March 28, 2024

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

Sridevi Soda Center Story is Real Story : Director Karan Kumar

నిజ జీవిత సంఘటనల సమాహారం ‘శ్రీదేవి సోడా సెంటర్’ డైరెక్టర్‌ కరుణ కుమార్‌.

 ‘‘పలాస 1978’’తో  అటు ప్రేక్షకులలోను ఇటు ఇండస్ట్రీ లోను క్రేజీ డైరెక్టర్‌ గా మంచిపేరు సంపాదించుకొని, సినీ విమర్శకుల ప్రశంసలు సైతం పొందారు దర్శకుడు కరుణకుమార్‌. తను చేస్తున్న రెండవ సినిమాకే సెలెక్టెడ్‌ కథలను ఎంచుకుని తీసే 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్‌  లాంటి పెద్ద బ్యానర్‌లో లీడిరగ్‌ ఆర్టిస్ట్‌ హీరో సుధీర్‌ బాబుతో  చేస్తున్న సినిమా ‘‘శ్రీదేవి సోడా సెంటర్‌’’. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి లు నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సీనియర్‌ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, బ్రిడ్జ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ అధినేత లక్ష్మణ్‌ సహకారంతో ఈ నెల 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో  చిత్ర దర్శకుడు కరుణ కుమార్‌ మాట్లాడుతూ..
నేను కథలు చెప్పాలని ఇండస్ట్రీ కు వచ్చాను. ప్రస్తుతం మనం కథలు చెప్పడం మానేసి టెంప్లేట్‌ సినిమాలు చేస్తున్నాము. పరభాషా చిత్రాలు చూసి తమిళ్‌ లో, మలయాళంలో మంచి సినిమాలు వచ్చాయని మాట్లాడు కుంటున్నాము. సినిమా గ్లోబల్‌ అయిన తర్వాత ఇంటర్నెట్‌ విస్తృతి వేగంగా పెరిగిన తరువాత తెలుగులో ఇలాంటి సినిమాలు ఎందుకు రావడం లేదనే క్వశ్చన్‌ మొదలయ్యింది. ఎంతసేపు మనం పరభాషా చిత్రాలను అప్రిషియేట్‌ చేస్తున్నాము కానీ మనం తీయడం లేదు. శంకరాభరణం, సిరివెన్నెల, జ్యోతి, విజేత, చాలెంజ్‌ లాంటి లిటరేచర్‌ బేస్డ్‌ సినిమాలు అలాగే లిటరరీ పీపుల్స్‌ ని ఇన్వాల్వ్‌ చేసినన్ని సినిమాలు తెలుగులో వచ్చినంతగా ఏ భాషలో రాలేదు.
ప్రపంచాన్ని షేక్‌ చేసిన బాహుబలి, అరుంధతి చిత్రాలు కూడా తెలుగులోనే ఇచ్చాము.
తెలుగు నిర్మాతలు ఎప్పుడూ కొత్త కథ చెప్తే వినడానికి సిద్ధంగా ఉంటారు. ఒక బర్నింగ్‌ ఇష్యు ని తీసుకొని సినిమాటిక్‌గా చెప్పుదామని ‘‘పలాస’’ సినిమా చేశాను. ఈ సినిమాలో కూడా బలమైన సమస్యనే చర్చించాము. దీనికి నాకు బలమైన నిర్మాతలు దొరికారు. ‘‘పలాస’’ సినిమాలో డ్రైనెస్‌ ఉంటుంది. ఆ సినిమాని రా గా, రస్టిక్‌ గానే చెప్పాలనుకున్నాను కాబట్టి ఆ సినిమాను అలాగే చూపించాము. ఈ సినిమా పూర్తి విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ కాబట్టి నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పక్కన ఉన్న గ్రామాలు ఇప్పటివరకు మనం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల అంటే అరిటాకులు, అరిసెలు, బొబ్బట్లు, అమ్మమ్మ ల ఆప్యాయతలు, పొలం గట్లు, మంచి మనసులు తూర్పుగోదావరి అంటే ఇవే ఫిక్స్‌ అయిపోయాము.
తూర్పుగోదావరి జిల్లా చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే కమ్యూనిటీస్‌ వాళ్ల మధ్య ఉండే భావోద్వేగాల మధ్య కథ నడుస్తుంటే ఆ కథలో భాగంగా ఈ ప్రేమ కథ ఉంటుంది. కానీ తూర్పు గోదావరి వారిలో కూడా అన్ని రకాలైన ఎమోషన్స్‌ , భావోద్వేగాలు, వివక్ష, రాజకీయాలు, ఘోరమైన ఇన్సిడెంట్స్‌ కూడా ఉంటాయని ఈ సినిమాలో చూపెట్టడం జరిగింది. మేము ఎంచుకున్న లొకేషన్స్‌ శ్యామ్‌ దత్‌ గారి లాంటి అద్భుతమైన కెమెరామెన్‌ తో మేము సక్సెస్‌ అయ్యాను అని అనుకుంటున్నాను. సినిమాను చాలా అందంగా తెరకెక్కించాడు
 ఒక సోడా సెంటర్‌ యజమాని కూతురు హీరోయిన్‌. గ్రామాల్లో అల్లరి చిల్లరిగా కనిపించే తెలివైన సాధారణమైన ఒక ఎలక్ట్రీషియన్‌ హీరో. ఆ అబ్బాయి కూడా ఒక మంచి వ్యాపారం పెట్టుకొని పెద్ద స్థాయికి వెళ్లి ఆ వ్యాపారానికి వాళ్ళ అమ్మ పేరు పెట్టుకొవాలనే డ్రీమ్‌ ఉంటుంది. అలా ఉన్న  వీరి మద్యన చిగురించిన  ప్రేమే ఈ శ్రీదేవి సోడా సెంటర్‌. ఆ తర్వాత ప్రేమ తాలూకు పర్యవసనాలు దాని వెనుక ఉండే సాంఘిక, సామాజిక, ఆర్థిక పరమైన ఇబ్బందుల మధ్య వాళ్ళు ఏమయ్యారు అనేది ఈ సినిమా కథ.
సుధీర్‌ బాబు చాలా డెడికేటెడ్‌ యాక్టర్‌ ఆయన ఇప్పటి వరకు 12 సినిమాలు చేశాడు. ప్రతి సినిమాకు ఒక వైవిధ్యంతో కొత్త ప్రయత్నం చేయడానికి తపిస్తాడు. పలాస సినిమా చూసి సినిమా బాగుందని నన్ను ఆఫ్రిసియేట్‌ చేసి మీ నెక్స్ట్‌ ప్రాజెక్ట్స్‌ గురించి అడిగాడు. అయితే  నాదగ్గరున్న వాటిలో రెండు కథలు చెప్పాను. వాటిలో ఒకటి శ్రీదేవి సోడా సెంటర్‌. ఈ కథ నచ్చి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు.
కొంతమంది దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్స్‌ తీసుకొని, అక్కడి భాష, బాడీ లాంగ్వేజస్‌ అలాగే ఎలక్ట్రిషన్‌లో కూడా కొన్ని మెళుకువలు నేర్చుకొని ఆయన నటించడం జరిగింది. ఈ సినిమాలో ఒక రోప్‌ కూడా వాడకుండా ఫైట్స్‌ ,అన్ని కూడాచాలా రిస్కీ గా తీసుకొని వర్క్‌ చేశాడు.మేమంతా ఈ విధంగా కష్టపడ్డాము కాబట్టి  సినిమా అద్భుతంగా వచ్చింది.
నేను తీసే ప్రతి సినిమా కి డిఫరెంట్‌ ఉండాలని కోరుకుంటాను. నేను రాసుకున్న కథలన్నీ కూడా కథే హీరో. నన్ను, నా కథను నమ్మిన వారితోనే నేను సినిమాలు చేస్తాను. నేను తీసిన పలాసలో మొత్తం తెలుగు వాళ్లే .ఇందులో ఇందులో కూడా 99% తెలుగువారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. ఒక్క విలన్‌ తప్ప  తనకి కరోనా రావడంతో వేరే విలన్‌ ను పెట్టుకోవడం జరిగింది.నా నెక్స్ట్‌ మూవీలో కూడా తెలుగు వారితోనే తీస్తాను.
మణి శర్మ గారి గురించి చెప్పే అంత స్థాయి నాకు లేదు కానీ తను ఒక ఇళయరాజా. మొదటిసారి ఆయన్ను కలిసి కథ చెప్పాను. బ్రేక్‌ టైం లో 10 నిమిషాల్లో  ‘చుక్కల మేళం’ ట్యూన్‌ రెడీ చేసి వినిపించారు. ఈ సినిమా ద్వారా ఆయన మ్యూజిక్ తో కొత్త మణి గారిని చూస్తారు. తను ఈ సినిమాకు అద్భుతమైన పాటలు రెడీ చేసి ఇచ్చారు. ఆయన ఎప్పుడూ బయటకు రారు అలాంటిది ఈ సినిమా షూటింగ్‌ కి ,ఆడియో ఫంక్షన్‌ కు,ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ కు వచ్చాడు దాన్ని నేను గ్రేట్‌ గా భావిస్తాను.
ఈ సినిమా విడుదల తర్వాత ఎవరితో చేస్తుంది అనేది వివరంగా చెబుతాను. నా కథకు ప్రాధాన్యత నిచ్చి నాకు ఫ్రీడమ్‌ ఇచ్చే బ్యానర్‌ లో చేయడానికే నేను ఇష్టపడతాను. నిర్మాత  నాకు పది రూపాయలు అయ్యే ఖర్చును నేను ఎనిమిది రూపాయలకే చేసి పెడతాను. నాకు ఈ  ప్రొడక్షన్‌ హౌస్‌ అంత ఫ్రీడమ్‌ ఇచ్చింది. ప్రజలకు మంచి కథ చెప్పాము అందరికీ మా కథను ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

reklam ajansı profesyonel logo tasarım web tasarım kurumsal web tasarım web ajansı web tasarım şirketleri web tasarım firması web yazılım firmaları en iyi web tasarım şirketleri advertising agency professional logo design web design corporate web design web agency web design companies web design firm web software companies best web design companies