April 25, 2024

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

Tuck Jagadish Movie is Pakka commercial Movie : Director Siva Nirvana

కమర్షియల్ గ్రాఫ్ ఉంటూనే.. చాలా ఇన్వాల్వ్మెంట్ ఉండే సినిమా  ‘టక్ జగదీష్` – ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌

‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత  నేచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల  క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న చిత్రం  ‘టక్ జగదీష్`. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.  ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

టక్ జగదీష్ సరదాగా ఉండే కుర్రాడు. అది టైటిల్‌లోనే తెలియాలని అలా టైటిల్ ఫిక్స్ చేశాం. ఆ టక్ వెనకాల ఓ సిన్సియర్ కారణం కూడా ఉంటుంది. ఆ కారణం చూసి సెన్సార్ వాళ్లకు కళ్లలో నీళ్లు తిరిగాయి ఈ సినిమాపై మా ఫీలింగ్ మారింది అని చెప్పారు. రేపు సినిమా చూశాక టక్ జగదీష్‌ను చూసే కోణం మారుతుంది.

నేను చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబంలోనే పెరిగాను. మా ఊరి వాతావరణంలోనే పెరిగాను. తాతగారింట్లో బాబాయిలు, అత్తలు అలా అందరి మధ్య పెరిగాను. నేను చూసిన ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించాలని, ఫ్యామిలీ డ్రామాను తీయాలని అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడే అనుకున్నాను. ఇన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాలు చూసిన తరువాత కూడా శివ నిర్వాణగా నేను చేస్తున్న ఫ్యామిలీ డ్రామా ఎలా ఉంటే బాగుంటుంది..ఇన్ని సినిమాలు వచ్చాక కూడా ఓ ఫ్యామిలీ డ్రామాను తీసి మెప్పించాలంటే ఏదో కొన్ని కొత్త విషయాలు కూడా ఉండాలి. అందుకే నేను చూసిన ఎమోషన్స్‌ను మీకు చూపించాలని అనుకున్నా..

కథ,కథనం అనేవి వేరుగా ఉండవు.. టైటిల్స్‌లో అలా వేస్తాం కానీ కథ రాసుకునేటప్పుడు రెండూ కలిసే ఉంటాయి. ఇది చాలా బలమైన కథ. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, ట్విస్టులు కూడా ఉంటాయి. కమర్షియల్ సినిమాకు ఉండే గ్రాఫ్ ఉంటూనే.. చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది.

ఈ సినిమాలో నాని ఓ సరదా మనిషి. బయటి నుంచి ఏ ప్రాబ్లం అయిన వస్తే ఇరగ్గొడతాడు. అదే ఇంట్లోనే సమస్య వస్తే  దాన్ని ఎలా పరిష్కరించాడు అనేది కథ.

విజిల్స్ పడే సీన్స్ ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద వాళ్లు కూడా థియేటర్లకు రాలేరు. కానీ ఇప్పుడు నానమ్మ, అమ్మమ్మలతో కలిసి ఇరవై ఏళ్ల కుర్రాడు కూడా కలిసి చూస్తాడు. ఇప్పుడు ఓటీటీలో రావడంపై నెగెటివ్ కన్నా పాజిటివ్‌లే చూస్తున్నాను.

నాని గారితో వెంటనే ఓ సినిమా చేయాలని అనుకున్నప్పుడు.. ఆయన ఆఫీస్‌కు రమ్మన్నారు. పది నిమిషాల్లోనే కథ చెప్పాను. ఆ చెప్పడమే ఓ ట్విస్ట్‌తో చెప్పాను. అది బాగా నచ్చింది. వెంటనే ఓకే అన్నారు. కానీ ఆయన నేను లవ్ స్టోరీ చెబుతాను అని అనుకుని.. నాకు ఎలా నో చెప్పాలని నాని అనుకున్నారు. కానీ చెప్పడమే.. భూదేవీపురం, భూకక్షలు అని చెప్పడంతో నాని ఎగ్జైట్ అయ్యారు.

లెక్కలు వేసి ఈ కథను చేయలేదు. ఇది ఇంటెన్స్ కథ. మాస్, ఐటం సాంగులు ఉండవు. ప్రారంభం నుంచి చివరి వరకు కనెక్ట్ అవుతుంటారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు మధ్య ఉండే కథలు కొత్తగా ఏం ఉంటాయి. ఆ సంఘర్షణను ఎంత కొత్తగా చూపిస్తామనేది ఇంపార్టెంట్. ఇందులో కథనం అందరినీ ఆకట్టుకుంటుంది.

నిన్నుకోరి సినిమాలో ఓ సంఘర్షణ ఉంటుంది.. మజిలీలోనూ ఓ కాంప్లెక్సిటీ ఉంటుంది. ఇందులో అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఉండే గొడవలు, అసూయలపై టక్ జగదీష్ ఉంటుంది. ఆ పాత్రల ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి.

నేను హైద్రాబాద్‌కు వచ్చి పద్నాలుగేళ్లు అవుతుంది. కానీవచ్చింది ఊరి నుంచి. ఈ సినిమా చూస్తే మనకు ఇప్పటి జీవితం గుర్తుకు రాదు. మన ఊరు కనిపిస్తుంది. అందరినీ అలా మన ఊర్లోకి తీసుకెళ్తుంది. మన కళ్లు తడుస్తాయి. ఓ మంచి ఫీల్ ఇస్తుంది.

నాని టక్ జగదీష్ పాత్ర సరదా ఉంటూనే.. పవర్.. ఎమోషన్స్ ఉంటుంది. ఇలా మూడు షేడ్స్ ఉంటాయి. జాతర సీన్ అదిరిపోతుంది. గరగ కట్టుకోవడం అనేది చాలా ఊర్ల‌లో జాత‌ర‌లో చూస్తుంటాం. మా ఊరి జాతరలో కూడా ఉంటుంది.

గోపీ సుందర్ గారితో నేపథ్య సంగీతం చేయిస్తున్నప్పుడు ఓ చిన్న బిట్ సాంగ్ ఉండాలని అనిపించింది. టక్ జగదీష్ పాత్ర గురించి ఇంట్రో సాంగ్ ఉంటే బాగుంటుందని అన్నారు. నేను టీచర్‌గా పని చేశాను. అదే స్లాంగ్‌లో పాట పాడి వినిపిస్తే.. నాని బాగున్నారు. తీసేద్దామని నేను అంటే.. ఉంచేయ్  బాగుంది క‌దా అని నాని అన్నారు. సాధార‌ణంగా నేను పాడను కానీ సందర్భం వచ్చింది.

నిన్ను కోరి సమయంలోనూ ఇలానే జరిగింది. నాలుగు పదాలు నాకు తడితే అలా రాసేస్తాను. పూర్తి సాంగ్ నేను రాయలేను.. అది లిరిక్ రైటర్స్‌కే వదిలేస్తాను. ఏడెత్తు మల్లెలు సమయంలోనూ అంతే. భాస్కర భట్ల రాలేకపోవడంతో.. ఆ ట్యూన్‌లో ఇంకొన్ని పదాలు పడితే బాగుండు అనిపించింది. అందుకే రాశాను.

దర్శకులందరూ కూడా ఎమోషన్స్ బాగా చూపిస్తారు. శుభ సంకల్పం సినిమా చూసి ఓ ట్రాన్స్‌లోకి వెళ్లిపోయాను. అందుకే నేను కూడా ఏదైనా తీస్తే అందరూ ఎమోషన్ ఫీల్ అయ్యేలా ఉండాలని అనుకున్నాను. కానీ నాక్కూడా పడి పడి నవ్వుకునే సినిమా తీయాలని ఉంది. కథ ఏది కోరితే ఆ ఎమోషన్ ఇవ్వాల్సిందే.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గోపీ సుందర్ గారు చేస్తే బాగుంటుందని ఆయనతో చేయించాను. మజిలీ సినిమాకు పాటలు గోపీ సుందర్ చేస్తే.. బ్యాక్ గ్రౌండ్ తమన్ చేశారు. టక్ జగదీష్‌కు లైట్ హార్టడ్ మ్యూజిక్ కావాలి.. అలాంటి సీన్లే ఎక్కువున్నాయి. గోపీ గారి మ్యూజిక్ లైట్‌గా ఉన్నా.. ఇంపాక్ట్ ఎక్కువుంటుంది. అందుకే అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం.

సినిమాలో ఏముందో ట్రైలర్‌లో కూడా అదే చెబుతాను. అలా చెప్పేందుకు నేను ఎప్పుడూ భయపడను. ఉన్న నాలుగు జోకులు ట్రైలర్‌లో కట్ చేసి, ఉన్న నాలుగు యాక్షన్ షాట్స్ పెట్టి.. తీరా సినిమా చూస్తే ఏంటి ఇలా ఉందని అనుకుంటారు. సినిమా ప్రారంభమైన ఇరవై నిమిషాల నుంచి చివరి వరకు కనెక్ట్ అవుతుంది. కమర్షియల్ సినిమాల్లో ఇది కొత్తగా ఉంటుంది.

మంచి యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి.. పాటలు, ఫైట్లు కూడా కథలో భాగంగానే వస్తాయి. వెళ్తాయి. మూడు ఫైట్ సీన్స్ ఉన్నాయి.. నాలుగున్నాయని చెప్పడం నాకు నచ్చదు.

ఈ కథ మొత్తం జగపతి బాబు, నానిల మధ్యే ఉంటుంది. ఫ్యామిలీ డ్రామా అనే సరికి ఒకరిని పూర్తిగా విలన్ చేయలేం.. ఒకరిని మంచోడిని చేయలేం.. ప్రతీ మనిషిలో పాజిటివ్, నెగెటివ్ ఉంటుంది. ఒక్క క్షణం బాగా అనిపిస్తుంది.. ఇంకొసారి సొంత తమ్ముడితోనే గొడవలు పడుతుంటారు. అన్ని పాత్రలకు ఒక వీక్ నెస్ ఉంటుంది. వాటిని జగదీష్ ఎలా హ్యాండిల్ చేశాడన్నది బాగుంటుంది.

డిస్ట్రిబ్యూటర్ల మీటింగ్  జరిగినప్పుడు నేను వైజాగ్‌లో ఉన్నాం. నాకు అంతగా తెలియదు. నాని గారికి ఫోన్ చేస్తే.. నేను ఇప్పుడే విన్నాను అని అన్నారు. అంతకంటే ఎక్కువ మాట్లాడుకోలేదు. ఆ వివాదానికి మాకు సంబంధం లేదు.

అమెజాన్ కూడా గ్రామాల్లోకి వెళ్తోంది. ప్రైమ్‌‌లో వేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మా ఊర్లో కూడా ప్రైమ్ కనెక్షన్ ఉన్నాయి. నెగెటివ్ కంటే పాజిటివ్ ఎక్కువ చూస్తున్నాను.

డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు నానిపై అలా కామెంట్లు చేయడంపై సందర్భం వస్తే మాట్లాడుదాం అని అనుకున్నాను. ట్రైలర్ ఈవెంట్లో మీడియా మిత్రుడు అడగడంతో అలా మాట్లాడేశాను. థియేటర్లో సినిమాను చూడటాన్ని నాని ఎంతగా ప్రేమిస్తారో మనందరికీ తెలుసు. అలాంటి నానిని వారు అలా అనడం చూసి కాస్త ఎమోషనల్ అయ్యాను.

టక్ జగదీష్ సెటప్‌లో మళ్లీ కథ రాయను. ఇక నెక్స్ట్ విజయ్ దేవరకొండతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ కథ చేయబోతోన్నాను. మైత్రీ మూవీస్ నిర్మిస్తారు. కథ ఆల్రెడీ చెప్పేశాను. లైగర్ ఎప్పుడు పూర్తయితే అప్పుడు మా సినిమా మొదలవుతుంది.

నా సినిమాలో హీరోయిన్లకు ఓ ఐడెంటిటీ ఉంటుంది. వచ్చారా? ఆడారా? వెళ్లారా? అనేట్టు ఉండదు. ఇందులో గుమ్మ, చంద్ర అనే పాత్రలకు ఓ ఐడెంటిటీ ఉంటుంది. మీ మనసుల్లోకి ఆ కారెక్టర్లు వెళ్తుంటాయి. ఫ్రెష్ నెస్ కోసం డెనియల్ బాలాజీ గారిని తీసుకున్నాం. తిరువీర్ పాత్ర చాలా బాగుంటుంది. షైన్ స్క్రీన్‌తో క‌లిసి ఆల్‌రెడీ ఒక సినిమా చేశాను కాబ‌ట్టి ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఫ్యామిలీ అంతా  క‌లిసి హ్యాపీగా చూసేలా సినిమా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

reklam ajansı profesyonel logo tasarım web tasarım kurumsal web tasarım web ajansı web tasarım şirketleri web tasarım firması web yazılım firmaları en iyi web tasarım şirketleri advertising agency professional logo design web design corporate web design web agency web design companies web design firm web software companies best web design companies