September 7, 2024

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

విజయ్ సేతుపతి ‘మహారాజ’ సినిమాలో లక్ష్మి ఎవరో తెలుసా?

1 min read
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మోస్ట్ ప్రెస్టీజియస్ 50వ మైల్ స్టోన్ మూవీ ‘మహారాజ’రిలీజ్ కి రెడీ అయ్యింది. నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనురాగ్ కశ్యప్ పవర్ ఫుల్ రోల్ లో నటించారు. విజయ్ సేతుపతికి ఇది 50వ సినిమా కావడంతో మెమరబుల్ హిట్ అందించడం కోసం దర్శకుడు చాలా కేర్ తీసుకున్నాడు. నిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌ని హ్యుజ్ బడ్జెట్ తో లావిష్ గా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఎన్‌విఆర్ సినిమా ఈ మూవీని ఏపీ, తెలంగాణలలోమ్యాసీవ్ గా రిలీజ్ చేయనుంది. ఈ సినిమా జూన్ 14న థియేట్రికల్ రిలీజ్‌ కానున్న నేపధ్యంలో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ లో హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా రామోజీరావు గారికి అంజలి ఘటిస్తున్నాను. ఆయన మృతి ఎంతో బాధకలిగించింది. హైదరాబాద్‌తో కంటే రామోజీ ఫిల్మ్‌సిటీతోనే నాకు మోమోరిస్ ఉన్నాయి. 2005లో ధనుష్‌ సినిమా కోసం తొలిసారి ఫిల్మ్‌సిటీకి వెళ్లాను. సినిమాకు సంబంధించి ఏం కావాలో అవన్నీ ఫిల్మ్‌సిటీలో కనిపించడం చూసి స్టన్ అయిపోయాను. ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది దర్శకులు మంచి సినిమాలు తీస్తున్నారంటే అందులోని సదుపాయాలే కారణం. రామోజీరావు గారి విజన్‌కు ఫిల్మ్‌సిటీనే నిదర్శనం. సినిమా పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు కృతజ్ఞతలు.
పిజ్జా ప్రమోషన్స్ కి ఇక్కడికి వచ్చాను. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ హైదరాబాద్ ప్రమోషన్స్ కి రావడం ఆనందంగా వుంది. మహారాజ 50వ సినిమా. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ తో వున్నాం. ఈ సినిమాని చాలా మందికి చూపించాం. చూసిన అందరికీ నచ్చింది. తెలుగు ప్రేక్షకులందరూ సినిమాని ఇష్టపడతారనే నమ్మకం వుంది. జూన్ 14న సినిమా విడుదలౌతుంది. తప్పకుండా అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమాని చూడాలి’ అని కోరారు.
హీరోయిన్ మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ.. తమిళ్ లో కొంత బ్రేక్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో భాగం కావడం గర్వంగా వుంది. చాలా మంచి స్క్రిప్ట్ ఇది. యూనిక్ స్క్రీన్ ప్లే. ఇలాంటి సినిమా ఈ మధ్య కాలంలో చూడలేదు. ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. సేతు గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయనతో వర్క్ చేయడం ఆనందంగా వుంది. అలాగే అనురాగ్ గారితో వర్క్ చేయడం కూడా గ్రేట్ ఎక్స్ పీరియన్స్. డైరెక్టర్ చాలా యునిక్ గా తీశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’ అన్నారు.
డైరెక్టర్ నితిలన్ సామినాథన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మాది చిత్తూరు పక్కన చిన్న విలేజ్. చిన్నప్పటినుంచి చిరంజీవి సర్, బాలకృష్ణ సర్, నాగార్జున సర్ ఇలా అందరి సినిమాలు చూస్తూ పెరిగాను. విజయ్ సేతుపతి గారి యాభైవ సినిమాతో మీ అందరినీ కలుసుకోవడం ఆనందంగా వుంది. తెలుగు ప్రేక్షకులు సినిమా అంటే చాలా ఇష్టం, పాషన్. ఎన్వీ ప్రసాద్ గారితో పాటు అందరికీ థాంక్స్’ చెప్పారు.
అభిరామి మాట్లాడుతూ.. చాలా ఏళ్ల తర్వాత తెలుగు సినిమాతో ఇక్కడి రావడం ఆనందంగా వుంది. మంచి కథ, మాస్ ఎలిమెంట్స్, ప్రేక్షకుడికి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో వున్నాయి. అన్నిటికిమించి విజయ్ సేతుపతి గారు వున్నారు. డైరెక్టర్ అద్భుతంగా తీశారు. ఇందులో మంచి పాత్ర చేశాను. ఇంత మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకురావడం ఆనందంగా వుంది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడాలి’ అని కోరారు.
డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. మాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన ఎన్వీ ప్రసాద్ గారికి, సురేష్ గారికి, విజయ్ సేతుపతి గారి థాంక్స్. ఈ సినిమా చూశాను. ఇందులో విజయ్ సేతుపతి గారి నటవిశ్వరూపం చూస్తారు. సినిమా అద్భుతంగా వుంటుంది. తప్పకుండా ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది. మీ అందరి ఆశీస్సులు కావాలి’ అన్నారు.
నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. మీడియా దిగ్గజం, సినిమా పరిశ్రమకు ఎన్నో గొప్ప సినిమాలు అందించిన రామోజీరావు గారికి మా యూనిట్ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన సినిమాకి అందించిన సేవలు మరువలేని. ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటు.
‘మహారాజ’లో ఫ్యామిలీ ఎమోషన్ వుంది. మాస్ వుంది క్లాస్ వుంది. విజయ్ సేతుపతి గారి నటన మరోస్థాయిలో వుంటుంది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు దగ్గరయ్యే సినిమా. ఖచ్చితం సినిమాని ఆదరిస్తారనే నమ్మకం వుంది. మంచి సినిమా చుశామనే తృప్తిని ఇస్తుంది. విజయ్ సేతుపతి గారి నటవిశ్వరూపం వుంటుంది’ అన్నారు.
నటీనటులు: విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టి (నటరాజ్), భారతీరాజా, అభిరామి, సింగంపులి, అరుల్దాస్, మునిష్కాంత్, వినోద్ సాగర్, బాయ్స్ మణికందన్, కల్కి, సచన నమిదాస్
టెక్నికల్ సిబ్బంది:
రచన & దర్శకత్వం: నితిలన్ సామినాథన్
నిర్మాతలు : సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి
అసోసియేట్ ప్రొడ్యూసర్: కమల్ నయన్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్
తెలుగు రిలీజ్: NVR సినిమాస్
మ్యూజిక్: బి అజనీష్ లోక్‌నాథ్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
ప్రొడక్షన్ డిజైనర్ : వి.సెల్వకుమార్
స్టంట్ డైరెక్టర్: అన్ల్ అరసు
డైలాగ్స్: నితిలన్ సామినాథన్, రామ్ మురళి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎ. కుమార్
తెలుగు డబ్బింగ్: పోస్ట్‌ప్రో వసంత్
సౌండ్ డిజైన్: అరుణ్ ఎస్ మణి (ఓలి సౌండ్ ల్యాబ్స్)
సౌండ్ మిక్సింగ్: M.R రాజకృష్ణన్ (R.K స్టూడియోస్)
కాస్ట్యూమ్ డిజైనర్: దినేష్ మనోహరన్
మేకప్ ఆర్టిస్ట్: AR అబ్దుల్ రజాక్
కాస్ట్యూమర్: S. పళని
కలరిస్ట్: సురేష్ రవి
స్టిల్స్ : ఆకాష్ బాలాజీ
సబ్ టైటిల్స్ : ప్రదీప్ కె విజయన్
స్టోరీబోర్డింగ్: స్టోరీబోర్డ్ చంద్రన్
VFX: పిక్సెల్ లైట్ స్టూడియో
DI: మంగో పోస్ట్
పబ్లిసిటీ డిజైనర్: చంద్రు (తండోరా)
పీఆర్వో(తమిళం): సురేష్ చంద్ర, రేఖ డి’వన్
పీఆర్వో (తెలుగు): వంశీ-శేఖర్
మార్కెటింగ్ టీమ్ (తెలుగు) – ఫస్ట్ షో
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : కె. శక్తివేల్, సుసి కామరాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

reklam ajansı profesyonel logo tasarım web tasarım kurumsal web tasarım web ajansı web tasarım şirketleri web tasarım firması web yazılım firmaları en iyi web tasarım şirketleri advertising agency professional logo design web design corporate web design web agency web design companies web design firm web software companies best web design companies