October 1, 2023

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

We Made ’22’ Movie Lavishly With Uncompromising Quality – Hero Rupesh Kumar

2 min read

22 సినిమాని క్వాలిటీలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా లావీష్‌గా సినిమా తీశాం – హీరో రూపేష్ కుమార్

రూపేష్ కుమార్ చౌద‌రి హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న డిఫ‌రెంట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 22. శివకుమార్‌ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై  శ్రీమతి సుశీలా దేవి నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. స‌లోని మిశ్రా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆగ‌స్ట్2 హీరో రూపేష్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా

హీరో రూపేష్ కుమార్ చౌద‌రి మాట్లాడుతూ-  “మాది బిజినెస్‌ ఫ్యామిలీ. చిన్న‌ప్ప‌టినుండి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇండ‌స్ట్రీలోకి రావ‌డం జ‌రిగింది. శివ ఈ క‌థ చెబుతున్న‌ప్పుడే ఎగ్జ‌యిట్ ఫీల‌య్యి ఈ సినిమా చేశాం ఇది ఒక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్. 22 నెంబ‌ర్ అనేది ఈ సినిమాలో మేజ‌ర్ పాయంట్‌.
ఈ సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ `రుద్ర‌` పాత్ర‌లో న‌టించాను. ఆ క్యారెక్ట‌ర్ కోసం న‌న్ను నేను చాలా ట్రాన్స్‌ఫామ్ చేసుకున్నాను. ‘ఖైది నంబర్‌ 150’, ‘బాహుబలి’, ‘సాహో’ వంటి చిత్రాలకు ఫైట్స్‌ కంపోజ్‌ చేసిన జాషువా మాస్టర్ మా సినిమాలో అత్యద్భుతమైన యాక్షన్‌ సీక్వెన్స్‌ కంపోజ్ చేశారు. మా డైరెక్ట‌ర్ శివకి ఇది మొద‌టిసినిమా అయినా త‌న‌కి ద‌ర్శ‌కత్వ శాఖ‌లో అనుభ‌వం ఉండ‌డంతో  ఫుల్ క్లారిటీతో సినిమా తీశారు. మేకింగ్, క్వాలిటీలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా లావీష్‌గా సినిమా తీశాం. స‌లోని మిశ్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెది కూడా మంచి ఇంపార్టెన్స్ ఉన్న సీబిఐ ఆఫిస‌ర్ క్యారెక్ట‌ర్. బాలీవుడ్ న‌టుడు విక్రమ్‌జిత్ విర్క్ ఈ సినిమాలో నెగ‌టివ్ రోల్ లో క‌నిపించ‌నున్నారు. మా సినిమాను థియేట‌ర్స్‌లోనే రిలీజ్ చేయాల‌ని ఇన్ని రోజులు వెయిట్ చేశాం. ప్ర‌స్తుతం క‌రోనా వ్యాప్తి త‌గ్గి థియేట‌ర్స్  రీ ఓపెన్ చేశారు. మొన్న రిలీజైన సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి మా సినిమాని దస‌రా లేదా దీపావ‌ళికి రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ లాక్‌డౌన్‌లో కొన్ని క‌థ‌లు విన్నాను వాటి మీద ఇంకా వ‌ర్క్ చేయాల్సి ఉంది“అన్నారు.

We Made ’22’ Movie Lavishly With Uncompromising Quality – Hero Rupesh Kumar

Rupesh Kumar Choudhary is making his debut as a Hero with Different Action Thriller ’22’. ShivaKumar B. is Directing this film along with providing Story, Screenplay and Dialogues. SMT Susheela Devi is Producing this film under Maa Aai Productions banner. Saloni Mishra is the heroine. Hero Rupesh is celebrating his birthday on August 2nd. On this occasion…

Hero Rupesh Kumar Choudhary said, ” I came from business family. I am very fond of acting since my childhood. My love for acting brought me to industry. I got excited while Shiva narrating the script. This is an action thriller. ’22’ number plays a major point in this film.  I played the role of a powerful police officer ‘Rudra’ in this film. I have completely transformed myself for the character. ‘Khaidi No 150’ ‘Baahubali’ ‘Saaho’ fame Jashua Master has composed terrific action sequences for our film. Though this is the first film for Shiva as a Director, He made ’22’ with full clarity as he has very good experience in Direction department. We made this film in an uncompromising manner in making and quality.  Saloni Mishra is playing as the heroine. She did a very important role as a CBI officer. Bollywood Actor Vikramjeet Virk did a negative role. We wanted to release our film in theatres only.  Now the situation is getting better and theatres are open. Recently released films are also doing good. We are planning to release our film for Dussehra or Diwali. I listened to some scripts during lockdown and I am currently working on them.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *