తాప్సీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇళ్లపై ఐటి రైడ్స్ ?

బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ, దర్శకుడు అనురాగ్ కశ్యప్ నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఐటీ అధికారులు స్పష్టం చేశారు. వీరితోపాటు మరో దర్శకుడు వికాస్ బెహెల్, నిర్మాత మధు మంతెన నివాసాల్లో కూడా దాడులు జరుగుతున్నట్టు తెలిపారు. వీరిపై పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతోనే దాడులు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మొత్తంగా 20 బృందాలు ముంబై, పూణె సహా పలుచోట్ల ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనురాగ్ కశ్యప్ కు చెందిన నివాసంతోపాటు ఆయనకు చెందిన ఫాంటమ్ ఫిల్మ్, టాలెంట్ హంట్ కంపెనీ కార్యాలయాల్లో కూడా దాడులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే.. ఫాంటమ్ ఫిలిం 2018లోనే మూసేశారు. ఇటివల కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తాప్సీ, అనురాగ్ తమ నిరసన గళం వినిపించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తాప్పీ.. 2019లో పౌరసత్వ వ్యతిరేక చట్టంపై నిరసనకారులపై హింసను ఖండిస్తూ అనురాగ్ ట్వీట్లు చేశారు. ఈ నేపథ్యంలో వీరిపై ఐటీ రైడ్లు జరగడం చర్చనీయాంశమైంది.