గ్లామర్ పాత్రలు చేయడానికి సిద్ధమంటున్న భామ ?

వల్గారిటీ లేనంతవరకు గ్లామర్ పాత్రలు చేయడానికి రెడీ అంటోంది నివేద పేతురేజ్ . నేను నా పాత్ర గురించి మాత్రమే ఆలోచిస్తా.. ప్రాధాన్యం ఉంటే చాలు.. అది మొదటి హీరోయినా? రెండో హీరోయినా? అనేది చూడను అని అంటోంది అందాల భామ నివేద పేతురేజ్. ‘మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా’ సినిమాలతో హీరోయిన్ గా ఆకట్టుకున్న నివేద ఆలా వైకుంఠపురంలో సినిమాతో మరింత మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెడ్ సినిమాలో నటిస్తుంది. తాజాగా ఈ సినిమా విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడిన నివేద.. సినిమాల్లో రెండో హీరోయిన్ పాత్ర , మొదటి హీరోయిన్ పాత్రలని కాకుండా పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్నాను అని చెప్పింది. అంతే కాదు గ్లామర్ రోల్స్ చేయడానికి సైతం రెడీ అంటోంది. అయితే ఆ పాత్రలు కూడా మరి వల్గారిటీ లేకుండా ఉన్నంతవరకు ఒకే అని అనడమే కాదు అచ్చు విజయ్ సేతుపతిలా అన్ని రకాల పాత్రలు చేస్తేనే ఇక్కడ ఎక్కువకాలం ఉండగలం అని హింట్ కూడా ఇస్తోంది.