Kodi Ramakrishna Duaghter Produced by Kiran Abbavaram Movie

కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య నిర్మాతగా కిరణ్ అబ్బవరం హీరోగా సినిమా ప్రారంభం
లెజెండరీ దర్శకుడు, దివంగత కోడి రామకృష్ణ పెద్ద కూతురు కోడి దివ్య దీప్తి నిర్మాతగా మారారు. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తొలి సినిమాకు ముహూర్తం పెట్టారు. ఈమె ప్రొడక్షన్లో మొదటి సినిమా కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కబోతుంది. జూలై 15న కిరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు కోడి దివ్య. కార్తీక్ శంకర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కిరణ్ అబ్బవరం నటిస్తున్న 5వ సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలను త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.
హీరో: కిరణ్ అబ్బవరం
సాంకేతిక నిపుణులు:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కార్తీక్ శంకర్
బ్యానర్: కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: కోడి దివ్య దీప్తి
సంగీతం: మణి శర్మ
పి ఆర్ ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్