Samantha unveils the second song from Anand Deverakonda’s ‘Pushpaka Vimanam
1 min read
ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “పుష్పక విమానం”. గీత్ సైని నాయికగా నటిస్తోంది. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు. ‘కింగ్ అఫ్ ది హిల్’ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కి గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న “పుష్పక విమానం” చిత్రంలోని ఒక్కో పాట శ్రోతల ముందుకొస్తూ ఈ సినిమా మ్యూజికల్ హిట్ అని తేల్చేస్తున్నాయి. ఇప్పటికే ‘సిలకా..’ అనే పాట రిలీజ్ అయి మంచి హిట్ కాగా…తాజాగా ‘కళ్యాణం..’ లిరికల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేశారు.
ఇవాళ (శుక్రవారం) ఉదయం 11 గంటలకు ‘కళ్యాణం..’ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు సమంత. ‘కళ్యాణం..’ లిరికల్ సాంగ్ తనకు బాగా నచ్చిందని చెప్పిన సమంత….హీరో ఆనంద్ దేవరకొండ, నిర్మాత విజయ్ దేవరకొండ సహా “పుష్పక విమానం” ఎంటైర్ టీమ్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.
సినిమాలో కళ్యాణం పాట హీరో హీరోయిన్ల పెళ్లి సందర్భంలో వస్తుంది. సుందర్, మీనాక్షి పెళ్లి వేడుక చూసేందుకు అతిథులంతా ఆనందంగా ఎదురుచూస్తుంటారు. వాళ్ల పెళ్లి కార్యక్రమాలు మంగళ స్నానాలతో మొదలవుతాయి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అందంగా ముస్తాభయి మండపంలోకి వస్తారు. ఇద్దరి మొహాల్లో తెలియని బిడియం, సిగ్గు ఉట్టిపడుతుండగా..అమ్మలాలో పైడి కొమ్మలాలో… ముద్దుల గుమ్మలాలో సందళ్లు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలాలో.. మోగేటి సన్నాయి మోతల్లలో సాగేటి సంబరాలో…అంటూ కళ్యాణం పాట ప్రారంభమవుతుంది. కళ్యాణం కమనీయం, ఒకటయ్యే వేళనా వైభోగం, కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం..అంటూ సాగుతుంది. చరణంలో పెళ్లిని అంకెలతో పోల్చూతూ అద్భుతంగా రాశారు గీత రచయిత కాసర్ల శ్యాం. ఏడడుగులేయగా ఈ అగ్ని మీకు సాక్షిగా ఏడు జన్మలా బంధంగా…ఎనిమిది గడపదాటి ఆనందాలు చూడగా..మీ అనుబంధమే బలపడగా..ఇక తొమ్మిది నిండితే నెల..నెమ్మ నెమ్మదిగా తీరెే కల..పది అంకెల్లో సంసారమిలా, పదిలంగా సాగేటి అల.. అని సాగే చరణంలో ఆదర్శ వైవాహిక జీవితాన్ని చూపించారు. ఇక ఈ పాటను మంగ్లీ, సిధ్ శ్రీరామ్ మళ్లీ మళ్లీ వినేలా పాడారు. తన మ్యూజిక్ టాలెంట్ తో కళ్యాణం పాటను మరో హిట్ నెంబర్ చేశారు సంగీత దర్శకుడు రామ్ మిరియాల. ఈ పాటకు అకేషన్ కు తగినట్లు సింపుల్ అండ్ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ చేశారు రఘు మాస్టర్. అలాగే నీల్ సెబాస్టియన్ వేసిన పెళ్లి మండపం సెట్ ఎంతో అందంగా ఉండి ఆకట్టుకుంటోంది.
“పుష్పక విమానం” సినిమాలో ఇలాంటి అందమైన పాటలతో పాటు ఆసక్తికర సన్నివేశాలు త్వరలో వెండితెరపై చూపించబోతున్నారు. ఆనంద్ దేవరకొండ , గీత్ సైని, శాన్వి మేఘన, సునీల్, నరేష్, హర్షవర్థన్, గిరిధర్, కిరీటి, భద్రం, వైవా హర్ష, అభిజిత్, అజయ్, సుదర్శన్, శరణ్య, మీనా వాసు, షేకింగ్ శేషు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ : విజయ్ దేవరకొండ, పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా, సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్, ఎడిటర్ : రవితేజ గిరిజాల, మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని,
నేపథ్య సంగీతం : మార్క్ కె.రాబిన్,
కాస్టూమ్స్ : భరత్ గాంధీ, నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి, రచన-దర్శకత్వం: దామోదర.
Tollywood’s happening actress Samantha has unveiled the second lyrical video from the movie ‘Pushpaka Vimanam.’ Starring Anand Deverakonda and Geeth Saini in the lead roles, the song ‘Kalyanam’ is a wedding track and Ram Miryala is the music composer of the film.
The songs has rich visuals of wedding ceremony. Hero Anand and heroine Geeth as bridegroom and bride flaunt the typical Hindu traditional attire. The family bondings and wedding vibe making the song look colourful with lavish visuals.
Sensational singer Sid Sriram has crooned the song while Mangli, Mohana Bhogaraju, Divya Mallika and Harika provided the backend vocals. Kasarla Shyam has penned the lyrics.
‘Pushpaka Vimanam’ is written and directed by Damodara while Govardhana Rao Deverakonda, Vijay Mattapally, Pradeep Errabelly are producing the movie under King of the Hills and Tanga Productions banners.
It’s a presentation of Vijay Deverakonda.
Cast: Anand Deverakonda, Geeth Saini, Saanve Megghana, Sunil, Naresh, Harsha Vardhan & Others
Writer & Direction: Damodara
Presented by Vijay Deverakonda
Producers: Govardhana Rao Deverakonda, Vijay Mattapally, Pradeep Errabelly
Executive Producer: Anurag Parvathaneni
Music: Ram Miriyala
Editor: Raviteja Girijala
Cinematography: Hestin Jose Joseph
Art Director: Neil Sebastian
Publicity Designers: Anil & Bhanu
PRO: GSK media