September 8, 2024

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్ పో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

1 min read

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ సొంతిల్లు కొనుగోలు చేయాలని చాలా మందికి ఒక కల ఉంటుంది. మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకు అందరూ తమ తమ స్థాయిని బట్టి సొంతిళ్లు కొంటారు. అయితే, ఏ ప్రాంతంలో కొనుగోలు చేయాలి? ఏ బ్యాంకులో ఎలా రుణాలు పొందాలి? అనే విషయాల్లో చాలా మందికి సందిగ్ధాలు ఉంటాయి. ఆ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు, మంచి ఇల్లు కొనడంలో సాయం చేసేందుకు ‘టైమ్స్ హోమ్ హంట్ ఎక్స్‌పో’ ఒక మంచి వేదిక. 40 మంది ప్రముఖ బిల్డర్స్, 100కి పైగా ప్రాజెక్టులు ఇందులో పాల్గొంటున్నాయి.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ టైమ్స్ అఫ్ ఇండియా గ్రూప్స్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ ఎక్స్ పో ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తి మూడు నెలలు ఎన్నికల కోడ్ ఉండే ఎన్నికల కోడ్ కారణంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదు ఇప్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి పై ఫోకస్ పెడ్తామ్. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగానికి అనువైన స్థలం
అమరావతి, హైదరాబాద్ తో పోల్చితే హైదరాబాద్ స్థానం హైదరాబాద్ కె ఉంది. చంద్రబాబు నాయుడు అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్న. హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో ఆర్ఆర్ఆర్, రిజినల్ రింగ్ రోడ్, మెట్రో డెవలప్మెంట్, మూసి డెవలప్మెంట్ పై సీఎం ఫోకస్ చేసారు. రిజిస్ట్రేషన్ విషయంలో కూడా కంపెనీలు ఇచ్చే సూచనలు పరిగణలోకి తీసుకుంటాం. రెండు రోజుల్లో ఈ అంశాలపై చర్చిస్తాం. పక్కరాష్ట్రంలో వేరే ప్రభుత్వం వచ్చిందని, మన దగ్గర ఎదో జరుగుతుందని అపోహ వద్దు బిల్డర్స్ కు న్యాయమైన అన్ని అంశాల్లో సపోర్ట్ చేస్తాం. పేదవాడికి మంచి చేసే పనులకు సహకరిస్తాం. రియల్ ఎస్టేట్ రంగానికి హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ అని కంపెనీల ప్రతినిధులు చెప్తున్నారు. పాలసీల విషయంలో ప్రభుత్వం అందడండగా గా ఉంటుంది అని అన్నారు.

ఇక హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ గురించి వస్తే.. ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పెట్టుబడులన్నీ అమరావతికి తరలిపోతాయని, హైదరాబాద్‌లో భూముల ధరలు తగ్గిపోతాయని 10 రోజులుగా ఒక రకమైన చర్చ జరుగుతోంది. అమరావతికి పెట్టుబడులు వస్తే రావొచ్చేమో గానీ.. హైదరాబాద్‌కు నష్టం కలుగుతుందనేది మాత్రం ఒక అపోహ మాత్రమే.

హైదరాబాద్ భవిష్యత్తుకు ఢోకా లేదు. ఎందుకంటే ఈ నగరానికి ఉన్న భౌగోళిక వనరులు, ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలే అందుక్కారణం. దేశంలోనే ప్రత్యేకమైన, అరుదైన నగరం ఇది. దీనికి వచ్చిన ప్రమాదం ఏమీలేదు. ఇప్పటికే దేశ విదేశాల దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరిన్ని సంస్థలు హైదరాబాద్‌కు వస్తున్నాయి. ఆదిభట్లలో అతి త్వరలో ఫాక్స్‌కాన్ కార్యకలాపాలు ప్రారంభించబోతోంది. రానున్న రోజుల్లో ఆ ప్రాంతంలో విశేష అభివృద్ధిని చూస్తాం.

ఇక RRR ప్రాజెక్టు హైదరాబాద్‌తో పాటు తెలంగాణకే ‘గేమ్ ఛేంజర్’ లాంటిది. ఆర్‌ఆర్‌ఆర్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలన్నీ పారిశ్రామికంగా, అర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇళ్లు, విల్లాల నిర్మాణానికి కూడా పెద్ద ఎత్తున స్థలాలు అందుబాటులోకి వస్తాయి. కొండాపూర్, పటాన్‌చెరు, శంషాబాద్, కోకాపేట ప్రాంతాల్లో ఇప్పటికే విపరీతమైన డిమాండ్ ఉంది. తాజాగా ఉప్పల్, ఎల్‌బీనగర్, మేడ్చల్ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతోంది.

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు విస్తరణపై ప్రభుత్వం వద్ద ప్రణాళికలు ఉన్నాయి. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది. మూసీ పరిసర ప్రాంతాలన్నీ అద్భుతంగా రూపుదిద్దుకోనున్నాయి. ఫార్మాసిటీ, సెమీ కండక్టర్ పాలసీ, హెల్త్ సెక్టార్, పర్యాటకం రంగాల ప్రోత్సాహానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. తెలంగాణలో పెట్టుబడిదారులకు మరింత సానుకూల వాతావరణం కనిపించేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. భవిష్యత్తులో మరిన్ని తీసుకోబోతోంది.

ఇక అత్యంత ముఖ్యమైన అంశం.. HMDA పరిధి విస్తరణ. ఓఆర్‌ఆర్ పరిధిలోకి వచ్చే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను హెచ్‌ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. శివారు ప్రాంతాలలోని మరిన్ని గ్రామాలు హైదరాబాద్ నగరం పరిధిలోకి వస్తాయి. ఇవన్నీ హైదరాబాద్ నగర అభివృద్ధికి, ఇక్కడ సొంతిళ్లు నిర్మాణం చేసుకొని స్థిరపడటానికి, వ్యాపారం చేసుకొని పైకెదగడానికి పుష్కలంగా అవకాశం కల్పిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

reklam ajansı profesyonel logo tasarım web tasarım kurumsal web tasarım web ajansı web tasarım şirketleri web tasarım firması web yazılım firmaları en iyi web tasarım şirketleri advertising agency professional logo design web design corporate web design web agency web design companies web design firm web software companies best web design companies