December 9, 2023

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

Tamanna Launches Sky Lab Movie First Look

1 min read
‘స్కైలాబ్‌’ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన మిల్కీబ్యూటీ తమన్నా
స‌త్య‌దేవ్‌, నిత్యామీనన్, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా డా.రవి కిరణ్‌ సమర్పణలో బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ పతాకాలపై విశ్వ‌క్ కందెరావ్‌ దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తోన్న చిత్రం ‘స్కైలాబ్‌’. 1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. ఆదివారం ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను మిల్కీబ్యూటీ తమన్నా విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ గమనిస్తే.. అందులో స్కైలాబ్ పై సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణతో పాటు మరికొందరు కూర్చుని ఉన్నారు. వీరి చుట్టూ డబ్బులు ఎగురుతున్నాయి.
 అమెరికా స్పేస్ స్టేష‌న్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేష‌న్ స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ప్రపంచమంతా అసలేం జరగబోతుందోనని ఊపిరి బిగపట్టి ఎదురుచూడసాగారు. ప్రపంచంలోని అన్నీ న్యూస్‌ చానెల్స్‌, వార్తాపత్రికలు ఈ వార్తను ప్రముఖంగా కవర్‌ చేశాయి. అలాంటి నేపథ్యంలో మన తెలుగు రాష్ట్ర్రంలో బండ లింగపల్లి అనే గ్రామంలో  ఉండే గౌరి, ఆనంద్‌, రామారావుల జీవితాల్లో స్కైలాబ్‌ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను ఎంటర్‌టైనింగ్‌గా చూపిస్తూ ‘స్కైలాబ్‌’ సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను తెలియజేస్తామని చిత్రయూనిట్ తెలియజేసింది.
న‌టీన‌టులు:
నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ, తనికెళ్ల భరణి, తులసి, విష్ణు, అనుష త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు:
మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  విశ్వ‌క్ కందెరావ్‌
నిర్మాత: పృథ్వీ పిన్నమరాజు
సహ నిర్మాత: నిత్యామీనన్‌
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది
ఎడిటర్‌:  రవితేజ గిరిజాల
మ్యూజిక్‌: ప్ర‌శాంత్‌ ఆర్‌.విహారి
ప్రొడక్షన్‌ డిజైన్‌:  శివం రావ్‌
సౌండ్ రికార్డిస్ట్‌‌:  నాగార్జున త‌ల్ల‌ప‌ల్లి
సౌండ్‌ డిజైన్‌: ధ‌నుష్ న‌య‌నార్‌
కాస్ట్యూమ్స్‌: పూజిత తడికొండ
పి.ఆర్‌.ఒ:  వంశీ కాక
&&&&&&&
Milky Beauty Tamannaah unveils First Look, Title of ‘Skylab’
‘Skylab’ is an upcoming movie starring Satyadev, Nithya Menen and Rahul Ramakrishna in lead roles. Produced by Bright Futures and Nithya Menen Company, it’s presented by Dr Ravi Kiran and directed by Prudhvi Pinnamaraju. A period drama, its story is set in 1979.
Milky Beauty Tamannaah Bhatia on Sunday unveiled its First Look and Title, and wished the team all the best. In the poster, we see the lead actors and a few others seated on the Skylab as wads of currency rain around them.
Skylab, the first space station of NASA, was feared to have disintegrated. It was warned that its debris would fall at random on Earth, endangering lives. The media prominently covered the news back then and everyone was anxious with a bated breath. What consequences the developments had in the lives of Gowri, Anand, and Rama Rao from the Banda Lingapally village, is what the entertainer is about.
More details about the movie will be revealed soon.
Cast:
Nithya Menen, Satyadev, Rahul Ramakrishna, Tanikella Bharani, Tulasi, Vishnu, Anusha and others.
Crew:
Dialogues, Screenplay, Direction: Vishvak Khanderao
Producer: Prudhvi Pinnamaraju
Co-Producer: Nithya Menen
Cinematographer: Aditya Javvadi
Editor: Raviteja Girijala
Music: Prashant R Vihari
Production Design: Shivam Rao
Sound Recordist: Nagarjuna Thallapalli
Sound Design: Dhanush Nayanar
Costumes: Pujitha Thadikonda
PRO: Vamsi Kaka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *