October 1, 2022

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

హీరో గోపీచంద్ తో మారుతి సినిమా?

ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ త‌రువాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేయ‌బోయే సినిమా పై అంతటా ఆస‌క్తి, ఉత్కంఠ నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే, ఈ నేప‌థ్యంలో మ్యాచో హీరో గోపీచంద్ తో ఓ సూప‌ర్ డూప‌ర్ క‌మ‌ర్షీయ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ ని తెర‌కెక్కించ‌డానికి రంగం సిద్ధం చేశారు ద‌ర్శ‌కుడు మారుతి. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ‌లు జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీంతో ముచ్చ‌ట‌గా మూడోసారి జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ – బ‌న్నీవాసు – మారుతి కాంబినేష‌న్ సెట్ అయింది. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ ద్వారానే మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్స్ బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ చంద్ – మారుతి కాంబినేష‌న్ లో సినిమా రాబోతుంద‌నే ప్ర‌క‌ట‌న‌ కూడా వైవిధ్యంగా ఉండేలా ప్లాన్ చేయ‌డం జ‌రిగింది. ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత మారు‌తి చేయ‌బోయే సినిమా పై వ‌చ్చిన పుకార్ల‌కు సెటైర్లు వేస్తూ, మారుతి మార్క్ స్టైల్ లో ఓ హ్యూమ‌ర‌స్ వీడియోని సిద్ధం చేసి విడుద‌ల చేశారు, ప్ర‌స్తుతం ఈ ఎనౌన్స్ మెంట్ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ వీడియోకి ప్ర‌ముఖ న‌టుడు రావుర‌మేశ్ గారి వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డం కొసమెరుపు. గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ రాబోతుంది, దీనికి సంబంధించిన టైటిల్ లుక్, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ త్వ‌ర‌లో అధికారికంగా విడుద‌ల అవ్వ‌బోతున్నాయి.

హీరో – గోపీచంద్
స‌మ‌ర్ప‌ణ – అల్లు అరవింద్
బ్యాన‌ర్ – జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్
నిర్మాత‌ – బ‌న్నీవాసు
ద‌ర్శ‌కుడు – మారుతి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *