Director Sukumar Launches SR Klayanamandapam EST 1975 Movie Song
1 min readస్టార్ డైరెక్టర్ సుకుమార్ విడుదల చేసిన కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ SR కళ్యాణమండంపం EST 1975 – సిగ్గేందుకు రా మావ పాటకు అనూహ్య స్పందన
రాజావారు రాణిగారు ఫేమ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ జంటగా ఎలైట్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై ప్రమోద్ – రాజు నిర్మాతలుగా, నూతన దర్శకుడు శ్రీధర్ గాదే తెరకెక్కించిన సినిమా SR కళ్యాణమండంపం EST 1975. ఈ సినిమా టైటిల్ ఎనౌన్సమెంట్ దగ్గర నుంచి అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఓ అసక్తిని క్రియేట్ చేసుకుంది. ఆ ఉత్కంఠని మరింత పెంచుతూ ఆ తరువాత విడుదల చేసిన చుక్కల చున్ని, చూసాలే కళ్లార వంటి పాటలు యూట్యూబ్ లో మిలయన్స్ కొద్దీ వ్యూస్ తెచ్చుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో సైతం ట్రెండ్ అవుతున్నాయి. వీటితో పాటే విడుదల చేసిన టీజర్ కి సైతం అంతటా అనూహ్య స్పందన లభించడమే కాకుండా, టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో SR కళ్యాణమండంపం EST 1975 చిత్రం హాట్ టాపిక్ గా మారడం విశేషం. ఇటీవలే SR కళ్యాణమండంపం EST 1975 చిత్రాన్ని మాత్రం థియేటర్ లో విడుదల చేస్తున్నామంటూ అధికారికంగా ప్రకటించడమే కాకుండా అందుకు తగ్గట్లుగా నిర్మాతలు ప్రమోద్ – రాజులు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే శంకర్ పిక్చర్స్ వారు ఈ చిత్రానికి సంబంధించిన వరల్డ్ వైడ్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే, ఈ నేపథ్యంలో తాజాగా SR కళ్యాణమండంపం EST 1975 చిత్రం ఆడియో ఆల్బమ్ నుంచి మరో పాట విడుదలైంది. సిగ్గేందుకు రా మావ అంటూ సాగే ఈ పాటను స్టార్ డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు. ఈ పాటలో హీరో కిరణ్ అబ్బవరం డాన్స్ మూమెంట్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి, అలానే సంగీత దర్శకుడు ఈ పాటకు అందించిన ట్యూన్స్, ప్రముఖ సింగర్ అనురాగ్ కులకుర్ణి అద్భుతమైన వాయిస్ వెరసి సిగ్గేందుకు రా మావ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ని సైతం కిరణ్ అబ్బవరం అందించడం విశేషం. విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని దర్శకుడు శ్రీధర్ గాదే తెలిపారు. ఇప్పటి పరిస్థితులు సాధరణ స్థాయికి వచ్చి, థియేటర్లు ఎప్పుడూ తెరుచుకుంటే అప్పుడు ఈ సినిమా విడుదలకి సిద్ధం.
తారాగణం – కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్, సాయికుమార్ తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్ – ఎలైట్ ఎంటర్ టైన్మెంట్స్
వరల్డ్ వైడ్ రైట్స్ – శంకర్ పిక్చర్స్
నిర్మాతలు – ప్రమోద్, రాజు
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ – కిరణ్ అబ్బవరం
దర్శకుడు – శ్రీధర్ గాదే
సంగీతం – చేతన్ భరద్వాజ్
కెమెరా – విశ్వాస్ డేనియల్
ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూసర్ – భరత్
లిరిక్స్ – భాస్కరభట్ల, క్రిష్ణ కాంత్
పీఆర్ఓ – ఏలూరుశ్రీను, మేఘశ్యామ్
ఆర్ట్ – సుధీర్
డిఐ – సురేశ్ రవి
ఫైటర్ – శంకర్