April 19, 2024

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

Konckout Movie Launch

1 min read

బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న మరో కొత్త చిత్రం  ‘KNOCK OUT'”

బన్నీ,భగీరథ,ఢీ చిత్రాల నిర్మాత ఎం.ఎస్.ఎన్ రెడ్డి గారి సోదరుడి కుమారుడు ఎం.ఎస్.రెడ్డి (బాబి రెడ్డి) ఫ్లోటింగ్ షర్పా ప్రొడక్షన్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం “KNOCK OUT” ఈ చిత్రం ద్వారా మహీధర్ ను హీరోగా, ఉదయ్ కిరణ్ ను దర్శకుడు గా  పరిచయం చేస్తున్నారు.ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితర సినీ, ప్రముఖులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం దర్శకుడు సాయి రాజేష్ హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ నిచ్చారు.చిత్ర దర్శకుడు ఉదయ్ కిరణ్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

చిత్ర నిర్మాత ఎం.ఎస్.రెడ్డి (బాబి రెడ్డి)మాట్లాడుతూ.. మా పూజా కార్యక్రమానికి వచ్చిన దర్శకుడు సాయి రాజేష్ కు, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కు ధన్యవాదాలు. దర్శకుడు చెప్పిన కథ చాలా ఇంట్రెసింగ్ అనిపించింది.ఈ చిత్రం ఆద్యంతం బాక్సింగ్ మీద ఉండగా చిత్రంలో వుండే 7 ఫైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి
ఈ ఫైట్స్ అన్ని కూడా ప్రముఖ ఫైట్ మాస్టర్స్ చేత కంపోజ్ చేయించడం జరిగింది. ప్రముఖ ఛాయా దర్శకుని వద్ద పనిచేసిన జీ.వి. ప్రసాద్ డి.ఓ.పి గా చేయనున్నారు.
మిగిలిన తారాగణం టెక్నీషియన్స్ ఎంపిక చేసి, మార్చి మొదటి వారం నుండి నిర్విరామంగా షూటింగ్ చేసుకొని 60 రోజులలో ఈ చిత్రం పూర్తి చేసి సమ్మర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

చిత్ర దర్శకుడు కిరణ్ మాట్లాడుతూ.. నేను చెప్పిన కథ నచ్చడంతో ఫ్లోటింగ్ షెర్పా ప్రొడక్షన్ లో దర్శకుడు గా వర్క్ చేసే అవకాశం కల్పించిన నిర్మాత ఎం.ఎస్.రెడ్డి గారికి నా ధన్యవాదాలు.ఒక మార్షల్ ఆర్జిస్ట్ తన లైఫ్ లో ప్రతి ఫేస్ లో ఎదురయ్యే ఆప్టికల్స్ ను ఎలా ఎదుర్కొంటాడు.అలా ఎదుర్కొనే ప్రాసెస్ లో తనేం కోల్పోతాడు.తను అనుకున్న గోల్ ను రీచ్ అయ్యాడా.. లేదా..అనేదే కథ..భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం  భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ , వైజాక్, అరకు, తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేసుకొని సమ్మర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు.

చిత్ర హీరో మహీధర్ మాట్లాడుతూ..ఇది M.M.A బ్యాక్ డ్రాప్ లో వస్తున్న చిత్రమిది.ఫుల్ యాక్షన్ మూవీ ఇది.ఈ చిత్రం కొరకు నేను కిక్ బాక్సింగ్ నేర్చుకోవడం జరిగింది. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

నటీనటులు
మహీధర్ (తొలి పరిచయం)

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : ఫ్లోటింగ్ షెర్పా ప్రొడక్షన్
నిర్మాత : ఎం.ఎస్.రెడ్డి
దర్శకుడు : ఉదయ్ కిరణ్
డి.ఓ పి : జి వి ప్రసాద్
పి.ఆర్.ఓ : సతీష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

reklam ajansı profesyonel logo tasarım web tasarım kurumsal web tasarım web ajansı web tasarım şirketleri web tasarım firması web yazılım firmaları en iyi web tasarım şirketleri advertising agency professional logo design web design corporate web design web agency web design companies web design firm web software companies best web design companies