నితిన్ రంగ్ దే కు సూపర్ స్టార్ సపోర్ట్ ?

యంగ్ హీరో నితిన్ మంచి జోరుమీదున్నాడు. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ‘గిమ్మీ సమ్ లవ్’ అనేది ట్యాగ్ లైన్. నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిగ్గజ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ సినిమాకు కెమెరామన్‌గా పనిచేస్తున్నారు. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్ అన్నీ కూడా సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచాయి. అయితే తాజాగా ‘రంగ్ దే’ మూడో పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ నెల 4వ తేదీన సాయంత్రం 4:05 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పాటను సిధ్ శ్రీరామ్ ఆలపించనున్నాడు.