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసరావు ర్యాలి దర్శకత్వంలో.. దేవరపల్లి అఖిల్‌, వల్లాల ప్రవీణ్‌కుమార్‌ యాదవ్‌ (వెంకట్‌) నిర్మించనున్నారు. ఈ చిత్రం ఆదివారం పూజా కార్యక్రమాలను జరుపుకుని రెగ్యులర్‌ షూటింగ్‌కు రెడీ అవుతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు ర్యాలి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ” రాజుకు నచ్చిందే రంభ చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఒక హీరోయిన్‌గా సలోనీ నటిస్తోంది. మరో హీరోయిన్‌ని త్వరలోనే ఎంపిక చేస్తాము. చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభించనున్నాం. చంద్రబోస్‌గారు, రామజోగయ్య శాస్త్రిగారు చాలా మంచి పాటలు ఇచ్చారు. రఘు కుంచెగారు అంతే అద్భుతంగా పాటలను కంపోజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. సాంగ్స్‌ రికార్డింగ్‌ త్వరలోనే మొదలవుతుంది. దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన రావంత్‌ దేవరపల్లిగారికి, మంచి టెక్నిషియన్స్‌ని ఇచ్చిన నిర్మాతలు దేవరపల్లి అఖిల్‌, వల్లాల ప్రవీణ్‌కుమార్‌ యాదవ్‌ (వెంకట్‌)గార్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాం..” అని అన్నారు.

సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ.. ”దేవరపల్లి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1 చిత్రంగా రూపుదిద్దుకోబోతున్న ఈ ‘రాజుకు నచ్చిందే రంభ’ చిత్రానికి వర్క్‌ చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు ఛాలెంజింగ్‌ ప్రాజెక్ట్‌. నాకు స్టార్‌ రైటర్స్‌ని ఇచ్చారు. నా మార్క్‌ మిస్‌ కాకుండా అద్భుతమైన బాణీలను సమకూర్చి, చిత్ర విజయంలో నా వంతు పాత్ర పోషిస్తానని తెలియజేస్తున్నాను..” అన్నారు.

రావంత్‌, సలోని, అజయ్‌ ఘోష్‌, రఘు కుంచె, అప్పారావు తదితరులు నటించనున్న ఈ చిత్రానికి
సమర్పణ: వి. చిన్న శ్రీశైలం యాదవ్‌
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: కృష్ణ మోహన్‌ రావు, లక్ష్మీ నారాయణ చౌదరి, శ్రీనివాసరావు కాంతి
లైన్‌ ప్రొడ్యూసర్‌: కావిడి ఆనంద్‌
లిరిక్స్‌: చంద్రబోస్‌, రామజోగయ్య శాస్త్రి
కొరియోగ్రాఫర్‌: తార
కెమెరామ్యాన్‌: జవహార్‌ రెడ్డి
ఎడిటింగ్‌: గౌతంరాజు
సంగీతం: రఘు కుంచె
ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల
సహ-నిర్మాతలు: వల్లాల రమేష్‌ యాదవ్‌, ఎ. రాజు సాగర్‌, కోన సత్యనారాయణ చౌదరి
నిర్మాతలు: దేవరపల్లి అఖిల్‌, వల్లాల ప్రవీణ్‌కుమార్‌ యాదవ్‌ (వెంకట్‌)
స్టోరీ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: ర్యాలి శ్రీనివాసరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *