May 23, 2024

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

“Battala Ramaswamy Biopikku’ digital release on ZEE5 from May 14th

2 min read
Hyderabad, 6th May 2021: Leading OTT platform ZEE5 has been constantly bringing out direct-to-digital releases, original web series, and new movies to cater to its patrons. In 2020, it released ‘Amrutha Ramam’ directly on digital platform. Then came ’47 Days’ and ‘Meka Suri’, besides several other web series and movies on Zee 5. This year, ‘Battala Ramaswamy Biopikku’ is getting ready to be streamed on ZEE5. It’s a direct-to-digital release. ‘Room No. 54’ is ZEE5’s other major release this month. ZEE5 is kickstarting this year with these two-original content-driven products.

Altaf Hassan, Shanthi Rao, Satvika Jay, and Lavanya Reddy are headlining ‘Battala Ramaswamy Biopikku’. The new-age comedy entertainer will stream on ZEE5 from May 14. Writer-director Ram Narayan and Seven Hills Productions’s I Satish Kumar and Mango Media’s Ramakrishna Veerapaneni today said that they are happy that ‘Battala Ramaswamy Biopikku’ is going to be released directly and stream on ZEE5.
Coming to the story of ‘Battala Ramaswamy Biopikku’, it’s about Ramaswamy, whose has two major ambitions in his life. One is that he wants to practise monogamy and wants to be like Lord Rama. The other one is that he wants to shine in the business of selling sarees. As he wished, He falls in love with Jayaprada, who is a vendor, and marries her. But later, due to some unforeseen circumstances, he ties the knot with two other women. How did Ramaswamy, who has always wanted to marry only one woman, ended up marrying three? What followed next? That is what the comedy is all about.

The film’s teaser begins with a character saying that every life is worthy of a biopic. The titular role has been played by Altaf Hassan. Music for the movie is by RP Patnaik.

On Zee 5,’Battala Ramaswamy Biopikku’ will release on May 14th and Room No 54 On May 21st.  All are aware that Salman Khan-starrer ‘Radhe’ (Hindi) will stream on ZeePlex from May 13th.

—————————————————–
జీ 5లో ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ ఎక్స్‌క్లూజివ్‌ & డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్
వీక్షకులకు వినోదం అందించడమే పరమావధిగా డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ సినిమాలు, ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, సరికొత్త సినిమాల విడుదలతో ఎప్పటికప్పుడు  సందడి చేస్తున్న అగ్రగామి ఓటీటీ వేదిక జీ 5. గత ఏడాది ఏప్రిల్‌లో ‘అమృతరామమ్’ సినిమాను డైరెక్టుగా డిజిటల్ రిలీజ్ చేసింది జీ 5. ఆ తర్వాత ’47 డేస్’, ‘మేక సూరి’ను వీక్షకులకు అందించింది. ఇంకా అనేక  వెబ్ సిరీస్‌లు, సినిమాలతో ఆకట్టుకుంది. ఈ ఏడాది ‘బట్టల రామస్వామి బయోపిక్’ సినిమాతో డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లకు శ్రీకారం చుడుతోంది జీ 5. ఆ తర్వాత ‘రూమ్ నంబర్ 54’ వెబ్ సిరీస్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ రెండు ప్రాజెక్టులతో ఈ ఏడాది ఒరిజినల్ కంటెంట్ రిలీజ్‌లను జీ5 స్టార్ట్ చేసింది.
అల్తాఫ్ హసన్, శాంతి రావ్, సాత్విక, లావణ్యరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బట్టల రామస్వామి బయోపిక్కు’, మే 14న జీ 5లో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల కానుంది. న్యూ ఏజ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా అందర్నీ నవ్విస్తుందని జీ5 ప్రతినిధులు తెలిపారు. జీ5తో అసోసియేట్ కావడం, తమ సినిమాను జీ5లో విడుదల చేస్తుండటం చాలా సంతోషంగా ఉందని సినిమా దర్శకుడు రామ్ నారాయణ్, నిర్మాతలు ‘సెవెన్ హిల్స్’ సతీష్ కుమార్ ఐ, ‘మ్యాంగో మీడియా’ రామ కృష్ణ వీరపనేని చెప్పారు.
‘బట్టల రామస్వామి బయోపిక్కు’ కథ విషయానికి వస్తే… రామస్వామికి జీవితంలో రెండంటే రెండే లక్ష్యాలు ఉంటాయి. ఒకటి… శ్రీరాముడిలా ఒక్కరిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. రెండు… చీరల వ్యాపారం చక్కగా చేసుకోవాలి. కోరుకున్నట్టుగా… వీధుల్లో నగలు అమ్మే జయప్రదను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు రామస్వామి.. అయితే, అనుకోని పరిస్థితుల్లో మరో ఇద్దరి మెడలో మూడు ముడులు వేస్తాడు. ఒక్కరిని పెళ్లి చేసుకోవాలనుకున్న రామస్వామి ముగ్గుర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఆ తర్వాత ఏమైంది? అనేది తెలుసుకుని కడుపుబ్బా నవ్వుకోవాలంటే… మే 14న జీ5 ఓటీటీ ఓపెన్ చేయాల్సిందే.
‘తీసేవాడు ఉండాలే కానీ ప్రతివాడి బ్రతుకూ ఒక బయోపిక్కే’ డైలాగ్‌తో ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రామస్వామి పాత్రలో అల్తాఫ్ హాసన్ నటించారు. ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు.
మే 14న ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ విడుదల చేస్తున్న జీ 5, మే 21న ‘రూమ్ నంబర్ 54’ వెబ్ సిరీస్ ను  వీక్షకుల ముందుకు తీసుకు రానున్నది. మే 13న ‘జీప్లెక్స్’లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన బాలీవుడ్ మూవీ ‘రాధే’ విడుదల కానున్న సంగతి అందరికి  తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

reklam ajansı profesyonel logo tasarım web tasarım kurumsal web tasarım web ajansı web tasarım şirketleri web tasarım firması web yazılım firmaları en iyi web tasarım şirketleri advertising agency professional logo design web design corporate web design web agency web design companies web design firm web software companies best web design companies