మార్చి 5న ఏ1 ఎక్స్‌ప్రెస్
1 min read
టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటిస్తోన్న 25వ చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. టాలీవుడ్‌లో రూపొందుతోన్న తొలి హాకీ ఫిల్మ్‌గా గుర్తింపు పొందిన ఈ న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్ హీరో సందీప్ కిషన్‌కి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మిస్తున్నారు.
‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ మార్చి 5న విడుదలవుతుందని ఎనౌన్స్ చేస్తూ చిత్ర బృందం సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ రొమాంటిక్ పోస్టర్‌లో హీరోయిన్ లావణ్యా త్రిపాఠిని వీపుమీద ఎత్తుకొని ఉన్నాడు హీరో సందీప్ కిషన్. ఇద్దరూ హాయిగా నవ్వులు చిందిస్తున్నారు. వారి మధ్య కెమిస్ట్రీ అమేజింగ్ అనిపిస్తోంది.
ఇటీవల రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది. సందీప్ కిషన్ కెరీర్‌లో అత్యధికంగా 8.5 మిలియన్ వ్యూస్ పొందిన ట్రైలర్‌గా ఇది నిలిచింది. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందించిన పాటలు ఇప్పటికే సంగీత ప్రియులను అమితంగా అలరిస్తున్నాయి.
ఈ సినిమా షూటింగ్‌లో తన హాకీ స్కిల్స్‌తో సందీప్ కిషన్ అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. తన క్యారెక్టర్ కోసం బరువు తగ్గి సిక్స్ ప్యాక్ బాడీని సాధించారు. కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ ఈ ఫిల్మ్‌కు మంచి ఎలివేషన్ తీసుకొచ్చింది.
తారాగణం:
సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠి, రావు రమేష్, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి, ప్రియదర్శి, సత్యా, రాహుల్ రామకృష్ణ, మహేష్ విట్టా, రఘుబాబు, అభిజిత్, భూపాల్, ఖయ్యుమ్, సుదర్శన్, శ్రీరంజని, దయా గురుస్వామి
సాంకేతిక బృందం:
దర్శకుడు: డెన్నిస్ జీవన్ కనుకొలను
నిర్మాతలు: టి.జి. విశ్వప్రసాద్, అభిషెక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
మ్యూజిక్: హిప్ హాప్ తమిళ
సినిమాటోగ్రఫీ: కెవిన్ రాజ్
ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, సామ్రాట్
ఆర్ట్: అలీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: మయాంక్ సింఘానియా, దివ్య విజయ్, శివ చెర్రీ, సీతారామ్,