September 28, 2023

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

రోజాపై షాకింగ్ కామెంట్స్ చేసిన కత్తి మహేష్ ?

ఇప్పటికే పలు విమర్శలతో సంచలనం క్రియేట్ చేసిన కత్తి మహేష్ .. తాజాగా సినీ నటి రోజా పై విమర్శలు గుప్పించి మరోసారి సంచలనం రేపాడు. ఇదివరకే సింగర్ సునీత రెండో పెళ్లి గురించి స్పందించాడు. ఇక ఇప్పుడు రోజాపై విమర్శలు గుప్పించాడు కత్తి మహేష్. ఆమె జబర్దస్త్ వంటి వెకిలి కామెడీ షో చేయడం మానేయాలని అప్పుడే ఆమెకు గౌరవం దక్కుతుందని అభిప్రాయపడ్డాడు మహేష్. ఇటీవలే రోజా పీ శాసనసభ ప్రివిలేజ్‌ కమిటీ సమావేశంలో తనను ఎవరూ పట్టించుకోవడం లేదని, తనకు దక్కాల్సిన గౌరవం దక్కట్లేదని ఆవేదన వ్యక్తం చేసారు. దీనిపై కత్తి మహేష్ స్పందిస్తూ, “ఆ వెకిలి షో వదిలేస్తే దక్కాల్సిన గౌరవం దక్కుతుంది. అనాథలపై హైపర్ ఆది వంటి వారు పంచులు వేస్తుంటే ఖండించాల్సిన స్థాయిలో ఉండి రోజా వెకిలి నవ్వులు నవ్వుతున్నారు. ఇక ఆమెకు గౌరవం ఎలా వస్తుంది? అయినా జబర్దస్త్ వల్లే తాను ఎమ్మెల్యేగా గెలిచాను అని ఆమె అంటున్నారు. మరి నగరి నియోజకవర్గ ప్రజల పరిస్థితి ఏంటి” అని కత్తి మహేష్ విమర్శలు గుప్పించాడు. మరి ఈ విమర్శలపై రోజా ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *