ఓదెల రైల్వేస్టేషన్ నుండి కొత్త పోస్టర్
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో సూపర్ హిట్ చిత్రాల నిర్మాత కె.కె.రాధామోహన్ నిర్మిస్తోన్న డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ `ఓదెల రైల్వేస్టేషన్`. మాస్ డైరెక్టర్ సంపత్‌నంది కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నుండి ఇటీవల విడుదలైన అన్ని లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది కాగా న్యూ ఇయర్ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. హీరో వశిష్ట సింహ, హెబా పటేల్ న్యాచురల్‌గా ఉండి ట్రాక్టర్ మీద వెళ్తున్న ఈ లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ‘ఓదెల’ అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఓ వైవిధ్యభరిత క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో వాస్తవికతకు దగ్గిరగా ఈ చిత్రం రూపొందుతోంది.
వశిష్టసింహ,హెబా పటేల్, సాయిరోనక్, పూజితా పొన్నాడ, నాగమహేష్(రంగస్థలం ఫేమ్), భూపాల్, శ్రీగగన్, దివ్య సైరస్, సురేందర్ రెడ్డి, ప్రియా హెగ్దె తదితరులు నటిస్తోన్నఈ చిత్రానికి
సినిమాటోగ్రఫి: ఎస్. సౌందర్ రాజన్,
సంగీతం: అనూప్ రూబెన్స్,
ఎడిటింగ్: తమ్మిరాజు,
ఫైట్స్: రియల్ సతీష్,
సమర్ఫణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్,
నిర్మాత: కె.కె.రాధామోహన్,
కథ, మాటలు, స్క్రీన్ ప్లే: సంపత్‌నంది,
దర్శకత్వం: అశోక్ తేజ.