బంగారు బుల్లోడు రివ్యూ

నటీనటులు : అల్లరి నరేష్, పూజ జవేరి, ప్రవీణ్
దర్శకత్వం : పి గిరి
నిర్మాత : రామబ్రహ్మం సుంకర
సంగీతం : సాయి కార్తీక్
విడుదల : జనవరి 23, 2021
రేటింగ్ : 2 / 5
‘మహర్షి’ సినిమా తరువాత అల్లరి నరేష్ హీరోగా చేసిన సినిమా ఇది. ఈ సారి సినిమాలో కామెడీనే కాదు కథ కూడా ఉండాలని అన్నీ సెట్ చేసుకొని చేసిన సినిమా ‘బంగారు బుల్లోడు‘. కోవిడ్ తర్వాత థియేటర్స్ కి ప్రేక్షకులు వస్తుండడంతో నేడు ఈ సినిమాని రిలీజ్ చేశారు. మరి ఈ సినిమాతో అయినా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి అల్లరి నరేష్ హిట్ కొట్టాడో లేదో చూద్దాం..
కథ:
సీతానగరం.. అందులో మావుళ్ళమ్మ తల్లి బాగా ఫేమస్. పెళ్లి కానివారు ఎవరు ఆమెకి మొక్కుకున్నా వెంటనే పెళ్ళైపోతుంది. కానీ అదే ఊర్లో ఉంటున్న భవాని ప్రసాద్ (అల్లరి నరేష్) అండ్ వాళ్ళ బ్రదర్స్ ఇద్దరికీ మాత్రం పెళ్లిళ్లు అవ్వవు. దానికి కారణం భవాని ప్రసాద్ తాత గారు(తనికెళ్ళ భరణి) చేసిన ఓ తప్పిదమని భవాని ప్రసాద్ కి తెలుస్తుంది. అందుకే ఆయన మనవళ్ళైన తమకి పెళ్లి కావట్లేదని తెలుసుకున్న భవాని ప్రసాద్ తాత చేసిన తప్పుని సరిదిద్ధి అమ్మవారికి పాప పరిహారం చేసుకోవాలి అనుకుంటాడు. ఇక అక్కడి నుంచి గ్రామీణ బ్యాంకు లో గోల్డ్ లోన్ డిపార్ట్మెంట్ లో పనిచేసే భవాని ప్రసాద్ ఎలాంటి ఎత్తులు వేసాడు? అమ్మవారి నగలకి – భవాని ప్రసాద్ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి? అమ్మరి నగల విషయంలో భవాని ప్రసాద్ అలాంటి ఇబ్బందులు పడ్డాడు.? ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడు? చివరికి అమ్మవారు కరుణించి భవాని ప్రసాద్ తప్పుల్ని క్షమించిందా? లేదా? అనేదే ఈ బంగారు బుల్లోడు కథ.
హైలెట్స్ :
– కథలో రాసుకున్న కీ ఎమోషన్, ఆ సీన్స్ లో తనికెళ్ళ భరణి నటన
– ఇంటర్వల్ ట్విస్ట్
మైనస్ పాయింట్ ::
– కథలో బలం లేకపోవడం
– కథనం
– నవ్వించలేకపోవడం
– బోరింగ్ గా సాగే నేరేషన్
– కామెడీ ట్రాక్స్