September 24, 2022

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

యష్‌ జెమ్‌లాంటి వ్యక్తి : ర‌వీనా టాండ‌న్‌

 

@ యష్‌తో తొలిసారి ….

అద్భుతమైన అనుభవం అండీ. యష్‌ జెమ్‌లాంటి వ్యక్తి. ఎంత ప్రతిభావంతుడో, అంత మంచివాడు. అద్భుతమైన నటుడు. తనతో పనిచేసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. చాలా వైవిధ్యమైన, ఆసక్తికరమైన పాత్రలో కనిపిస్తాను. అందుకే కేరక్టర్ గురించి ఇప్పుడు ఎక్కువగా చెప్పలేను. నా పాత్ర పేరు రమికా సేన్‌. కాస్త కాంప్లెక్స్ గా అనిపిస్తుంది. కానీ అంతే పవర్ ఫుల్‌ కేరక్టర్‌. గ్రే షేడ్స్ కూడా కాస్త ఉంటాయి. నా పాత్ర నెక్స్ట్ సీన్‌లో ఎలా బిహేవ్‌ చేస్తుందో ఎవరూ ఊహించలేరు. అంత గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే ఉంటుంది.

@ వెయిట్‌ చేస్తున్నారు…

వాళ్లు అలా ఎదురుచూస్తున్నారన్న ఆలోచనే నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ సినిమాలో నేను నటిస్తున్నానని చెప్పిన క్షణం నుంచి వాళ్ల ఎదురుచూపులు మొదలయ్యాయి. కేజీయఫ్‌1కి చాలా పెద్ద ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అందుకే సీక్వెల్‌ కోసం చాలా మంది చాలా చాలా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో నా ఫస్ట్ లుక్‌ చూస్తే అభిమానులకు పండగే. ఆన్‌స్క్రీన్‌లో రమికను చూడటానికి కచ్చితంగా అభిమానులు ఇష్టపడతారు. నా అభిమానుల మనస్సుల్లో నిలిచిపోయే పాత్ర అవుతుంది. ఇంకొన్నాళ్లు ఓపిక పడితే, స్క్రీన్‌ మీద చూద్దురుగానీ.

@ ఒప్పుకున్న క్షణాలు…

ప్రశాంత్‌ నీల్‌ వచ్చి స్టోరీ చెప్పగానే నాకు చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. ప్రశాంత్‌ నీల్‌ నాకు ఈ కథ చెప్పేటప్పటికి నేను ఫస్ట్ పార్ట్ కూడా చూడలేదు. ఆ తర్వాతే నేను ఫస్ట్ పార్ట్ చూశాను. అసలు ఇంత అద్భుతంగా ఎలా తీశాడా? అని నేను విస్తుపోయాను. మైండ్‌ బ్లోయింగ్‌ సినిమా అనిపించింది. న్యూ ఏజ్‌ సినిమా అప్రోచ్‌ కనిపించింది కేజీయఫ్‌ 1లో. అలాగే అతను కథ చెప్పిన తీరు, కథ, పార్ట్ 2లో నా పాత్ర అన్నీ వరుసగా కళ్ల ముందు కదిలాయి. ఈ సినిమా వద్దు అనో, నేను చేయననో చెప్పడానికి నాకు ఒక్క కారణం కూడా కనిపించలేదు. పైగా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. అందుకే వెంటనే ఓకే చెప్పేశాను.

@ హోంబలే ఫిల్మ్స్ ..
– ప్రశాంత్‌ పనిచేసే తీరు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అసలు అలాంటి పనితనమే, తన వర్కింగ్‌ స్టైలే తనని స్పెషల్‌గా ఉంచింది. చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉండే అతనిలో అలాంటి ఆలోచనల ప్రవాహం సాగుతూ ఉంటుందని ఎవరూ అనుకోరు. కానీ అతని కలలు, అతని ఆలోచనలు.. సామాన్యులకు ఊహాతీతంగా ఉంటాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *