మెగా ఛాన్స్ కొట్టేసిన క్రాక్ దర్శకుడు ?

ఈ సంక్రాంతి పండగకు క్రాక్ సినిమా విడుదలై సూపర్ హిట్ అయిన సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి గోపీచంద్ కు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పాడట. ఈ సినిమాను కుటుంబం తో కలిసి షో చుసిన మెగాస్టార్ వెంటనే దర్శకుడికి కాల్ చేసి అభినందనలు తెలియచేయడమే కాకుండా.. ఒక్కసారి వచ్చి కలవు అని చెప్పాడట? దాంతో ఈ దర్శకుడికి మెగా ఛాన్స్ దక్కినట్టే అంటూ ప్రచారం జరుగుతుంది. చిరు, దర్శకుడు గోపీచంద్‌తో మాట్లాడుతూ ఒంగోలుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారట. చిరంజీవి విద్యాభ్యాసం కోసం కొన్నాళ్లు ఒంగోలులో ఉన్నారనే విషయం మనకు తెలిసిందే. ఒంగోలులో తన అనుభవాల గురించి చాలాసార్లు, చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ‘క్రాక్’ సినిమా చూశాక చిరంజీవి మరొకసారి నాటి రోజులు గుర్తొచ్చాయట.
గోపీచంద్ కూడా అక్కడి వ్యక్తి కావడంతో, ఆ రోజుల గురించి మాట్లాడుకున్నారట. సినిమాల చూపించిన చాలా సీన్స్, విషయాల గురించి వారి మధ్య చర్చకు వచ్చాయట. ఒంగోలులో రాత్రి 8 తర్వాత కరెంట్ ఆపి మర్డర్లు చేయడం, వేటపాలెం హత్యలు లాంటివి మాట్లాడుకున్నారట. సినిమా ముచ్చట్లు అన్నీ అయిపోయాక… గోపీచంద్‌కు చిరంజీవి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడని తెలుస్తోంది. సో మెగాస్టార్ రమ్మన్నాడు కాబట్టి.. గోపీచంద్ త్వరలోనే ఆయనను కలవడానికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ కు కూడా కథ చెప్పే అవకాశం ఉందేమో అన్న టాక్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ మంచి కథ చూడు మనం చేద్దాం అని చిరంజీవి అన్నాడంటే ఇక గోపీచంద్ కెరీర్ మలుపు తిరిగినట్టే ?