ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతున్న “వీరాంజనేయులు విహారయాత్ర” మూవీ రివ్యూ
1 min readకథ : వీరాంజనేయులు (బ్రహ్మానందం) తన రిటైర్మెంట్ ని తన సొంత ఇల్లు (హ్యాపీ హోమ్) లో జరగాలి అని కోరుకుంటాడు. కానీ రిటైర్మెంట్ కి ముందే మరణిస్తారు. ఆ తర్వాత తన కొడుకు అయిన నాగేశ్వరరావు (వి. కే. నరేష్)
ఆ ఇంటిని అమ్మి తన కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటాడు. అలా గోవా కి రోడ్ ట్రిప్ వెళ్లిన ఫ్యామిలీ కథ వీరాంజనేయులు విహారయాత్ర. ఆ ట్రిప్ లో ఫ్యామిలీలో జరిగిన చిన్న చిన్న మనస్పర్ధలు వల్ల విడిపోతారు? ఇంతకీ తన ఇల్లు అమ్మేడా, లేదా? ఫ్యామిలీ అంతా చివరికి కలిసారా కలవలేదు? తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే?
నాగేశ్వరరావు పాత్రలో నరేష్ గారి నటన అద్భుతం. కనిపించకుండా వాయిస్ తోనే ఎమోషనల్ గా కనెక్ట్ చేసిన బ్రహ్మానందం గారు. చాలాకాలం తర్వాత శ్రీలక్ష్మి గారు నరేష్ గారి తల్లి పాత్రలో చాలా బాగా నటించారు. రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని, హర్షవర్ధన్, రవి మహాదాస్యం క్యారెక్టర్లు బాగున్నాయి.
టెక్నికల్ ఎస్పెక్ట్:
దర్శకుడు అనురాగ్ పాలుట్ల ఎంచుకున్న స్టోరీ ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తుంది. నిర్మాతలు బాపినీడు, బి. సుధీర్ ఈదర చిన్న సినిమ లా కాకుండా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. R H విక్రమ్ అందించడం మ్యూజిక్ మనసుకు హత్తుకునేలా ఉంది. ఎడిటింగ్ స్క్రీన్ ప్లే పనితీరు చాలా బాగుంది.
ప్లస్ పాయింట్స్:
నరేష్, శ్రీలక్ష్మి గారి ఎమోషనల్ క్యారెక్టర్స్, ఆర్టిస్టుల నటన. ఫస్ట్ ఆఫ్. మ్యూజిక్.
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్ లో స్లో పేస్ లో ఉండటం. అక్కడక్కడ కొన్ని లాగ్ సీన్స్.
నటీనటులు : బ్రహ్మానందం, వి. కె. నరేష్, శ్రీ లక్ష్మి, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని, హర్ధ వర్ధన్, రవి మహాదాస్యం మరియు ఇతరులు
టెక్నీషియన్స్ :
దర్శకుడు: అనురాగ్ పాలుట్ల
నిర్మాతలు: బాపినీడు, బి. సుధీర్ ఈదర
సంగీత దర్శకుడు: RH విక్రమ్
సినిమాటోగ్రాఫర్: అంకుర్. సి
ఎడిటర్స్: నరేష్ అడుప, హరి శంకర్ TN
రేటింగ్ : 3/5