October 1, 2022

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

Jail Movie is Real Story

వాస్తవ సంఘటనల జైల్‌ (లాకప్‌)
చట్టాలు ఎన్ని ఉన్నా ప్రతి రోజు ఎక్కడో ఒక చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ వాస్తవ సంఘటనల ఆధారంగా ‘జైల్‌’ (లాకప్‌) పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వెంకటేష్‌ మమ్ముల, సృజన్‌, అనన్య. హైమావతి, దేవ యశ్వంత్‌, వాసుదేవ్‌, లక్ష్మీరావు, కె.ఎస్‌. దేవి, రంజిత్‌, కీర్తన, నూతన్‌ బాు, శంభుప్రసాద్‌ ప్రధాన పాత్రధారులు. మాదాని కవితరాణి సమర్పణలో దండు శివకుమార్‌ నిర్మిస్తున్నారు. స్క్రీన్‌ప్లే, దర్శకత్వం జి.ఎస్‌. గౌడ్‌. ఇప్పటికే ప్రధాన భాగం చిత్రీకరణ పూర్తిచేశారు. తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది అని దర్శక, నిర్మాతలు తెలిపారు. జైల్‌ చిత్రం అందరినీ ఆలోచింపజేస్తుందని వారు చెప్పారు. ఎస్‌ఎంవీ ఫిలింస్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కథ: డి.శివకుమార్‌, మాటలు: పోలూర్‌ ఘటికాచలం, సంగీతం : సాయినాథ్‌, ఛాయాగ్రహణం: సురేంద్ర, పాటలు: పి.నాగేంద్రప్రసాద్‌, మేనేజర్‌: వెద ప్రకాష్‌ మిశ్ర, కో డైరెక్టర్‌: పి.ఫణీంద్రప్రసాద్‌, నిర్మాత: దండు శివకుమార్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ఎస్‌. గౌడ్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *