September 24, 2022

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

ఏడ తానున్నాడో మూవీ రివ్యూ

1 min read

దర్శకత్వం: దొండపాటి వంశీకృష్ణ
సంగీతం: చరణార్జున్
బ్యానర్: తనిష్క మల్టీ విజన్, దొండపాటి సినిమాస్
నిర్మాత: గుజ్జ యుగేంద్రరావు
నటీనటులు: అభిరామ్, కోమలి ప్రసాద్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్ ఇతరులు.
విడుదల : 10-12-2021
రేటింగ్: 3 / 5

 

‘బాలు’ చిత్రంలో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి పాత్రను పోషించిన మాస్టర్ అభినవ్ మణికంఠ యాభైకు పైగా చిత్రాలలో బాల నటుడి పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా మారుతూ,ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో రైటింగ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో ఏడేనిమిదేళ్ళు పనిచేసిన దొండపాటి వంశీకృష్ణ దర్శకత్వంలో గుజ్జా యుగంధర్ రావు నిర్మిస్తున్న సినిమాతో అభినవ్ మణికంఠ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం ‘ఏడ తానున్నాడో’. ప్రియురాలి కోసం ప్రియుడు వెతికే ప్రేమకథలు మనకు చాలానే వచ్చాయి. కానీ దానికి భిన్నంగా ఇందులో ప్రియురాలే ప్రియుడిని వెతుక్కుంటూ రోడ్డెక్కుతుంది. రోడ్ ట్రిప్ బేస్డ్ ఎమోషనల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయిన ‘ఏడ తానున్నాడో’ మూవీ షూటింగ్ ను వికారాబాద్ ఫారెస్ట్, శ్రీశైలం ఫారెస్ట్, బెంగళూర్, మైసూర్, కూర్గ్ హిట్ స్టేషన్స్ లో తీశారు. మరి ఏడ తానున్నాడో సినిమా ఎలా ఉంటుంది? అసలు ఎందుకు ఆమె ప్రియుడిని వెతుక్కుంటూ వెళ్ళింది అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..

కథ : 

నిత్యా ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి. తాను ప్రేమించిన ప్రియుడి కోసం, అతని జ్ఞాపకాల దారుల్లో వేల కిలోమీటర్లు ప్రయాణించే భగ్న ప్రేయసి కథ ఇది. ఒకరకంగా అడ్వెంచర్ థ్రిల్లర్ సంఘటనలతో ఈ కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది. తాను ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించిన ప్రియుడికోసం తల్లడిల్లే ఓ ప్రేయసి కథ ఇది. ఆమె కార్తీక్ అనే హీరో కార్తీక్ మిడిల్ క్లాస్ కు చెందిన యువకుడిని ఎంతగానో ప్రేమిస్తుంది. అయితే అనుకోకుండా అతను కనిపించకుండా పోతాడు ? తనను కాదని అతడు ఎక్కడికి వెళ్ళాడు ? అసలు అతను లేకుండా జీవితం లేదనుకున్న నిత్యా అతన్ని వెదికే పనిలో భాగంగా ఎన్నో ప్రాంతాలకు తిరిగింది. అసలు అతను ఎందుకు కనిపించకుండా పోయాడు ? మరి ఆమె అతడిని వెతుక్కుంటూ వెళ్లిన ప్రయత్నం ఫలించిందా ? అసలు చివరకు వాళ్లు కలిసారా? లేదా? అనేది మిగతా కథ.

నటీనటుల ప్రతిభ :

భగ్న ప్రేయసిగా కోమలి ప్రసాద్ నటన సినిమా కే హైలైట్ గా నిలుస్తుంది. అలానే సంజయ్ స్వరూప్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించారు. హీరోగా పరిచయం అయిన అభినవ్ మణికంఠ నటన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమి లేద. బాల నటుడిగా భిన్నమైన పాత్రల్లో నటించాడు కాబట్టి, ఇందులో లవర్ గా అదరగొట్టాడు. అతను హావభావాలు ఆకట్టుకునేలా ఉంటాయి. ముక్యంగా తన ప్రియురాలు కోసం ప్రియుడు పడే ఎమోషన్, ప్రియుడికోసం ప్రియురాలు పడే ఎమోషన్ ని చక్కగా చూపించారు. మిగతా పాత్రల్లో శివాజీ రాజా, సుదర్శన్, జబర్దస్త్ ఫణి, లావణ్య రెడ్డి, సాత్విక్, కావేరి తదితరులు వారి వారి పాత్రల్లో ఆకట్టుకున్నారు.

టెక్నీకల్ హైలెట్స్ :

ఈ సినిమాకు సంగీతం ఆకట్టుకునేలా ఉంటుంది. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అంతే కాదు ఆర్ ఆర్ కూడా అదిరిపోయేలా ఉంది. అలాగే ఎడిటింగ్, ఫోటోగ్రఫి ఆకట్టుకుంది. ట్రావెల్ నేపథ్యంలో సినిమా కాబట్టి.. కొత్త కొత్త లొకేషన్స్ అందంగా చూపించే ప్రయత్నం చేసారు. ఇక దర్శకుడు ఎంచుకున్న కథ కొత్తగా ఉంది.. ఇప్పటి వరకు ప్రియురాలి కోసం ప్రియడు వెదకడం కామన్. అయితే ప్రియుడి కోసం ప్రియురాలు ఎంతలా అన్వేషిస్తుంది అన్నది చాలా కొత్తగా ఉంది. ముఖ్యంగా అతడు ఎక్కడికి వెళ్ళాడు, ఏమి జరిగింది అన్నది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ విషయంలో దర్శకుడు మంచి టాలెంట్ కనబరిచాడు. కథ విషయంలో చాలాఆసక్తి కరంగా మలిచాడు . డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాగుంది. నిర్మాణ విలువలు ఓకే.

విశ్లేషణ :

ప్రియురాలి కోసం ప్రియుడు వెతికే ప్రేమకథలు మనకు చాలానే వచ్చాయి. కానీ దానికి భిన్నంగా ఇందులో ప్రియురాలే ప్రియుడిని వెతుక్కుంటూ రోడ్డెక్కుతుంది. రోడ్ ట్రిప్ బేస్డ్ ఎమోషనల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని చెప్పాలి, సినిమాను నడిపించే విషయంలో కథతో పాటు డైలాగ్స్, డైరెక్షన్, కెమెరా, ఎడిటింగ్ లాంటి విషయాలన్నీ బాగున్నాయి. మొత్తానికి ఓ మంచి లవ్ స్టోరీ అని చెప్పాలి. ఇలాంటి బిన్నమైనా సినిమాలను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని కొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు. సో ట్రావెలింగ్ నేపథ్యంలో ఓ కొత్త తరహా సినిమా చుసిన ఫీలింగ్ కలుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *