July 27, 2024

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

O Saathiya Movie Review

రివ్యూ– ఓ సాథియా

కథ–
వైజాగ్‌లో బి.టెక్‌ చదువుకుంటూ హాయిగా టైమ్‌పాస్‌ చేసే అర్జున్‌ (ఆర్యన్‌ గౌరా) కి అనుకోకుండా ఒకరోజు తన కాలేజీలో ప్రిన్సిపల్‌ (శివన్నారాయణ) ముందు తారాసపడుతుంది కీర్తి (మిస్తీ చక్రవర్తి). మొదటి చూపులోనే అర్జున్, అర్జున్‌కి అంటే అస్సలు ఒక్కక్షణం కూడా పడని తన క్లాస్‌మేట్‌ రెండు వర్గాలవారు మొదటిచూపులోనే హీరోయిన్‌ కీర్తి ప్రేమలో పడతారు. కీర్తి నాదంటే నాదంటూ కొట్టుకుంటుంటారు. ఇద్దరితో విసిగిపోయిన హీరోయిన్‌ వీళ్లని ఎలా తప్పించుకుని తిరగాలా అని ఆలోచిస్తుంటుంది. అప్పుడు కీర్తికి అర్జున్‌ ఓ సలహా ఇస్తాడు. వాడు నిన్ను ఏడిపించకుండా ఉండాలంటే మనిద్దరం ప్రేమలో ఉన్నాం అని ఉత్తిగా చెప్పేసేయ్‌. ప్రాబ్లం సాల్వ్‌ అని అనటంతో నిజమే కదా! అనుకుని సరే అంటుంది కీర్తి. అక్కడనుండి మొదలైన వారి ప్రయాణం సరదా, సరదాగా ఉంటూ మంచి ఫ్రెండ్స్‌లా కలిసుంటారు కీర్తి, అర్జున్‌. ఒక మంచిరోజు చూసి కీర్తికి ప్రపోజ్‌ చేద్దాం అనుకుని ఫోన్‌ చేస్తాడు అర్జున్‌. ఫోన్‌ స్విఛాఫ్‌ అని వస్తుంది. హీరోయిన్‌ ఇంటికి వెళతాడు, ఇల్లు తాళం వేసి ఉంటుంది. ఒక్కసారిగా పిచ్చోడిలా కీర్తి కోసం తిరుగుతుంటాడు అర్జున్‌. అలా మిస్‌ అయిన కీర్తి ఎక్కడికి వెళ్లిపోయింది? అసలు ఏం జరిగింది? వీళ్లిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారా? లేదా? సడెన్‌గా కీర్తి ఎందుకు మిస్‌ అయ్యింది? చివరకు అర్జున్‌ ఏ స్థితిలో కీర్తిని కలుస్తాడు? మళ్లీ కలిసిన తర్వాత వీరు మళ్లీ ప్రేమించుకుంటారా? అసలు వీరిద్దరిలో ఎవరు, ఎవరిని ప్రేమిస్తారు? అనేది తర్వాత కథ.
ఎలా చేశారు–
చిన్న ప్రేమ కథను ఎంత క్యూట్‌గా తీయెచ్చో తన మొదటి సినిమాతోనే ప్రూవ్‌ చేసుకున్నారు దర్శకురాలు దివ్యభావన. ఏ సినిమా దర్శకునికైనా మొదటిసినిమా ఎంతో ఛాలెంజింగ్‌గా ఉంటుంది. అటువంటి దర్శకురాలికి నిర్మాతల రూపంలో గట్టిగా సపోర్ట్‌ లభించటంతో తననుకున్న కథను చక్కగా తెరకెక్కించాను అని దివ్య పలు సందర్భాల్లో చెప్పటం మనం చూశాం. అలాగే సున్నితమైన ప్రేమకథను చెప్పాలంటే కథతో పాటు కథనం చాలా ఇంపార్టెంట్‌. ఈ విషయంలో దర్శకురాలు తనను తాను ప్రూవ్‌ చేసుకున్నారనే చెప్పాలి. ఇకపోతే సినిమాలో పాటలు బావున్నాయి. బ్రేకప్‌సాంగ్‌లో హీరో డాన్స్‌లు చక్కగా కుదిరాయి. కెమెరామెన్‌ వేణు తన పనితనాన్ని చక్కగా చూపించాడు. కొన్నిచోట్ల వచ్చే ఎమోషనల్‌ సీన్స్, డైలాగ్స్‌ సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్‌లవ్‌కి ఎంతో ఇంపార్టెన్స్‌ ఉంటుంది. అది ‘ఓ సాథియా’ సినిమాలో అణువణువునా కనిపిస్తుంది.

నటీనటులు– ఆర్యన్‌ గౌరా, మిస్తీ చక్రవర్తి, దేవీ ప్రసాద్, కల్పలత, ప్రమోదిని, అన్నపూర్ణమ్మ, శివన్నారయణ, చైతన్య గరికపాటి, క్రేజి ఖన్నా, బుల్లెట్‌ భాస్కర్, అంబరీష్‌ అప్పాజి తదితరులు
బ్యానర్‌– తన్విక–జస్విక క్రియేషన్స్‌
మాటలు– ఈశ్వర్‌ చైతన్య
సంగీతం– విన్నూ వినోద్‌
కెమెరా– ఈజె.వేణు
పాటలు– భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, రాంబాబు గోసాల
నిర్మాతలు– సుభాశ్‌ కట్టా, చందన కట్టా
దర్శకత్వం– దివ్యభావన

మైనస్‌లు–  ఫస్టాఫ్‌ కొంచెం స్లోగా ఉండటం పెద్ద నటీనటులు మిస్‌

సినిమా బలాబలాలు–
సింపుల్‌ కథ, కథనం , కెమెరా వర్క్, పాటలు,నటీనటుల పనితీరు,క్లైమాక్స్‌లో వచ్చే సీన్స్‌, నిర్మాణ విలువలు

బోటమ్‌లైన్‌
రీసెంట్‌టైమ్‌లో డీసెంట్‌ లవ్‌స్టోరీ హ్యాపీగా ఫ్యామిలీతో సినిమా చూడొచ్చు

 

రేటింగ్‌–3.5/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

reklam ajansı profesyonel logo tasarım web tasarım kurumsal web tasarım web ajansı web tasarım şirketleri web tasarım firması web yazılım firmaları en iyi web tasarım şirketleri advertising agency professional logo design web design corporate web design web agency web design companies web design firm web software companies best web design companies