దేశముదురు సినిమా వద్దన్న సుమంత్ ?
పూరి జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన చిత్రం దేశముదురు సినిమాలో హీరోగా నేనే నటించాల్సింది అని అంటున్నాడు హీరో సుమంత్. ముందు ఈ కథను పూరి జగన్నాధ్ తనకే చెప్పాడట .. !! కానీ తాను ఆ సినిమాకు సెట్ కానని తిరస్కరించాడట సుమంత్ ? తాజగా హీరో సుమంత్ నటించిన కపటదారి సినిమా విడుదల సందర్బంగా మీడియా తో ఇంటరాక్ట్ అయిన సుమంత్ పలు విషయాలను పంచుకున్నారు. ‘ఓసారి దర్శకుడు పూరీ జగన్నాథ్ నన్ను సంప్రదించారు. మాస్, కమర్షియల్ హంగులున్న కథ చెప్పారు. కథ నాకెంతో నచ్చింది. కానీ అది నాకు సెట్ కాదని, ఆ కథను నేను సూట్ అవ్వనని సున్నితంగా తిరస్కరించాను. ఆ తర్వాత పూరీ.. అల్లు అర్జున్ హీరోగా పెట్టి తీసిన సినిమా ‘దేశముదురు’, అని చెప్పారు. నిజంగా ఆ సినిమా కనుక నేను చేసి ఉంటే తప్పకుండా ఫ్లాప్ అయి ఉండేది. బన్నీ చేశాడు కాబట్టే అది హిట్ అయ్యింది.’’ అని తన మనసులోని మాటను బయటపెట్టాడు సుమంత్? కథల విషయంలో చాలా క్లారిటీగా ఉంటానని, కథ చెప్పేటప్పుడు హాఫ్ ఆన్ అవర్ లోనే మనం చేయాల్సిన సినేమానా కదా అన్నది తెలిసిపోతుందని అన్నారు. అయన హీరోగా నటించిన కపటదారి సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టి హిట్ టాక్ తో దూసుకుపోతుంది ? అది విషయం !!