September 26, 2022

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

ఆచార్య ఖ‌మ్మం షెడ్యూల్ పూర్తి

1 min read

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ప‌వ‌ర్ ఫుల్ మెగా ఎంట‌ర్ టైన‌ర్ `ఆచార్య`‌. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో కాజ‌ల్ – పూజా హెగ్డే క‌థానాయిక‌లు. మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ – కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిరంజ‌న్ రెడ్డి- రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌లు.

ఇటీవ‌ల ఖ‌మ్మం షెడ్యూల్ తో చిత్ర‌బృందం బిజీగా ఉంది. ఈ షెడ్యూల్ లో చిరంజీవి- రామ్ చ‌రణ్ పై కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. తాజాగా ఈ షెడ్యూల్ విజ‌య‌వంతంగా పూర్త‌యింద‌ని నిర్మాత‌లు వెల్ల‌డించారు. నిర్మాత‌ల్లో ఒక‌రైన నిరంజ‌న్ రెడ్డి మాట్లాడుతూ-“ఖ‌మ్మం షెడ్యూల్ ని ఎలాంటి ఆటంకాల్లేకుండా స‌క్సెస్ ఫుల్ గా పూర్తి చేసి తిరిగి హ‌ద‌రాబాద్ లో అడుగుపెట్టాం. చిరంజీవి -చ‌ర‌ణ్ పై కీల‌క స‌న్నివేశాల‌ను ఈ షెడ్యూల్ లో చిత్రీక‌రించాం“ అని తెలిపారు.

ఈ సినిమా మే 13న థియేటర్లలోకి రానుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *