October 1, 2023

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

Mugguru Monagallu Movie Review

శ్రీనివాస్ రెడ్డి మార్క్ పైసా వసూల్ ఎంటర్టైనర్

తారాగణం : శ్రీనివాసరెడ్డి, దీక్షిత్‌ శెట్టి, వెన్నెల రామారావు, రిత్విష్‌శర్మ, శ్వేతా వర్మ, నాజర్, రాజా రవీంద్ర తదితరులు…

సాంకేతికవర్గం:
సంగీతం : సురేష్‌ బొబ్బిలి
కూర్పు: బి. నాగేశ్వర రెడ్డి
నిర్మాత : పి. అచ్యుత్‌ రామారావు
దర్శకత్వం: అభిలాష్‌ రెడ్డి

‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనంతరం స్టార్ కమెడియన్ శ్రీనివాస్‌ రెడ్డి తాజాగా ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో చిత్రమందిర్‌ స్టూడియోస్‌ పతాకంపై అచ్యుత్‌ రామారావు ఈ సినిమాని నిర్మించారు. దీక్షిత్‌ శెట్టి (కన్నడ హిట్‌ మూవీ ‘దియా’ ఫేమ్‌), వెన్నెల రామారావు, రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారులు. ఆగస్టు 6న విడుదలైన ఈ చిత్ర సమీక్ష మీ కోసం:

కథ :
సుశాంత్ (శ్రీనివాస్ రెడ్డి) బధిరుడు. అంటే వినపడదు, కిషోర్ (దీక్షిత్‌ శెట్టి) మాట్లాడలేడు, దీపక్ ( వెన్నెల రామారావు) కు అంధుడు. అలాంటి ఈ ముగ్గురికి అనుకోకుండా వరుస హత్యల జరుగుతున్న కేసులో క్లూ దొరుకుతుంది. రూలింగ్ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులను ఎవరో అతి దారుణంగా చంపుతూ ఉంటారు. వారిని చంపుతుంది ఎవరు ? ఈ హత్యల వెనుక ఎవరి హస్తం ఉంది ? సుశాంత్ కి, కిషోర్ కి, దీపక్ కి ఈ హత్యల గురించి ఎలా తెలుసు ? ఈ మధ్యలో సుశాంత్ ప్రేమ కథ ఎలా సాగింది ? అన్నదే క్లుప్తంగా కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీనివాస్ రెడ్డి.. సైడ్ హీరోల్లాంటి దీక్షిత్‌ శెట్టి, వెన్నెల రామారావు తమదైన కామెడీ టైమింగ్ తో నవ్వించడానికి చాలా ప్రయత్నాలే చేశారు. చాలా చోట్ల బాగానే నవ్వించారు కూడా. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి సీక్వెన్స్ మరియు దీక్షిత్ శెట్టి లవ్ సీన్స్ హిలేరియస్ అని చెప్పొచ్చు. సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన రాజా రవేంద్ర కూడా బాగా ఆకట్టుకున్నాడు.
కథలో కామెడీతో కూడుకున్న సీరియస్ నెస్ కూడా తీసుకొచ్చారు. అలాగే వరుస హత్యల వెనుక డ్రామా ఆకట్టుకుంటుంది. హీరోయిన్ తోపాటు ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు సినిమాలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తూనే.. వీలైనంత వరకు నవ్వించాడనికే ప్రయత్నం చేశాడు.

మైనస్ పాయింట్స్:

సినిమా మెయిన్ కాన్సెప్ట్ తో సంబందం లేని అనవసరమైన సీన్స్ తో సినిమాని డైవర్ట్ చేయడం ఈ సినిమాకి కొంచెం మైనస్ అని చెప్పాలి. అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ పండకపోవడం కూడా. స్క్రీన్ ప్లే పరంగా ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు కొన్ని సీన్స్ న స్క్రీన్ మీద బాగా ఎగ్జిక్యూట్ చేశారు. కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. సంగీతం ఓకే. చిత్ర నిర్మాత కథకు తగ్గట్లుగా ఖర్చు పెట్టారు. అది ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది.

ఫైనల్ గా చెప్పాలంటే…

కొన్ని లోపాలున్నప్పటికీ… “ముగ్గురు మొనగాళ్లు” సినిమా శ్రీనివాస్ రెడ్డి మార్క్ పైసా వసూల్ టైమ్ పాస్ ఎంటర్‌టైనర్‌ అని చెప్పొచ్చు. థియేటర్ లో ఒకసారి, టీవీలో వచ్చిన ప్రతిసారీ హ్యాపీ గా చూసేయొచ్చు!!

రేటింగ్: 3/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *