May 23, 2024

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

సంక్రాంతికి వచ్చేస్తున్న అల్లుడు అదుర్స్

1 min read


‘రాక్ష‌సుడు’ లాంటి సూప‌ర్ హిట్ మూవీ త‌ర్వాత యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న చిత్రం ‘అల్లుడు అదుర్స్‌స‌. న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌. సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుబ్ర‌హ్మ‌ణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప‌ర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. ఈ సినిమాలో ఒక స్పెష‌ల్ సాంగ్ లో మోనాల్ గజ్జ‌ర్ అల‌రించనుంది. అన్న‌పూర్ణ స్టూడియోలో ఆర్ట్ డైరెక్ట‌ర్ అవినాష్ కొల్ల సార‌థ్యంలో వేసిన ప్ర‌త్యేక‌మైన సెట్‌లో శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్రఫీలో బెల్ల‌కొండ సాయి శ్రీ‌నివాస్‌, సోనూసూద్‌, న‌భ న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్,‌ మోనాల్ గజ్జ‌ర్ పై ఈ స్పెష‌ల్ సాంగ్ చిత్రీకరించారు .

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో..ద‌ర్శ‌కుడు సంతోష్‌ శ్రీ‌నివాస్ మాట్లాడుతూ – “ ముందు ఈ సినిమాను ఏప్రిల్‌13న రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కాని క‌రోనా వ‌ల్ల వాయిదా ప‌డింది. అయితే ప్ర‌స్తుతం ప‌రిస్థితులు కొంత‌ మెరుగుప‌డంతో సంక్రాంతికి విడుద‌ల చేస్తున్నాం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడియ‌న్స్ అంద‌ర్నీ ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి `అల్లుడు అదుర్స్` జ‌న‌వ‌రి 15న మీ ముందుకు వ‌స్తుంది. ఈ క‌రోనా స‌మ‌యంలో మ‌న‌మంతా ప‌డ్డ క‌ష్టాల‌న్నింటిని మ‌ర్చిపోయేలా ఫుల్‌ఫ‌న్‌తో ఒక విందు భోజ‌నంలా ఉంటుంది. సాయి, న‌భా, అను, సోనూసూద్‌, ప్ర‌కాశ్ రాజ్, బ్ర‌హ్మాజీ, స‌‌ప్త‌గిరి ఇలా ఈ సినిమాలో చాలా పెద్ద ప్యాడింగ్ ఉంది. దేవిశ్రీ‌ప్ర‌సాద్ గారు అద్భుత‌మైన సాంగ్స్ కంపోజ్ చేశారు. అలాగే చోటా కె. నాయుడు గారి మంచి విజువ‌ల్స్ ఇచ్చారు. ఈ క‌రోనా స‌మ‌యంలో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ సినిమా కంప్లీట్ చేశాం. ఈ సంద‌ర్భంగా మాకు పూర్తి స‌హ‌కారం అందించిన నిర్మాత సుబ్ర‌హ్మ‌ణ్యం గారికి నా ప్ర‌త్యేక ద‌న్య‌వాదాలు. ఈ జ‌న‌వ‌రికి ఒక ఎక్స్‌ట్రార్డిన‌రీ ఎంట‌ర్‌టైన్ ఇస్తున్నాం అని ధైర్యంగా చెప్ప‌గ‌ల‌ము“ అన్నారు.

హీరో బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ మాట్లాడుతూ – “అల్లుడు శ్రీ‌ను త‌ర్వాత నేను చేస్తోన్న కంప్లీట్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ అల్లుడు అదుర్స్‌. ఈ సంక్రాంతికి త‌ప్ప‌కుండా మిమ్మ‌ల్నంద‌రినీ మంచి వినోదంతో అద్భుతంగా అల‌రిస్తుంది. ఇంత మంచి సినిమా ఇచ్చిన ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీ‌నివాస్‌గారికి, అలాగే బ‌డ్జెట్ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా అద్భుతంగా నిర్మించిన నిర్మాత సుబ్ర‌మ‌ణ్యం గారికి థ్యాంక్యూ వెరీ మ‌చ్‌. ప్ర‌తి ఆర్టిస్ట్, టెక్నీషియ‌న్ చాలా క‌ష్ట‌ప‌డి ఎంతో ఇష్టంతో ప‌నిచేశారు. వారంద‌రికీ ఈ సంద‌ర్భంగా ద‌న్య‌వాదాలు“ అన్నారు.
నిర్మాత సుబ్ర‌హ్మ‌ణ్యం గొర్రెల‌ మాట్లాడుతూ – “ మంచి ఎంట‌ర్‌టైన్ మెంట్‌తో సంతోష్ గారు సినిమాని చ‌క్క‌గా తెర‌కెక్కించారు. అలాగే సాయి గారు అద్భుతంగా న‌టించారు. బెల్ల‌కొండ సురేష్‌గారు చాలా స‌పోర్ట్ చేశారు. ఈ సినిమాలో చాలా పెద్ద ప్యాడింగ్ ఉంది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఈ సంక్రాంతికి విడుద‌ల చేస్తున్నాం. త‌ప్ప‌కుండా అంద‌రూ వ‌చ్చి థియేట‌ర్‌లోనే సినిమా చూడండి. మా సినిమాతో పాటు విడుద‌ల‌య్యే మిగ‌తా సినిమాలు కూడా మంచి విజ‌యం సాధించి ఈ ప‌రిశ్ర‌మ బాగుండాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

న‌టుడు సోనూ సూద్ మాట్లాడుతూ – “సినిమా అనేది ప్ర‌తి వ్య‌క్తికి సోల్ లాంటిది. ఈ క‌రోనా లాంటి క‌ష్ట‌స‌మ‌యం త‌ర్వాత ఆడియ‌న్స్ క‌చ్చితంగా థియేట‌ర్‌ల‌లో ఎంజాయ్ చేసే సినిమా అల్లుడు అదుర్స్‌. ఇంత మంచి సినిమాలో భాగం అయినందుకు గ‌ర్వంగా ఉంది. కందిరీగ త‌ర్వాత సంతోష్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంతో చేస్తోన్న సినిమా ఇది. అలాగే సాయి నాకు బ్ర‌ద‌ర్ లాంటి వారు. మోస్ట్ హార్డ్‌వ‌ర్కింగ్ ప‌ర్స‌న్‌. త‌న‌కి ఈ సినిమా త‌ప్ప‌కుండా మంచి పేరు తెస్తుంద‌‌ని న‌మ్ముతున్నాను. ఈ అవ‌కాశం ఇచ్చిన ప్రొడ్యూస‌ర్
సుబ్ర‌మ‌ణ్యం గారికి కృత‌జ్ఞ‌త‌లు. అలాగే ముందుండి మా అంద‌రినీ న‌డిపించిన ప్ర‌కాశ్‌రాజ్ గారికి స్పెష‌ల్ థ్యాంక్స్‌. అంద‌రూ ఎంతో క‌ష్ట‌ప‌డి సినిమా చేశారు. ప్ర‌తి ఒక్క‌రికీ ఈ సినిమా మంచి పేరు తేవాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.

హీరోయిన్ న‌భా న‌టేష్ మాట్లాడుతూ – “ ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్ చాలా ఫ‌న్నీగా ఉంటూ పెర్‌ఫామెన్స్‌కి మంచి స్కోప్ ఉంటుంది. ఆడియ‌న్స్ క‌చ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన సంతోష్ ‌గారికి థ్యాంక్యూ. సాయి వండ‌ర్‌ఫుల్ కో-స్టార్‌. ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌డం చాలా హ్యాపీగా ఫీల‌వుతున్నాను. సుబ్ర‌హ్మ‌ణ్యం గారు చాలా కూల్ ప‌ర్స‌న్‌. అలాగే సోనుసూద్‌, ప్ర‌కాశ్‌రాజ్‌, బ్ర‌హ్మాజీ ఇంత మంది సీనియ‌ర్ ఆర్టిస్టుల‌తో క‌లిసి పనిచేయ‌డం ఒక కొత్త ఎక్స్‌పీరియ‌న్స్‌. జ‌న‌వ‌రి 15న మీ ముందుకు వ‌స్తున్నాం. త‌ప్ప‌కుండా ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తాం“ అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో న‌టులు బ్ర‌హ్మాజీ, స‌ప్త‌గిరి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

reklam ajansı profesyonel logo tasarım web tasarım kurumsal web tasarım web ajansı web tasarım şirketleri web tasarım firması web yazılım firmaları en iyi web tasarım şirketleri advertising agency professional logo design web design corporate web design web agency web design companies web design firm web software companies best web design companies