February 22, 2024

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

ముంబై లో ఇల్లు కొన్న పూజ హెగ్డే ?

మొత్తానికి టాలీవుడ్ ముద్దుగుమ్మ పూజ హెగ్డే బాలీవుడ్ లో సెటిల్ అయ్యేందుకు గట్టి ప్రయత్నమే చేస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు తాజాగా ముంబై లో సొంతిల్లు కొనేసింది ? బాలీవుడ్‌ స్టార్స్‌ అంతా కూడా ఖరీదైన బాంద్రా ఏరియాలో ఇల్లు లేదా అపార్ట్‌ మెంట్‌ లో ఫ్లాట్‌ కొనుగోలు చేయడం చాలా కామన్‌ విషయం. ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే అక్కడ ఖరీదైన ఫ్లాట్‌ కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సౌత్‌ లో బిజీ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే బాలీవుడ్‌ కు మెల్ల మెల్లగా అడుగులు వేస్తుంది. అక్కడ బిజీ హీరోయిన్‌ గా మారిపోవాలని ఈమె భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. బాంద్రాలో సముద్రం ఫేసింగ్‌ తో ఫ్లాట్‌ ను కొనుగోలు చేసిన పూజా హెగ్డే ఇంటీరియర్‌ కోసం కూడా భారీగా ఖర్చు చేసిందట. ఈమె ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమా షూటింగ్‌ కు వెళ్లిన సమయంలో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశ్యంతో అక్కడ ఫ్లాట్‌ కొనుగోలు చేసిందని అంటున్నారు. మరి ఈ అమ్మడు బాలీవుడ్‌ లో సెటిల్‌ అయ్యే ఉద్దేశ్యంతో అక్కడ ఫ్లాట్‌ కొనుగోలు చేసిందా లేదా అలా పడి ఉంటుందని అక్కడ ఫ్లాట్‌ ను కొనుగోలు చేసిందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం టాలీవుడ్‌ లో ఈమె మూడు సినిమాలను చేస్తుంది. రెండు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఇంకా పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. మరో వైపు బాలీవుడ్‌ లో కూడా ఈమె సినిమాలు చేస్తు బిజీ బిజీగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *