పవర్ స్టార్ వకీల్ సాబ్ నుండి మరో లీక్ ?
పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లొకేషన్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారీన సంఘటనలు ఉన్నాయి. తాజగా ఈ షూటింగ్ కు సంబందించిన మరో లీక్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు హీరోయిన్ శృతి హాసన్ పాల్గొంటుంది .. తాజాగా వీరిద్దరి ఫోటో ఒకటి బయటికి వచ్చింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హిందీలో సూపర్ హిట్టయిన పింక్ సినిమాకు రీమేక్. పవన్ కళ్యాణ్ తో శృతి హాసన్ చేస్తున్న మూడో సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.