కథ చాలా రియలిస్టిక్ గా చెప్పాం : నటుడు జేడీ చక్రవర్తి
ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘70 ఎమ్‌ఎమ్’. ఎన్.ఎస్.ఈ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షత శ్రీనివాస్, మనోజ్ నందన్, అక్షిత, బెనర్జీ, సంపూర్ణేశ్ బాబు, జబర్దస్త్ నటులు ఆర్పీ, చమ్మక్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ ప్రొడక్షన్స్, జేకే క్రియేషన్స్ పతాకంపై రాజశేఖర్, ఖాసీం నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 26న ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజవుతున్న సందర్భంగా జేడీ చక్రవర్తి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
ఈ ప్రాజెక్ట్ ఎలా ..
– ఈ సినిమా లాక్‌డౌన్‌కి ముందే షూటింగ్ పూర్తయ్యింది. మార్చి19న రామ్‌గోపాల్ వర్మగారితో ట్రైలర్‌కూడా రిలీజ్ చేశాం. ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. బిజినెస్ ఆఫర్స్ కూడా బాగా వచ్చాయి అని చెప్పారు. అంతలో లాక్‌డౌన్ మొదలైంది. ఆ తర్వాత సినిమాలు విడుదలై బాగా ఆడుతుండడంతో ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నాం.
టైటిల్ గురించి ..
– టైటిల్ అందరికీ అర్ధం అయితేనే సినిమా ఆడుతుందని నేను నమ్మను. టైటిల్ అర్ధం కాకపోయినా సినిమాలు ఆడుతాయనే నమ్మకంతో ముందు ఎమ్ఎమ్ఓఎఫ్ అని పెట్టడం జరిగింది. అయితే నిర్మాతల సలహా మేరకు 70 ఎమ్ ఎమ్ అని టైటిల్ మార్చాం. 70 ఎమ్ ఎమ్ అనేది ఎమ్ఎమ్ఓఎఫ్ రిఫ్లెక్షన్‌లోనే తెలుస్తుంది.
బేసిక్ స్టోరీ లైన్ …
– ఈ మూవీ పూర్తి స్థాయిలో రియలిస్టిక్ గా ప్రజెంట్ చేయబడింది. ఇది హారర్ చిత్రం కాదు. సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సినిమాలో వాళ్ల నాన్న ఇచ్చిన పాత సింగిల్ స్క్రీన్ థియేటర్ అమ్మడం ఇష్టం లేక పాత సినిమాలు, శృంగార చిత్రాలు నడుపుకుని జీవనం సాగిస్తున్న టైమ్‌లో ఆ థియేటర్‌లో అనుకోకుండా ఒక మర్డర్ జరుగుతుంది. హత్య జరిగినప్పుడు పోలీసులకి చెప్తే ఎక్కడ థియేటర్ మూసేస్తారో అని ఆ థియేటర్‌లో వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో పూడ్చిపెడతారు. దాంతో సమస్య తీరిపోయింది అని అనుకుంటారు. కాని క్రమంగా ఆ థియేటర్‌లలో హత్యలు జరుగుతూనే ఉంటాయి. ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు. అసలు ఆ థియేటరలోనే మర్డర్స్ ఎందుకు జరుగుతున్నాయి అనేది మిగిలిన కథాంశం. క్లైమాక్స్ చాలా అద్బుతంగా వచ్చింది. ఈ సినిమాకి యూఎస్‌పి అదే. లాజికల్‌గా సినిమా ఆడుతుందనే నమ్మకం ఉంది.
అక్షిత శ్రీనివాస్ …
– ఈ సినిమాలో అక్షత. అక్షిత శ్రీనివాస్ అని ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. అక్షిత శ్రీనివాస్ చాలా ప్రొఫేషనల్‌గా చేసింది. బాగా ఎంతుజియాస్టిక్ పర్సన్. అన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటుంది.
మ్యూజిక్ గురించి …
– పాటలకి జాను సంగీతం అందించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం సాయి కార్తిక్ చేశాడు. ఈ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. కార్తిక్ తన మ్యూజిక్‌తో ఈ సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాడు.
ఎన్ఎస్ఈ అంటే ..
– నేను మాత్రం కాదండీ. ఎందుకంటే నేను గతంలోజేడీ చక్రవర్తి పేరుతో తెలుగు, తమిళ సినిమాలు డైరెక్ట్ చేశాను. కాబట్టి నా పేరు మార్చుకోవాల్సిన అవసరంగానీ, దాచుకోవాల్సిన అవసరం నాకు లేదు. దయచేసి డైరెక్టర్ పేరుని ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారో, అసలు డైరెక్టర్ అమ్మాయా? అబ్బాయా? అని ప్రొడ్యూసర్స్‌ని అడిగి తెలుసుకోండి.