September 8, 2024

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

‘డార్లింగ్’ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ నచ్చే హిలేరియస్ ఎంటర్ టైనర్: డైరెక్టర్ అశ్విన్ రామ్ 

1 min read

ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. డార్లింగ్ జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ అశ్విన్ రామ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
‘డార్లింగ్’ సినిమాకి అపరిచితుడు మూవీ ఇన్స్ ప్రెషన్ అనుకోవచ్చా ?
-లేదండి. స్ప్లిట్ పర్సనాలిటీ కామన్ గా కనిపించవచ్చు కానీ కథ, కాన్ ఫ్లిక్ట్ పరంగా ఈ రెండు డిఫరెంట్ మూవీస్. అపరిచితుడులో శంకర్ గారు లార్జ్ స్కేల్ లో సోషల్ ఇష్యూస్ ని డీల్ చేశారు. డార్లింగ్ లో హోం ఇష్యూస్ డీల్ చేస్తున్నాం(నవ్వుతూ).
డార్లింగ్ పేరుతో సూపర్ హిట్ సినిమా వచ్చింది. ప్రభాస్ గారిని అందరూ డార్లింగ్ అని పిలుస్తారు. ఈ సినిమాకి అదే టైటిల్ పెట్టడం ఎలా అనిపించింది?
-ప్రభాస్ గారి డార్లింగ్ కల్ట్ హిట్ మూవీ. ప్రభాస్ గారిని అందరూ డార్లింగ్ అంటారని మా యూనిట్ అందరికీ తెలుసు. అయితే ఈ కథకు డార్లింగ్ అనే టైటిల్ యాప్ట్. వైఫ్ అండ్ హస్బెండ్ ప్రేమగా పిలుచుకునే పదం డార్లింగ్. మా సినిమాకి ఇది పర్ఫెక్ట్ టైటిల్. ఇప్పటివరకూ ప్రభాస్ గారి ఫ్యాన్స్ నుంచి కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన తర్వాత ఇది పర్ఫెక్ట్ టైటిల్ అని ప్రేక్షకులే చెబుతారు.
డార్లింగ్ నవ్విస్తుందా ? ఎమోషనల్ టచ్ తో మెసేజ్ కూడా ఉందా ?
-నాకు సందేశాలు ఇవ్వడం ఇష్టం వుండదు. సినిమా చూసినప్పుడు ఎంటర్ టైన్నింగ్ గా వుండాలనేది చూస్తాను. ఎంటర్ టైన్నింగ్ వుంటూనే ఒక సోషల్ రెస్పాన్స్ బిలిటీతో కూడిన సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. డార్లింగ్ కూడా అలా చేసిన సినిమానే.
ట్రైలర్ చూసినప్పుడు డార్లింగ్ చాలా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనిపించింది. మరి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సరిఫికేట్ ఇవ్వడానికి కారణం?
-ఇందులో స్ప్లిట్ పర్శనాలిటీ డిస్ఆర్డర్ తో డీల్ చేశాం. అది సెన్సిటివ్ డిస్ఆర్డర్. ఆ కారణంగానే యూ/ఏ ఇచ్చారు. ఒక్క కట్ కూడా చెప్పలేదు. చాలా క్లీన్ ఫిల్మ్ ఇది. పెద్దల సమక్షంలో పిల్లలు చూడొచ్చు. సెన్సార్ బోర్డ్ వారితో పాటు ఇప్పటివరకూ సినిమా చూసిన అందరికీ డార్లింగ్ చాలా నచ్చింది.
ఈ మధ్య కాలంలో వైఫ్ అండ్ హస్బెండ్ కథలు పెద్దగా రాలేదు కదా.. డార్లింగ్ విషయంలో మీకు అంచనాలు ఏమిటి ?
-వైఫ్ అండ్ హస్బెండ్ అంటే సిమిలర్ టు లవ్ స్టొరీ. మ్యారేజ్ ని హ్యాండిల్ చేయడంలో డిఫరెంట్ పర్స్పెక్టివ్ చూపించే కథ ఇది. డెఫినెట్ గా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.
వైఫ్ అండ్ హస్బెండ్ ‘రాజారాణి’ గుర్తుకువస్తుంది. ఆ సినిమా పోలికలు ఇందులో వుంటాయా ?
-రాజారాణి కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. రొమాంటిక్ కామెడీకి రాజరాణి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. డార్లింగ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ కి సంబధించిన డిఫరెంట్ పర్స్పెక్టివ్ ని ప్రెజెంట్ చేస్తున్నాం.
-మురగదాస్ గారి ప్రొడక్షన్ లో మూడు సినిమాలకి పని చేశాను. ధనుష్ గారి సినిమాకి కూడా పని చేశాను.
హీరో ప్రియదర్శి గురించి ?
-డార్లింగ్ కి పెర్ఫెక్ట్ గా హీరో ప్రియదర్శి. ఓ సినిమా షూటింగ్ లో మేము కలిశాం. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. ఆయన వలనే ఈ ప్రాజెక్ట్ సాధ్యపడింది. ప్రియదర్శి చాలా ఎఫర్ట్ పెట్టారు.
స్ప్లిట్ పర్సనాలిటీ అనంటే విక్రమ్ గుర్తుకు వస్తారు,.. ఇలాంటి క్యారెక్టర్ ని నభా నటేష్ ఎలా చేశారు ?
-డార్లింగ్ స్క్రిప్ట్ వెరీ ఛాలెంజింగ్. తన క్యారెక్టర్ ని ఎలా మ్యాచ్ చేయగలననే దానిపైనే నభా ద్రుష్టి పెట్టారు. ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మ్ చేశారు. చాలా సపోర్ట్ చేశారు.
అనన్య నాగేళ్ల క్యారెక్టర్ గురించి ?
-అనన్య నాగేళ్లది వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆమెకు కథ అంతా చెప్పాను. ఆ పాత్రని చాలా ఇష్టపడి చేశారు. అనన్య పాత్ర గుర్తుపెట్టుకునేలా వుంటుంది. ఇందులో విమెన్ పాత్రలన్నీ చాలా స్ట్రాంగ్ గా వుంటాయి.
తెలుగులో దర్శకుడిగా పరిచయం కావడం ఎలా అనిపిస్తోంది ?
-చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూసి చాలా ఎంజాయ్ చేశాను. తెలుగు సినిమాలపై నాది వన్ సైడ్ లవ్.( నవ్వుతూ) ఎప్పటినుంచో తెలుగు సినిమా చేయాలని వుండేది. ఈ సినిమాతో ఆ కల తీరినందుకు చాలా ఆనందంగా వుంది.
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ చాలా విజనరీ ప్రొడ్యూసర్స్. వారికి కంటెంట్ పైనే పూర్తి నమ్మకం. నిరంజన్ గారు, చైతన్య మేడంకి కంటెంట్ నచ్చితే మరో ఆలోచన లేకుండా ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నారు.
వివేక్ సాగర్ మ్యూజిక్ గురించి ?
-వివేక్ సాగర్ మ్యూజిక్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. కానీ వివేక్ ఎక్కువ సినిమాలు చేయరు. అయితే కంటెంట్ వినమని ఈ సబ్జెక్ట్ చెప్పాను. ఆయనకి సబ్జెక్ట్ నచ్చి ఓకే చెప్పారు. ఈ సినిమాకి పర్ఫెక్ట్ మ్యూజిక్ ఇచ్చారు. రిరికార్డింగ్ కూడా ఎక్స్ ట్రార్డినరీ చేశారు.
నెక్స్ట్ మూవీస్ గురించి ?
-చాలా కథలు వున్నాయి. మీ అందరి సపోర్ట్ తో తెలుగు సినిమాల్లోనే వుండాలని వుంది (నవ్వుతూ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

reklam ajansı profesyonel logo tasarım web tasarım kurumsal web tasarım web ajansı web tasarım şirketleri web tasarım firması web yazılım firmaları en iyi web tasarım şirketleri advertising agency professional logo design web design corporate web design web agency web design companies web design firm web software companies best web design companies