December 5, 2023

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో హీరోయిన్ మీనా


రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ , బిగ్ బాస్ షో 4 ఫేం దేవి నాగవల్లి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు చెన్నై సైదాపెట్ లోని తన నివాసంలో మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ మీనా.  ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ మారుతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి మనం అందరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేశారు. ఈ చాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని. ఈ సందర్భంగా ప్రముఖ హీరో వెంకటేష్, ప్రముఖ కన్నడ హీరో సుదీప్, మళయాళం హీరోయిన్ మంజు వారియర్, హీరోయిన్ కీర్తి సురేష్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *