October 1, 2023

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

Praksh Raj Launches Na Venta Paduthuna Chinadevadama poster

1 min read

లక్షణ నటుడు శ్రీ ప్రకాష్ రాజ్ చేతులమీదుగా ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లాంచ్

ముల్లేటి నాగేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో జి.వి.ఆర్ ఫిలిం మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్స్ మూవీస్ బ్యానర్ లో నిర్మించిన ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను భారత జాతి గర్వించదగ్గ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ గారి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ .. ఈ చిత్రం టైటిల్ తన మనసుకు చాలా నచ్చిందని ప్రశంసించారు. ఈ చిత్రంతో నూతన పరిచయం అవుతున్న వాళ్లందరికీ బంగారు భవిష్యత్తు ఉంటుందని కొనియాడారు. ఇలాంటి మంచి చిత్రంకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పారు. ఇలాంటి మంచి చిత్రాన్ని తీసినందుకు దర్శకుడు వెంకట్ వందెలను ఆశీర్వదిస్తూ.. అభినందించారు.

దర్శకుడు వెంకట్  వందెల మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ లాంటి జాతీయ నటుడి చేతులమీదుగా నా మొదటి చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేయడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తనను నమ్మి దర్శకుడిగా అవకాశమిచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మాతలు ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ… మేము నిర్మించిన చిత్రం ప్రకాష్ రాజ్ లాంటి గొప్ప నటుడి మనసుకు నచ్చడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంతో ఇంకో ప్రత్యేకత చెబుతూ ‘దర్శకుడిని, హీరోని, హీరోయిన్ ను తొలి పరిచయం మా సంస్థ నుండి చేయడం సంతోషంగా ఉందన్నారు.

నటీనటులు
“హుషారు” ఫెమ్ గని కృష్ణతేజ్ , అఖిల ఆకర్షణ, తనికెళ్ళ భరణి, జీవా, జోగిబ్రదర్, అనంత్,బస్టాప్ కోటేశ్వరరావు, డాక్టర్ ప్రసాద్, మాధవి ప్రసాద్, సునీత మనోహర్, కల్పన రెడ్డి , జేజస్విని, రేణుక, బాలు , మురళి, పవన్, తదితరులు నటించారు

సాంకేతిక నిపుణులు
నిర్మాతలు ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరవు,
కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం : వెంకట్ వందెల,
సినిమాటోగ్రఫీ : పి, వంశీ ప్రకాష్, సంగీతం : సందీప్ కుమార్,
స్క్రీన్ ప్లే పాటలు: డాక్టర్ భవ్య దీప్తి రెడ్డి,
ఎడిటర్ : నందమూరి హరి, ఎన్టీఆర్,
ఫైట్స్ ‘ రామకృష్ణ,
కొరియోగ్రాఫర్స్ : గణేష్ స్వామి, నండిపు రమేష్,
చీఫ్ కో డైరెక్టర్ : ఎల్ రామకృష్ణం రాజు,
పి.ఆర్.ఓ : మధు వి ఆర్

Here is the First Look of #NaVentaPaduthunaChinadevadama 🎶 🌾

⭐ ing #TejKurapati, #AkhilaAkarshana

🎬 #VenkatVandela
🎼 #SandeepKumarK
💰 #MulletiKamalakshi #GubbalaVenkateswarrao
🎥 #VamsiPrakash

@VrMadhuPr

#NVPC #RajadhaniArtMovies #GVRFilmMakers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *