Vijay Deverakonda crossed 10 Million Followers on Facebook

ఫేస్ బుక్ లో కోటీ మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ
రౌడీ బాయ్ గా, యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ
మరొక మైల్ స్టోన్ ను అధిగమించాడు. సోషల్ మీడియా లో విజయ్ కి ఉన్న క్రేజ్
అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఇన్ స్టా గ్రామ్ లో 1 కోటీ 25 లక్షల మంది
ఫాలోవర్స్ పైగా సొంతం చేసుకుని సౌత్ ఇండియాలోనే నంబర్ 1 హీరోగా రికార్డు
సృష్టించిన విజయ్ ఇప్పుడు ఫేస్ బుక్ లో కూడా కోటీ మంది ఫాలోవర్స్ ను
సంపాదించుకోవటం విశేషం.
విజయ్ దేవరకొండ 10 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకోవడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ‘‘లైగర్’’
మూవీ లో నటిస్తున్న విజయ్ త్వరలోనే ఆ షూట్ లో జాయిన్ అవుతాడు