December 2, 2023

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

Bhanu Sri’ s Survey No3 Movie Launch

1 min read

భానుశ్రీ ప్రధాన పాత్రలో ‘సర్వే నెం.3’ చిత్రం ప్రారంభం

వాయిజా సినీ క్రియేషన్స్ పతాకంపై బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీ ప్రధాన పాత్రలో.. డి. రామకృష్ణ (ఆర్.కె) దర్శకత్వంలో మేకా హేమసుందర్(మేకా ప్రసాద్) నిర్మిస్తోన్న చిత్రం ‘సర్వే నెం.3’. ఓ ప్రముఖ హీరో గెస్ట్ పాత్రలో నటించనున్న ఈ చిత్రం శనివారం (జూన్ 5) పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘బిల్లా’ మూవీ నిర్మాత డి. నరేందర్, నిర్మాత బెల్లంకొండ సురేష్ హాజరై చిత్రయూనిట్‌ను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.కె. మాట్లాడుతూ.. ‘‘మా నిర్మాత హేమసుందర్‌గారికి ఈ కథ ఎంతగానో నచ్చింది. ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు ఆయన ఎంతగానో సపోర్ట్ అందిస్తున్నారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము. మా చిత్ర పూజా కార్యక్రమాలకు వచ్చి.. మమ్మల్ని ఆశీర్వదించిన పెద్దలందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు.

నిర్మాత మేకా హేమసుందర్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా మా యూనిట్‌ని ఆశీర్వదించడానికి వచ్చిన నిర్మాతలు డి. నరేందర్‌గారికి, బెల్లంకొండ సురేష్‌గారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు. వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరగడం చాలా సంతోషంగా ఉంది. వారికి మరొక్కసారి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చిత్రం విషయానికి వస్తే.. కథ నాకు చాలా బాగా నచ్చింది. ఇది నాకు రెండో సినిమా. ఈ కరోనా టైమ్‌లో అసలు సినిమా నిర్మించాలని అనుకోలేదు. కానీ ఈ స్టోరీ విన్నాక ఎంతో ఎగ్జయిట్ అయ్యాను. ఖచ్చితంగా ఈ కథను ప్రేక్షకులకు అందించాలని అనిపించింది. అందుకే ఈ మూవీ స్టార్ట్ చేశాను. కథకు అనుగుణంగా ఆర్టిస్ట్‌లు కూడా చక్కగా కుదిరారు. ప్రముఖ హీరో ఈ చిత్రంలో గెస్ట్‌గా నటించనున్నారు. ఆ వివరాలన్నీ త్వరలోనే తెలియజేస్తాము..’’ అని అన్నారు.

బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ, దిల్ రమేష్, విజయ్, రమణారెడ్డి, ఇంతియాజ్, రాజేష్ తదిరులు నటించనున్న ఈ చిత్రానికి రచన-సహకారం: కె. మాణిక్యాలరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: పి. రమణారెడ్డి, శ్రీనివాస్; నిర్మాత: మేకా హేమసుందర్, దర్శకత్వం: డి. రామకృష్ణ(ఆర్.కె).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *