December 2, 2023

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

విడుద‌ల‌కి సిద్ద‌మైన ఊర్వశి రౌతేల బ్లాక్ రోజ్

సూపర్ హిట్ చిత్రాల నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తమ శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్ పై పవన్ కుమార్ సమర్పణలో ప్రొడక్షన్ నెం: 4 గా ‘బ్లాక్ రోజ్’ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. మాస్ డైరెక్ట‌ర్ సంపత్ నంది క్రియేట్ చేస్తున్న ఈ చిత్రానికి మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు సార్లు మిస్ ఇండియాగా గెలుపొందిన అందాల తార ఊర్వశి రౌతేల హీరోయిన్ గా నటిస్తున్న ‘బ్లాక్ రోజ్’ ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ మూవీ నుండి ఇటీవ‌ల విడుద‌ల చేసిన‌ ‘నా తప్పు ఏమున్నదబ్బా’ అంటూ సాగే ప్రమోషనల్ వీడియో సాంగ్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ ప్రమోషనల్ సాంగ్ లో హీరోయిన్ ఊర్వశి రౌతేల తన అందం తో పాటు అద్భుతమైన డాన్స్ స్టెప్స్ తో విశేషంగా ఆకట్టుకున్నారు. మణి శర్మ కంపోజ్ చేసిన ఈ పాటకి జానీ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు. ఈ రోజు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌ల‌తో హీరోయిన్ ఊర్వశి రౌతేల లుక్‌ని విడుద‌ల చేశారు. చేతిలో గులాబి పువ్వు ప‌ట్టుకుని ఉన్న ఈ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది.

షేక్స్ పియర్ రచించిన ‘ద మర్చంట్ ఆఫ్ వెనిస్’ లో షైలాక్ అనే పాత్రని ఆధారంగా చేసుకుని ఫిమేల్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా ‘బ్లాక్ రోజ్’ తెరకెక్కుతోంది. ‘విచక్షణ లేని యోగ్యత లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం’ అనే కౌటిల్యుడి అర్థ శాస్త్రం లోని కాన్సెప్ట్ తో ‘బ్లాక్ రోజ్’ రూపొందింది.
ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోన్న ఈ చిత్రం విడుద‌ల‌కి సిద్దంగా ఉంది.

ఊర్వశి రౌతేల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి
రచన: సంపత్ నంది, మోహన్ భరద్వాజ్
ఆర్ట్ డైరెక్టర్: ఆచార్య సత్యనారాయణ
ఎడిటర్: తమ్మిరాజు
పి ఆర్ ఓ: బి. ఏ. రాజు
డి ఓ పి: ఎస్‌. సౌందర్ రాజన్
సంగీతం: మణిశర్మ
సమర్పణ: పవన్ కుమార్
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి
క్రియేటెడ్ బై: సంపత్ నంది
దర్శకత్వం: మోహన్ భరద్వాజ్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *