Bari Movie Release on 8th April
1 min readకోడి పందేల నేపథ్యంలో రూపొందిన `బరి` ట్రైలర్ లాంచ్
ఈ నెల 8న గ్రాండ్ రిలీజ్!!
సహాన ఆర్ట్స్ పతాంకపై శ్రీమతి కమలమ్మ మరియు వెంకటేషప్ప సమర్పణలో రాజా, సహాన జంటగా రూపొందిన చిత్రం `బరి`. మునికృష్ణ సి.వి, గీతాకృష్ణ నిర్మాతలు. సురేష్ రెడ్డి దర్శకుడు. ఈ నెల 8న గ్రాండ్ గా రిలీజవుతోన్న ఈ చిత్రం ట్రైలర్ ఈ రోజు ఫిలించాంబర్ లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు వీర శంకర్ మాట్లాడుతూ…“ కోడి పందేల నేపథ్యంలో రూపొందిన `బరి` ట్రైలర్ కమర్షియల్ గా ఎంతో ఎమోషనల్ గా ఉంది. ట్రైలర్ ని బట్టి దర్శకుడి ప్రతిభ ఏంటో అర్థమవుతోంది. నిర్మాత కూడా ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్ గా తెరకెక్కించారు. కెమెరా వర్క్, సంగీతం ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ నెల 8న విడుదలవుతోన్న ఈ చిత్రం సక్సెస్ సాధించి టీమ్ అందరికీ మంచి పేరు రావాలన్నారు.
నిర్మాత మునికృష్ణ సి.వి మాట్లాడుతూ…“మా చిత్రం ట్రైలర్ లాంచ్ చేసి మా టీమ్ ని బ్లెస్ చేసిన వీర శంకర్ గారికి ధన్యవాదాలు. మా టీమ్ అందరి సహకారం వల్ల సినిమాను అనుకున్న విధంగా నిర్మించగలిగాను. మా దర్శకుడు సురేష్ రెడ్డి మంచి ప్లానింగ్ తో సినిమాను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. ఈ నెల 8న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. తెలంగాణ, ఆంధ్ర ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా“ అన్నారు.
చిత్ర దర్శకుడు సురేష్ రెడ్డి మాట్లాడుతూ…“ మా నిర్మాత పూర్తి సహకారం వల్ల సినిమాను క్వాలిటీతో తెరకెక్కించగలిగాను. పూర్తి స్థాయిలో కోడి పందేల నేపథ్యంలో జరిగే పక్కా విలేజ్ స్టోరి ఇది. ఈ నేపథ్యంలో గతంలో సినిమాలు వచ్చినప్పటికీ ఇది పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. మా హీరో హీరోయిన్స్ నేను డిజైన్ చేసుకున్న పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మా చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా“ అన్నారు.
హీరోయిన్ సహాన మాట్లాడుతూ…“మా పేరెంట్స్ వల్ల నేను హీరోయిన్ గా నటించాలన్న కోరిక ఈ సినిమాతో నెరవేరింది. డైరక్టర్ సురేష్ గారు అందరికీ నచ్చేలా సినిమా తీశారు. మా సినిమాను గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా“ అన్నారు.
హీరో రాజా మాట్లాడుతూ…“ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. మా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మా మీద ఎంతో బడ్జెట్ పెట్టారు. హీరోయిన్ గా సహాన మంచి సపోర్ట్ ఇచ్చిందన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సావిత్రి, సునీత మనోహర్, అరుణ్, శ్రీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి సంగీతంః మహవీర్; సినిమాటోగ్రఫీః వారి అనిల్ కుమార్ రెడ్డి; ఎడిటర్ః శ్రీకృష్ణ అత్తలూరి; కొరియోగ్రఫీః బాల నరసింహా; రచన సహకారంః వేణు కె నాని, వెంకట్ చల్లగుండ్ల; పీఆర్వోః చందు రమేష్; నిర్మాతలుః మునికృష్ణ సి.వి, గీతాకృష్ణ; కథ-మాటలు-స్ర్కీన్ ప్లే-దర్శకత్వంః సురేష్ రెడ్డి.