September 30, 2022

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

Merise Merise Movie Review

1 min read

లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌  చిత్రం  ‘మెరిసే మెరిసే’ మూవీ రివ్యూ

Rateing : ౩ / 5
నటీనటులు :
దినేష్ తేజ్, శ్వేతా అవస్తి, సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్, మని, శశాంక్, నానాజీ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
బ్యానర్: కొత్తూరి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, నిర్మాత: వెంకటేష్ కొత్తూరి, ర‌చ‌న‌, దర్శకత్వం: పవన్ కుమార్. కె, సినిమాటోగ్ర‌ఫీ: న‌గేశ్ బానెల్, సంగీతం: కార్తిక్ కొడగండ్ల, ఎడిట‌ర్‌: మ‌హేశ్‌, పి.ఆర్‌.ఒ: సాయి స‌తీశ్‌

కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై
” హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్థి జంటగా పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి నిర్మించిన లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ uiచిత్రం  ‘మెరిసే మెరిసే’.ఈ చిత్రం ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్టైన్ చేసిందో చూద్దాం పదండి.

కథ
ఇంజినీరింగ్ పూర్తి చేసుకొని సొంతంగా ఎదగాలని స్టార్టప్ కంపెనీ ప్రారంభించి విఫలమైన సిద్దు (దినేష్ తేజ) తల్లిదండ్రుల సూచన మేరకు బెంగళూరు వదిలి హైదరాబాద్ మరతాడు. హీరోయిన్ తల్లిదండ్రులు ఇంజినీరింగ్ పూర్తి చేయమని చెప్తూ లండన్ లో డాక్టర్ గా పనిచేసే యువకుడితో పెళ్లి సంబందం కుదుర్చుకున్న వెన్నెల (శ్వేత అవస్థి) ఫ్యాషన్ డిజైనర్ కావాలనే కోరిక ఉంటుంది. కాబోయే భర్త అత్త కోరికలకు వ్యతిరేకంగా ఫ్యాషన్ డిజైనింగ్ లో మంచి పేరు సంపాదించు కోవానుకుంటుంది.. ఆ క్రమంలో వెన్నెల, సిద్ధూ లు కలుసుకుంటారు వారి పరిచయం వెన్నెల పెళ్లి బ్రేకప్ వరకు వెళుతుంది. ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కన్న వెన్నెల లక్ష్యం నెరవేరిందా ? ఏ పరిస్థితుల్లో వెన్నెలతో సిద్దు పరిచయం జరిగింది వారి పరిచయం ఇలాంటి పరిస్థితులకు దారితీసింది. వారి పరిచయం ప్రేమకే పరిమితం అయిందా ? లేక స్నేహం వరకే ఉందా ? లండన్ డాక్టర్ తో బ్రేక్ అప్ కు దారితీసిన పరిస్థితులు ఏంటి ? చివరకు లండన్ బాబు తో వెన్నెల జీవితాన్ని సరిపెట్టుకుంటూ ఉందా  లేక సిద్దు తో రిలేషన్ నాకు ఇంతవరకు తీసుకెళ్ళింది అనే ప్రశ్నలకు సమాధానమే మెరిసే మెరిసే..

నటీనటుల పనితీరు
హుషారు ప్లేబ్యాక్ సినిమాలతో పక్కింటి కుర్రాడు లా ఎలా మెప్పించాడో ఇందులో కూడా దినేష్ తేజ మరోసారి ఆకట్టుకొన్నాడు .యువకుడిగా ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనేది తెరపైన మెప్పించాడు.హీరోయిన్ శ్వేత అవస్థి నటన అద్భుతంగా ఉంది. తనకిచ్చిన పాత్రలో చక్కగా ఒదిగిపోయి తన పాత్ర పరిధి మేరకు రాణించింది. జై స్వరూప్, సంధ్యాజనక్ బిందు పర్వాలేదనిపించారు హీరో హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు ప్రత్యేకంగా అనిపించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు పవన్ కుమార్ ఎంచుకున్న కథ.. కథనాలు బాగున్నాయి. అనవసరపు  హంగులు ఆర్భాటాలకు పోకుండా నేరుగా సింపుల్ గా  కథను చెప్పే ప్రయత్నం చేశారు. ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్ లా సినిమాను డీల్ చేశాడు. కథకు తగ్గ సన్నివేశాలతో బోరింగ్ లేకుండా రెండుగంటల పాటు చాలా సరదాగా సాగిపోయేలా స్క్రీన్ ప్లేను రాసుకుని మెప్పించారు దర్శకుడు.ఓ అమ్మాయి లోని ఎమోషన్ కోణాన్ని ఆవిష్కరించే తపన దర్శకుడు లో కనిపిస్తుంది. హీరోయిన్ కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. ఇక మిగిలిన అన్ని విభాగాల పనితీరు చాలా రిచ్ గా కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు  సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నాగేష్ ప్రతి సన్నివేశాన్ని చాలా అందంగా చూపించాడు. పలు సన్నివేశాలను కార్తీక్ తన మ్యూజిక్ తో మరో లెవల్ కి తీసుకెళ్లారు .. కథ ,నటీనటుల ఎంపికలో వెంకటేష్ కొత్తూరి టేస్ట్ బాగుంది.నిర్మాత ఖర్చుకు వెనకాడకుండా నిర్మాణ విలువలను చాలా గ్రాండియర్ గా చూపించారు.ఫీల్గుడ్ చిత్రాన్ని అందించే ప్రయత్నం చేశారు .మెరిసే మెరిసే సినిమాను ఓవరాల్గా చూస్తే ఎలాంటి అశ్లీలత అసభ్యత లేని చిత్రం గా చెప్పవచ్చు హీరోయిన్ గ్లామర్ పెర్ఫార్మెన్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా మారాయి. ఫ్యామిలీతో పాటు తరువాయి తే మెరిసే మెరిసే నుంచి సక్సెస్ అందుకోవడం ఖాయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *