September 7, 2024

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

Purushottamudu Movie Review

రాజ్ తరుణ్ హీరోగా రాజ్ తరుణ్ హీరోగా హాసిని సుధీర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు.దర్శకుడు రామ్ భీమన “పురుషోత్తముడు” సినిమాను రూపొందించారు.

ఎలాంటి అసభ్యత, అశ్లీలత లేకుండా వస్తున్న సినిమాలు చాలా తక్కువ. అలాంటి అరుదైన కథా కథనాలతో ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది పురుషోత్తముడు సినిమా. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా ఈ రోజు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చింది. పురుషోత్తముడు సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే
పీఆర్ కంపెనీకి సారథిగా వ్యవహరిస్తుంటారు రఘురామ్ (మురళీశర్మ). ఆయన కొడుకు రచిత్ రామ్ (రాజ్ తరుణ్). ఈ కంపెనీకి ఇద్దరు వారసులు అయితే లండన్ లో చదువుకుని వచ్చిన రఘురామ్ కొడుకు రచిత్ రామ్ ను సీయివో చేసేందుకు ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఈ విషయంలో విబేధిస్తుంది రఘురామ్ వదిన వసుంధర (రమ్యకృష్ణ). తన కొడుకు అభయ్ రామ్ ను సీయీవో ఎందుకు చేయకూడదని ప్రశ్నిస్తుంది. అయితే పీఆర్ కంపెనీ వ్యవస్థాపకులు పరశురామయ్య పెట్టిన కండీషన్ ప్రకారం వంద రోజులు ఈ గుర్తింపూ లేకుండా స్వతహాగా మధ్యతరగతి వాడిలా బతికితేనే సీయీవో పదవికి అర్హులు. అలాంటి కండీషన్ ప్రకారం రచిత్ రామ్ రాజమండ్రి దగ్గర‌లోని కడియపులంక అనే గ్రామానికి చేరుతాడు. ఆ గ్రామంలో పూల‌తోట‌లు నడుపుతున్న అమ్ములు (హాసిని సుధీర్) దగ్గర పనిలో చేరతాడు. మరి వంద రోజుల కండీషన్ ను రచిత్ రామ్ పూర్తి చేశాడా లేదా అమ్ములుతో తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అనేది తెరపై చూడాల్సిన మిగిలిన కథ.

ఎలా ఉందంటే
రామ్ పాత్రలో నటించిన రాజ్ తరుణ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. గ్లామ‌ర్ ఆండ్ యాక్టింగ్‌లో గ‌తం కంటే కాస్త ఇంఫ్రూవ్ అయ్యాడు. అమ్ములు పాత్రలో నటించిన హీరోయిన్ హాసిని సుధీర్ తెలుగుదనం ఉట్టిపడే అమ్మాయిగా తన పాత్రలో ఒదిగిపోవడమే కాకుండా తనకిచ్చిన రోల్ పర్పెక్ట్ గా చేసింది. రాజ్ తరుణ్ కు జోడీగా ఆమె బాగా కుదిరింది. సీనియ‌ర్ న‌టి రమ్యకృష్ణ త‌న పాత్ర‌కు నిండుత‌నం తెచ్చారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, విరాన్ ముత్తంశెట్టి, ముకేష్ ఖన్నా, ప్రవీణ్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, సత్య తదితరులందరూ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పచ్చు. దర్శకుడు రామ్ భీమన గతంలో ఆకతాయి, హమ్ తుమ్ వంటి రెండు సినిమాలు చేశాక ఆరేళ్ల గ్యాప్ తర్వాత తీసిన “పురుషోత్తముడు” సినిమాను క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందించాడు. ఒక కోటీశ్వరుడైన అబ్బాయి పల్లెటూరికి ఎందుకు వచ్చాడు అక్కడ ఏం చేశాడు అనేటటువంటి కథతో ఇంతకుముందు తెలుగులో వచ్చినా కూడా ఈ సినిమా క‌థ‌ను తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు.ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాని ఒక కొత్త పాయింట్ ను టచ్ చేసి ద‌ర్శ‌కుడుగా రామ్ భీమన సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు.ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, ముఖేష్ ఖన్నా, మురళీ శర్మ లాంటి పెద్ద ఆర్టిస్టులందరూ తమ నటనతో కథకు బలాన్ని తీసుకొచ్చారని చెప్పవచ్చు.
గోపీసుందర్ మ్యూజిక్, పాటలు బాగున్నాయి. పీజీ విందా సినిమాటోగ్రఫీ ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది. చంద్రబోస్, చైతన్య ప్రసాద్, రామజోగయ్య శాస్త్రి వంటి వారి సాహిత్యం మా సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇందులో చాలా మందికి స్ఫూర్తిగా నిలిచే సీన్లు, మాట‌లు ఉన్నాయి. మార్తాండ్ కె వెంకటేష్, ఎడిటింగ్ పనితీరు బాగుంది .శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాతలు డా. రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ లు సినిమా నిర్మించడం అంటే ఏదో డబ్బులు ఖర్చు పెట్టేయడం కాకుండా కథా కథనాలు, ఆర్టిస్టులను, టెక్నీషియన్స్ ను సెలెక్ట్ చేసుకొని ఖర్చుకు వెనుకడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ఇది. ఈ సినిమాను కుటుంబంతో కలిసి హాయిగా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు

రేటింగ్ 3 /5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

reklam ajansı profesyonel logo tasarım web tasarım kurumsal web tasarım web ajansı web tasarım şirketleri web tasarım firması web yazılım firmaları en iyi web tasarım şirketleri advertising agency professional logo design web design corporate web design web agency web design companies web design firm web software companies best web design companies