February 22, 2024

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

సోలో బ్రతుకే సో బెటరు మూవీ రివ్యూ


దర్శకత్వం : సుబ్బు
నిర్మాత : బోగవల్ల ప్రసాద్
సమర్పణ : భోగవల్లి బాపినీడు
సంగీతం ; థమన్
సినిమాటోగ్రఫర్ : వెంకట్ సి దిలీప్
ఎడిట‌ర్‌ : నవీన్ నూలి
నటీనటులు : సాయి తేజ్, నభా నటేష్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, సత్య తదితరులు ..
విడుదల : 25 డిసెంబర్ 2020
రేటింగ్ : 3/5

కరోనా జాగ్రత్తలతో యాభై శాతం ఆక్యుపెన్సీ తో సినిమా హాల్స్ ఓపెన్ అయ్యాయి. మళ్ళీ సినిమా లవర్స్ సందడి మొదలైంది. దానికి ముఖ్య కారణం .. సోలో బ్రతుకు సో బెటర్ సినిమా. సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల అవ్వడంతో ఇన్నాళ్లు మూసి ఉంచిన థియటర్స్ ఆల్మోస్ట్ అన్ని తెరుచుకున్నాయి. ఈ లాక్ డౌన్ తరువాత మొదటి సినిమాగా వచ్చిన సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఎలా ఉందొ ఓ లుక్కేద్దామా …

అసలు కథ :

జీవితంలో పెళ్లి అనేది అనవసరం. మనం చేసే ప్రతి పనికి పెళ్ళాం అడ్డొస్తుంది. మన స్వేచ్ఛ ను పెళ్లితో కోల్పోతాము అన్న మాటలు మనం ఇదివరకే చాలా వినే ఉంటాము … అసలు పెళ్లి ఎందుకురా అన్న సందర్భాలు ఉంటాయి. అలాగే మన సినిమాలో హీరో కూడా  జీవితంలో ప్రేమ,పెళ్లి వద్దంటూ సోలో లైఫ్ సో బెటర్ అంటూ జీవిస్తుంటాడు విరాట్ ( సాయి తేజ్ ) దానికి ముఖ్య కారణం తన మావయ్య ( రావు రమేష్ ) పెళ్లి చేసుకుంటే ఎన్ని బాధలు ఉంటాయో చెప్పడం, రోజు అయన జీవితంలో చుసిన సన్నివేశాలతో ఫిక్స్ అవుతాడు. విరాట్ సోలో బ్రతుకు సో బెటర్ అని తాను నమ్మడమే కాదు .. తన కాలేజ్ లో కూడా దీన్ని ఓ ఉద్యమంలా మారుస్తాడు. ఈ ఉద్యమానికి ఫౌండర్ గా నిలబడ్డ విరాట్ .. చదువు అయిపోవడంతో వైజాగ్ నుండి హైద్రాబాద్ కు జాబ్ నిమిత్తం వస్తాడు. తన మిత్రులతో కలిసి. అందరు కలిసి ఒకే రూములో ఉంటుండగా .. సోలో బ్రతుకే సో బెటర్ అని బలంగా నమ్మి విరాట్ వెనకున్న ఫ్రెండ్స్ కూడా పెళ్లి పేరుతొ ఒక్కొక్కరు దూరం అవుతారు. ఆ తరువాత కొన్ని పరిస్థితుల కారణంగా విరాట్ లో మార్పు వస్తుంది ? అసలు ఆ మార్పేమిటి ? చివరిదాకా విరాట్ పెళ్లి చేసుకున్నాడా ? లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే !!

హైలెట్స్ :

@ సాయి తేజ్ నటన బాగుంది, అన్ని రకాల ఎమోషన్స్ ని బాగా పండించాడు. అయితే ఇందులో గొప్పగా నటించాల్సిన అంశాలు ఏవి లేవు అంతా కూల్.

@ రావు రమేష్ .. నటన గురించి ఇవాళ కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని రకాల ఎమోషన్స్ బాగా పండించారు. ముక్యంగా ఎమోషనల్ సీన్స్ లో అదరగొట్టారు.

@ ఈ సినిమా విషయంలో ముక్యంగా చెప్పుకోవలసింది ఫోటోగ్రఫి గురించి. వెంకట్ సి దిలీప్ చక్కని కెమెరా వర్క్ కనబరిచాడు.

@ మరో ప్రధాన హైలెట్ మ్యూజిక్. థమన్ అందించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే మంచి హిట్స్ గా నిలిచాయి .. దానికి తోడు థమన్ రి రికార్డింగ్ కూడా బాగుంది.

@ నిర్మాణ విలువలు సూపర్.

@ ఎడిటింగ్ కూడా బాగుంది ..

మైనస్ అంశాలు :

@ హీరోయిన్ నాభ నటేష్ పాత్ర కూడా ఎక్కడ గొప్పగా అనిపించదు. పైగా నాభ నటేష్ విషయంలో దర్శకుడు ఎక్కువ ఫోకస్ పెట్టకపోవడం జరిగింది. ఆమె ఉన్నంతలో బాగానే చేసింది. ఇక హీరోకి మావయ్య పాత్రలో నటించిన
@ రాజేంద్ర ప్రసాద్ పాత్ర కు అంత ప్రాధాన్యత లేదు.

@ కమెడియన్స్ విషయంలో కూడా మైనస్ .. పడి పడి నవ్వించే సన్నివేశాలు ఏమి లేవు. కాకపోతే వెన్నెల కిషోర్ మాత్రం కాస్త నవ్వించే ప్రయత్నం చేసాడు.

@ దర్శకుడు సుబ్బు కొత్త తరహా కథను ఎంచుకున్నప్పటికీ దాన్ని తెరమీద పెట్టె క్రమంలో కాస్త తడబడ్డాడు. బలమైన పాయింట్ లేకపోవడం. మొదటి భాగాన్ని బాగా నడిపించిన దర్శకుడు రెండో భాగంలో కథను సాగదీసాడు.

@ కథనం కూడా చాలా స్లోగా సాగుతుంది. హీరోపై ఫోకస్ పెట్టిన దర్శకుడు కథపై ఇంకాస్త ఫోకస్ పెట్టి ఉంటె బాగుండేది.

విశ్లేషణ :

ఓ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఆ మార్గం నుండి అతన్ని మరల్చే సంఘటన, లేదా కారణం బలంగా ఉండాల్సింది.. కానీ అలా కాకుండా ఎదో అలా సో సో గా చెప్పే కారణం ప్రేక్షకులకు రుచించదు. పూర్తీ స్థాయి ఎంటర్ టైనర్ గా సాగిన ఈ కథలో పెద్ద ట్విస్ట్ ఏవి ఉహించలేం. కాకపోతే అలాగే అక్కడక్కడా చోటు చేసుకునే చిన్న చిన్న ట్విస్టులు డీసెంట్ గా అనిపిస్తాయి. అసలు కథను పక్కన పెట్టాయడం జీర్ణించుకొని అంశం. సినిమా నిడివి తక్కువే అయినప్పటికీ సెకండాఫ్ లో కూడా కొన్ని సీన్స్ స్లోగా ఆసక్తిని పోగొడతాయి, దానికి మరో కారణం సినిమా రొటీన్ గానే అనిపిస్తుంది అని భావన కలగడం. ఈ విషయంలో జాగత్త వహించి ఉండాల్సింది. పైగా హీరోయిన్ రోల్ ను డిజైన్ చేసిన విధానం, ఆ పాత్రను ఎస్టాబ్లిష్ చెయ్యడంలో కూడా అసంపూర్ణంగా అనిపిస్తుంది. అలాగే మెయిన్ లీడ్ మధ్య మరిన్ని సీన్స్ అంటే రొమాంటిక్, కెమిస్ట్రీ తరహా సీన్స్ ను యాడ్ చేసి ఉంటే మరింత ఇంపుగా అనిపించి ఉండేది. సినిమాకు ఎంతో కీలకమైన క్లైమాక్స్ లో పస లేదు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వచ్చిన ఈ “సోలో బ్రతుకే సో బెటర్” ఫస్ట్ హాఫ్ లో అన్ని రకాల ఎలిమెంట్స్ తో నడిచినప్పటికీ సెకండాఫ్ లో కంటెంట్ డ్రాప్ అవ్వడం అలాగే క్లైమాక్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. మొత్తానికి సోలో బ్రతుకే సో బెటరు .. సో సో గా సాగుతుంది !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *